E-Paper
Advertisement

చరణ్ ‘పెద్ది’ కి జనసేనాని బ్లెస్సింగ్స్.. పవన్ కళ్యాణ్ ట్వీట్‌తో మెగా అభిమానుల్లో నెక్ట్స్ లెవెల్ జోష్!

చరణ్ ‘పెద్ది’ కి జనసేనాని బ్లెస్సింగ్స్.. పవన్ కళ్యాణ్ ట్వీట్‌తో మెగా అభిమానుల్లో నెక్ట్స్ లెవెల్ జోష్!
Advertisement

Peddi Release: ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న పెద్ది ఎట్టకేలకి మరికొద్ది గంటల్లో థియేటర్ లోకి అడుగెట్టబోతుంది.చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి కూడా.ఇక గేమ్ చేంజర్ వంటి డిజాస్టర్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చరణ్ ఈ సినిమా చేస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తాయని లెక్కలేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్.

ఇలాంటి హైప్ ఉన్న సమయంలో ఈ చిత్రానికి బాబాయ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఊహించని రేంజ్ లో సపోర్ట్ లభించింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అధికారిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన స్పెషల్ విషేస్ , దానికి జోడించిన ఎడిటెడ్ వీడియో ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో, నెట్టింట పూనకాలు తెప్పిస్తోంది.

Advertisement

‘పెద్ది’ సూపర్ హిట్ అవ్వాలంటూ 

Advertisement

ఈ ప్రత్యేక ట్వీట్‌లో పవన్ కళ్యాణ్ తన అపారమైన ప్రేమాభిమానాలను కురిపిస్తూ, రామ్ చరణ్ అనే పేరులోనే ఒక పరమ పవిత్రమైన అర్థం, ఆ హనుమంతుడి భక్తి, శక్తి దాగి ఉన్నాయని పేర్కొన్నారు. శ్రీరామచంద్రుని పాద పద్మాల పట్ల ఆంజనేయ స్వామి చూపిన నిరుపమానమైన భక్తి, సంపూర్ణ శరణాగతి అనే శాశ్వతమైన సద్గుణాలకు చరణ్ పేరు ప్రతిరూపంగా నిలుస్తుందని రాసుకొచ్చారు పవన్. కొండగట్టు అంజన్న ఆశీస్సులతో ‘పెద్ది’ చిత్ర మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల అపారమైన ప్రేమాభిమానాలతో ఈ సినిమా అఖండ విజయాన్ని, కీర్తిని సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ‘జై బజరంగ్ బలి’ అంటూ పవన్ కళ్యాణ్ ముగించిన తీరు మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మీడియాను షేక్ చేస్తున్నస్పెషల్ ఎడిటెడ్ వీడియో

అయితే కేవలం టెక్స్ట్ మెసేజ్‌తోనే సరిపెట్టలేదండోయ్ .., ఈ మెసేజ్ తో పాటు విడుదల చేసిన ఒక స్పెషల్ ఎడిటెడ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రామ్ చరణ్ సినీ కెరీర్‌లోని అద్భుతమైన మాస్ విజువల్స్, గతంలో సంచలన విజయం సాధించిన ‘రంగస్థలం’, ‘మగధీర’ చిత్రాల్లోని కొన్ని పవర్‌ఫుల్ షాట్స్‌తో పాటు ఆయన అంకితభావాన్ని ఆంజనేయస్వామి ప్రతిరూపంతో పోలుస్తూ ఈ వీడియోను ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు.. అంతేకాకుండా, పవన్ కళ్యాణ్‌కు ఎంతో ఇష్టమైన, ఆయన రాజకీయ ప్రస్థానంలో సెంటిమెంట్‌గా భావించే తెలంగాణలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆశీస్సులు చరణ్‌కు, ఈ చిత్రానికి ఎల్లప్పుడూ ఉండాలని ఈ వీడియో ద్వారా కోరడం ఇందులో  హైలైట్‌.

‘పెద్ది’ ఓపెనింగ్స్‌కు మరింత మైలేజ్ ఇవ్వడం ఖాయం

సినిమా రిలీజ్ కౌంట్‌డౌన్ నడుస్తున్న ఈ సమయంలో బాబాయ్ నుంచి వచ్చిన ఈ క్రేజీ సపోర్ట్ మెగా క్యాంప్‌లో సరికొత్త జోష్ నింపింది. గతంలో వచ్చిన ‘పుష్ప’ చిత్రంతో సుకుమార్ రూరల్ బ్యాక్ డ్రాప్ ని ఏ స్థాయిలో ఆవిష్కరించారో, ఇప్పుడు ఆయన శిష్యుడు బుచ్చిబాబు సానా ‘పెద్ది’ చిత్రంలో రామ్ చరణ్‌ను అంతకంటే పవర్‌ఫుల్‌గా, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో చూపించబోతున్నారనే టాక్ నడుస్తోంది. ఉత్తరాది బెల్ట్ లో కూడా ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. బాబాయ్ ప్రేమకు, అండకు ఈ వీడియోనే నిదర్శనమని, కొండగట్టు అంజన్న ఆశీస్సులతో ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమంటూ అభిమానులు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అందించిన ఈ గ్రాండ్ సపోర్ట్ ‘పెద్ది’ ఓపెనింగ్స్‌కు మరింత మైలేజ్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

చూడాలి మరి మరికొద్ది గంటల్లో రాబోతున్న ఈ సినిమా అందరి అంచనాలని ఏ మేరకి అందుకుంటుందో !

Also read :‘జై భీమ్’ కాంబో మళ్లీ రిపీట్.. ఆరేళ్ల క్రితం కన్నుమూసిన లెజెండరీ వైద్యుడిగా సూర్య?

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×