Avika Gor: చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితమైన వారిలో నటి అవికా గోర్(Avika Gor) ఒకరు. ఈమె అసలు పేరు అవికా గోర్ అని పిలిస్తే ఎవరు గుర్తుపట్టుకుపోవచ్చు కానీ చిన్నారి పెళ్ళికూతురు అంటే మాత్రం అందరికీ ఈమె గుర్తుకు వస్తుంది. అంతలా చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా అందరికీ ఆనందిగా గుర్తుండిపోయింది. ఇలా ఈ సీరియల్ తో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం తెలుగులో ఉయ్యాల జంపాల అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు అనంతరం తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి.
ఇలా తెలుగు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న అవికా ఇటీవల సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. ఇలా తన కెరియర్ పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వాని(Milind Chandwani) అనే వ్యక్తితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ ఏడాది జూన్ నెలలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం(Engagment) జరుపుకున్నారు. అయితే త్వరలోనే వీరి వివాహం జరగబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం సెప్టెంబర్ 30వ తేదీ ఎంతో ఘనంగా జరగబోతుందని ఇటీవల వెల్లడించారు. ఇలా ఈమె వివాహానికి కొంత సమయమే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పెళ్లి పనులను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.
తాజాగా అవికా తన ప్రీ వెడ్డింగ్ (Pre Wedding) సెలబ్రేషన్స్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇందులో భాగంగా మెహందీ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించినట్టు తెలుస్తుంది. తన కుటుంబ సభ్యులందరూ ఈ మెహందీ వేడుకలలో పాల్గొని సందడి చేయడమే కాకుండా ఆటపాటలతో ఎంతో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇక అవికా మిలింద్ ఇద్దరు కూడా ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రస్తుతం వీరి మెహందీ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
నిర్మాతగా అవికా గోర్..
ఇకపోతే ఈమె వివాహం ఎక్కడ జరుగుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఈ జంటకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అవిక కెరియర్ విషయానికి వస్తే ఉయ్యాల జంపాల సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం సినిమా చూపిస్త మామ, లక్ష్మీ రావే మా ఇంటికి, రాజు గారి గది3, ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాలలో నటించి తెలుగులో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఈమె షణ్ముఖ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇలా నటిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కొనసాగుతూ మరోవైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నారు.
Also Read: Srinidhi Shetty: రామాయణ అసలు సీత శ్రీనిధి శెట్టినా…మరి సాయి పల్లవి ?