E-Paper
Advertisement

తెలంగాణ ఎన్నారైలకు ఈసీ అలర్ట్.. కచ్చితంగా లింక్ కావాల్సిందే, ఎందుకంటే

తెలంగాణ ఎన్నారైలకు ఈసీ అలర్ట్.. కచ్చితంగా లింక్ కావాల్సిందే, ఎందుకంటే
Advertisement

Telangana NRIs Alert: తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులను ఎన్నికల సంఘం అలర్ట్ చేసింది. తమ ఓటర్ ఐడీకి మొబైల్ నెంబర్ తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణలో జూన్ 15 నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ ఎన్నారైలకు ఈసీ అలర్ట్

Advertisement

తమ తమ మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఆన్‌లైన్‌లో వివరాలను సమర్పించడం సాధ్యం కాదని తేల్చేసింది. ఓటర్ల జాబితాలో చేరడంలో ఇబ్బందులు ఎదురవుతాయని ఈ సందర్బంగా అధికారులు వెల్లడించారు. విదేశాల్లో నివసిస్తున్నవారు తమ ఓటు హక్కును కాపాడుకోవాలనుకునే ప్రక్రియ చాలా కీలకమైనది.

నిర్ణీత గడువులోగా తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా రాష్ట్రంలోని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములుగా కొనసాగవచ్చు. ఎన్నారైలు తమ మొబైల్ నంబర్‌ను లింక్ చేయడానికి ఈసీఐ అధికారిక పోర్టల్ కి వెళ్లాలి. ఫారం-8 ను ఓపెన్ చేసి, మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత వచ్చే ఓటీపీతో ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

Advertisement

ఓటర్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ కావాల్సిందే-ఈసీ

ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులో పేరు ఒకేలా ఉండాలని పేర్కొంది. ఫారం సమర్పించేటప్పుడు ఆధార్ అథెంటికేషన్ అవసరమని అధికారులు తేల్చిచెప్పారు. తెలంగాణలో జరగనున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ప్రకటించారు.

వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం.. జూన్ 15 నుంచి 24 వరకు ఓటర్ల జాబితా రూపకల్పన జరుగుతుంది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన చేయనున్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే ఆగస్టు 30 వరకు స్వీకరిస్తారు. అక్టోబర్ ఒకటిన ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.

ALSO READ: జనసేన అధినేత వ్యాఖ్యలు.. ఆపై కేటీఆర్ రియాక్ట్, ఏయే అంశాలు ఒక్కసారి

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×