Kantara Chapter 1 Ticket Rates: పాన్ ఇండియా ట్రెండ్ వచ్చాక తెలుగు సినిమాల క్రేజ్ పెరిగింది. అంతేకాదు వరల్డ్ వైడ్‌గా తెలుగు సినిమాలు మంచి మార్కెట్ చేస్తున్నాయి. ఇక పాన్ ఇండిమా సినిమా అయితే చాలు టికెట్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. పీవీఆర్, ఐనాక్స్, ఐ మ్యాక్స్ వంటి మల్టీప్లెక్స్ సినిమా చూడాలంటే సామాన్యులు జంకుతున్నాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మల్టీప్లెక్స్ వెళ్లాలంటే అమ్మో అంటున్నారు. ఆడియన్స్ ని మూవీ టికెట్ రేట్స్ సమస్య వెంటాడుతుంది. ముఖ్యంగా ప్రీమియర్స్ టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది ఒక్క ఇండియాలోనే కాదు.. ఓవర్సిస్లోనూ ఇదే సమస్య.
అక్కడ అన్ని భాషల్లో సినిమా టికెట్ రేట్ ఒకలా ఉంటే.. తెలుగు సినిమా టికెట్ రేట్లు మరోలా ఉంటున్నాయి. ఓవర్సిస్లో తెలుగు మూవీ డిస్ట్రీబ్యూటర్స్ ఆడియన్స్ని దోచేస్తున్నారంటూ తరచూ వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఇది ప్రూవ్ అయ్యింది. మొన్నటి మొన్న వార్ 2 మూవీ టైంలో డిస్ట్రీబ్యూటర్ల నిలువు దోపిడి బట్టబయలు అయ్యింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా హిందీలో తెరకెక్కిన ‘వార్ 2′ మూవీ గతనెల విడుదలైంది. ముందు రోజు ఇండియాతో పాటు ఓవర్సిస్లో మూవీ ప్రీమియర్స్ పడ్డాయి. తెలుగు, హిందీలో రిలీజ్ అవ్వగా.. ఈ సినిమా హిందీ వెర్షన్ 36 డాలర్లు అయితే.. అదే తెలుగు వెర్షన్ కి 60 డాలర్లు చార్జ్ చేశారు.
రెండు ఒకే సినిమా, పైగా హిందీతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు వెర్షన్కి అంత రెట్లు ఏంటని ఆడియన్స్ షాక్ అయ్యారు. ఇప్పుడు ఇలాంటి అనుభవమే మళ్లీ తెలుగు ఆడియన్స్కి ఎదురైంది. మరికొన్ని రోజుల్లో కన్నడ మూవీ కాంతార: చాప్టర్ 1 విడుదల కాబోతోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 2న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఒపెన్ అయ్యాయి. ఇక్కడ కాంతార హిందీ వెర్షన్ 10.25(ఇండియన్ కరెన్సీలో రూ. 910) డాలర్లు ఉంటే తెలుగు వెర్షన్కి 20 డాలర్లు (రూ. 1774) ఉంది. రెండు డబ్బింగ్ వెర్షన్లే.. అయినా ఒకే సినిమాకి టికెట్ల రేట్స్ విషయంలో ఇంత వ్యత్యాసమేంటని ప్రశ్నిస్తున్నారు.
Also Read: Chiranjeevi: హైదరాబాద్ వచ్చిన చిరంజీవి.. బాలయ్య వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన మెగాస్టార్
అదే థియేటర్.. అదే టైం.. అదే సినిమా.. కానీ హిందీ లాంగ్వేంజ్ టికెట్ ధర మాత్రం 10.25 డాలర్లు (దాదాపు 910 రూపాయలు) ఉంటే, తెలుగు వెర్షన్ మూవీ టికెట్ రేట్ 20 డాలర్లు ఉంది. ఇదంత చూస్తుంటే అక్కడి తెలుగు డిస్ట్రీబ్యూటర్స్.. తెలుగు ఆడియన్స్ని నిలువు దోపిడి చేస్తున్నారనిపిస్తుంది. ఇప్పటికే చాలా సినిమాలకు అది ప్రూవ్ అయింది. ఇప్పుడు కాంతార: చాప్టర్ 1 మూవీ టైంలో మరోసారి ఇది ప్రూవ్ అయ్యింది. ఈ విషయమై అక్కడి తెలుగు ఆడియన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ తగ్గాలని, ఒకే సినిమాలకు టికెట్ రేట్స్ విషయంలో ఇంత వ్యత్యాసం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో మూవీ నిర్మాతలు చొరవ తీసుకుని.. టికెట్ రేట్స్ పెంపుపై నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు.