Bigg Boss 9 Promo:ఎప్పటికప్పుడు సరికొత్త అనుభవాలతో ప్రేక్షకులను అలరించడానికి ముందుకొచ్చిన షో బిగ్ బాస్.. ఇప్పటికే తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తి కాగా.. ఇప్పుడు తొమ్మిదవ సీజన్ కూడా అప్పుడే మూడు వారాలు పూర్తి చేసుకుంది.ఇప్పుడు నాలుగవ వారానికి సంబంధించి నామినేషన్స్ నుంచి బయటపడాలి అంటే ఇమ్యూనిటీ టాస్క్ లో గెలవాల్సిందే అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఒక టాస్క్ ఇచ్చారు. అందులో భాగంగానే ఈ టాస్క్ లో కంటెస్టెంట్స్ కూడా ఎవరికి వారు తమ పర్ఫామెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు.
ఇకపోతే ఇమ్యూనిటీ టాస్క్ లో భాగంగా మొదటి టాస్క్ బ్లాక్స్ ను పగలగొట్టి స్టార్ ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు రెండవ టాస్క్ సంబంధించిన మరో ప్రోమోని నిర్వహకులు విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమోలో ఏముంది అనే విషయం ఇప్పుడు చూద్దాం. రెండవ టాస్క్ లో భాగంగా “వారధి కట్టు ఇమ్యూనిటీ పట్టు”.. పోటీదారులు చేయాల్సిందల్లా మీకు కేటాయించిన బ్రిడ్జెస్ కి ఉపయోగపడే బ్లాక్స్ మిగతా ఇంటి సభ్యుల దగ్గర ఉంటాయి. వాటిని పొందడానికి ఆ పోటీ దారులు.. ఇంటి సభ్యులను కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. అంటూ బజర్ మోగిస్తారు బిగ్ బాస్.
మిస్టేక్ ను సరి చేసుకున్న భరణి శంకర్..
మొదట భరణి శంకర్ తన బ్లాక్ తీసుకొచ్చి.. కరెక్ట్ గా జడ్జి చేయలేకపోవడం వల్లే నావల్ల తనూజ కూడా ఇబ్బంది పడింది. అందుకే ఆ మిస్టేక్ ను సరి చేసుకోవడానికి నేను తనుజాకు నా దగ్గర ఉన్న బ్లాక్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటూ తెలిపారు. అలాగే ఇమ్మానుయేల్ వచ్చి తన బ్లాక్ సుమన్ కి ఇవ్వాలనుకుంటాను అంటూ చెప్పి అదే సమయంలో దివ్యతో గొడవ కూడా పడాల్సి వస్తుంది. గేమ్ లో సుమన్ అన్న ఎఫెక్ట్ బాగా పెట్టాడని నాకు అనిపిస్తోంది అంటూ చెప్పగా.. దివ్య మాట్లాడుతూ నేను కింద నుంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఆయన అక్కడికి వెళ్ళగలిగాడు అంటూ మధ్యలో మాట్లాడింది.
ALSO READ:Animal Park Update : సందీప్ రెడ్డి యానిమల్ పార్క్‌పై హీరో సాలిడ్ అప్డేట్… రిలీజ్ డేట్ కూడా.!
కామనర్స్ మధ్య హీట్ పుట్టించిన టాస్క్..
తర్వాత దమ్ము శ్రీజ కూడా వ్యాలీడ్ పాయింట్స్ తో దివ్యను తికమక పట్టించేసింది. మూడు వారాలు మీరు హౌస్ లో లేరు. ఇప్పుడు మీకు ఇమ్యూనిటీ పవర్ ఇచ్చేస్తే మిగతా హౌస్ సభ్యులకు ఇది డిసడ్వాంటేజెస్. ఒకవేళ నేను నామినేషన్స్ లో ఉంటే కూడా నేను సేవ్ అవ్వడానికి చూసుకోవడమే కాకుండా ఎదుటివారిని కూడా సేవ్ చేయాలి. అంటూ చెబుతుంది. అలా ఇద్దరి మధ్య కూడా కాస్త ఈ ఇమ్యూనిటీ టాస్క్ హీట్ పుట్టించింది అని చెప్పవచ్చు. మొత్తానికైతే తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమోలో రెండవ టాస్క్ లో ఎవరు గెలుస్తారో అనే విషయం కంటెస్టెంట్స్ చేతుల్లోనే ఉంది అని చెప్పాలి.