The Raaja Saab : ప్రభాస్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా రాజా సాబ్. సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా ఏళ్లు తర్వాత ప్రభాస్ మళ్ళీ ఎంటర్టైన్మెంట్ రోల్ లో కనిపిస్తున్నారు. కొద్దిసేపటికి ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలైంది.
మూడు నిమిషాల 34 సెకండ్లు ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. నిజంగా దర్శకుడు మారుతి ఊహించిన దానికంటే ఈ ట్రైలర్ తో ఇంకా ఎక్కువ ఇచ్చాడు అని చెప్పాలి. కేవలం హర్రర్ మాత్రమే కాకుండా, కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ వీటన్నిటిని కూడా పుష్కలంగా ఈ సినిమాలో పొందుపరిచాడు అని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. అలానే సినిమా రిలీజ్ కి మూడు నెలలు ముందు ట్రైలర్ రిలీజ్ చేశారంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటో తెలుస్తుంది.
రాజా సాబ్ సినిమా డిసెంబర్ 5న విడుదల చేస్తున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు. అది బాలీవుడ్ మార్కెట్ కి మంచి ప్లేస్ అవుతుంది. కానీ తెలుగు మార్కెట్ కి మంచి ప్లస్ అవ్వాలి అంటే సంక్రాంతి సీజన్ మంచిది అని జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన ట్రైలర్ లో కూడా ఇది కన్ఫర్మ్ చేశారు.
కానీ తమిళ్లో మాత్రం ఈ సినిమాను ఒకరోజు లేటుగా రిలీజ్ చేస్తారు. ఈ సినిమా ట్రైలర్ తెలుగు, మలయాళం, తమిళ్లో విడుదలైంది. తమిళ్ ట్రైలర్ గమనిస్తే లాస్ట్ లో రిలీజ్ డేట్ వేసినప్పుడు జనవరి 10 అని వేశారు. అంటే ఈ సినిమా అక్కడ ఒకరోజు లేటుగా విడుదలవుతుంది. అన్ని భాషల్లోనూ జనవరి 9న రిలీజ్ అయిపోతుంది.
హెచ్ వినోద్ దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న సినిమా జన నాయగన్. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పొలిటికల్ గా కూడా బిజీ అయిపోయాడు విజయ్. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వగానే అతనికి కూడా కొన్ని అనూహ్య సంఘటనలు ఎదురయ్యాయి. అతని సభకి వచ్చి కొంతమంది ప్రాణాలు కోల్పోవడం అనేది కోలీవుడ్ వర్గాల్లోనే కాకుండా యావత్ దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది.
ఇకపోతే జననాయగన్ అనే సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలవుతుంది. సినిమా తెలుగులో కూడా డబ్బింగ్ రూపంలో వస్తుంది. 9న ఈ సినిమా విడుదలవుతుంది కాబట్టి రాజా సాబ్ సినిమాను దీనితో పోటీ లేకుండా ఒకరోజు లేటుగా తమిళ్లో విడుదల చేస్తున్నారు.
Also Read : Sobhita Dhulipala : తమిళ్ ప్రాజెక్టుకు శోభిత గ్రీన్ సిగ్నల్, క్రేజీ కాంబినేషన్ కంప్లీట్ డీటెయిల్స్