E-Paper
Advertisement

TV Heroines : ఈ కన్నడ సీరియల్ నటి చాలా చాలా రిచ్.. ఎంత సంపాదించిందో తెలిస్తే ఏమైపోతారో!

TV Heroines : ఈ కన్నడ సీరియల్ నటి చాలా చాలా రిచ్.. ఎంత సంపాదించిందో తెలిస్తే ఏమైపోతారో!
Advertisement

Kannada Heroines : సినిమా ఇండస్ట్రీలో కన్నడ హీరోయిన్లు ఎక్కువగా సందడి చేస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న నుంచి నిన్న వచ్చిన రుక్మిణి వసంత వరకు ఎంతోమంది ఆ ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీకి వచ్చి హవాని కొనసాగిస్తున్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాదు సీరియల్ లో కూడా కన్నడ హీరోయిన్ల హవానే ఎక్కువగా కనిపిస్తుంది. ఈమధ్య ప్రతి తెలుగు సీరియల్ లో కూడా హీరోయిన్ పాత్రలో కన్నడ ముద్దుగుమ్మలే కనిపిస్తున్నారు.. కన్నడలో ఎన్నో సీరియల్స్లలో నటించి బాగా పాపులర్ అయిన ముద్దుగుమ్మలు ఇప్పుడు తెలుగులో కూడా సత్తాని చాటుతున్నారు. అయితే ఇప్పుడు సీరియల్స్ ద్వారా కోట్లు సంపాదించిన కన్నడ హీరోయిన్లు ఎవరు అన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది. మరి సీరియల్స్ తో ప్రేక్షకులను అదరించిన బ్యూటిలలో ఇప్పుడు ఎవరు అత్యధిక ధనవంతులో అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కన్నడ హీరోయిన్స్ లలో రిచ్ పల్లవా..? 

కర్ణాటక ఇండస్ట్రీలో సీరియల్స్ కి మంచి క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. అక్కడ సీరియల్స్ కి ఉన్న డిమాండ్ తెలుగులో తక్కువే అని చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే మనవాళ్లు వేరే భాషలలో అవకాశాల కోసం ఎదురు చూస్తుంటే కానీ కన్నడీలు మాత్రం తెలుగులో వరసగా అవకాశాలను అందుకుంటూ అలరిస్తున్నారు.. ఇప్పటివరకు తెలుగు సీరియల్స్లలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న కన్నడ హీరోయిన్లలో ఇంటింటి రామాయణం పల్లవి ఒకరు.. ఈమె అసలు పేరు యశస్విని. మోడలింగ్ చేసి సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు వరుసగా సీరియల్స్లలో నటించే అవకాశాలను అందుకుంది.. ఇంటింటి రామాయణం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. అయితే ఈమెకు సీరియల్స్ లోకి రాకముందే బాగా రిచ్ కిడ్ అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక వరుసగా సీరియల్స్ కూడా రావడంతో ఆమెకు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ అయింది. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్ల అందరిలో కల్లా ఆమె మంచి సౌండ్ పార్టీ అని తెలుస్తుంది. ఈ మధ్య ట్రిప్పులకు కూడా వెళ్తూ అక్కడ దిగిన ఫోటోలని షేర్ చేస్తుంది. ఖరీదైన డ్రస్సులలో ఆమె దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Advertisement

Also Read :చక్రీకి అబద్దం చెప్పిన మహా.. హారికకు నిజం చెప్తుందా..? విడాకులకు చక్రీ ఒప్పుకుంటాడా..?

‘ఇంటింటి రామాయణం’ ఫైనల్ కు చేరుకుందా..? 

స్టార్ మా ప్రేక్షకులను కుటుంబ కథ స్టోరీ తో ఆకట్టుకుంటున్న సీరియల్ ఇంటింటి రామాయణం.. ప్రతి ఇంట్లో ఉండే ఒక డిఫరెంట్ స్టోరీ తో ఈ సీరియల్ తెరకెక్కింది. ఇందులో రాజేంద్రప్రసాద్ మూడవ కోడలు పాత్రలో పల్లవి నటించింది. తన ప్రేమకు అడ్డుగా వచ్చిన వాళ్ళందరి మీద పగ తీర్చుకోవాలని ఆ ఇంట్లోకి మూడవ కోడలుగా అడుగుపెడుతుంది. నిజానికి ఈమె రెండో కోడలుగా ఎంట్రీ ఇవ్వాల్సింది. ఆ కుటుంబం నాశనం అయ్యేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తుంది.. చివరికి ఆమె తన సొంత తండ్రి లాంటి మామయ్యను కూడా చంపేందుకు ప్రయత్నం చేస్తుంది. అది చూసి జనాలు కూడా భయపడిపోయారు.. ప్రస్తుతం ఆమె పరిస్థితి ముందునుయ్యి వెనక గొయ్యిలాగా మారింది.. మరి ఈ గండం నుంచి గట్టెక్కుతుందా లేదంటే తన మనసుని మార్చుకొని కుటుంబంతో కలిసి పోతుందా? అన్నది మరికొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే కొద్ది రోజుల్లో ఈ సీరియల్కు శుభం కార్డు పడిపోతుందని సమాచారం.

Related News

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Big Stories

Advertisement
×