E-Paper
Advertisement

‘జై భీమ్’ కాంబో మళ్లీ రిపీట్.. ఆరేళ్ల క్రితం కన్నుమూసిన లెజెండరీ వైద్యుడిగా సూర్య?

‘జై భీమ్’ కాంబో మళ్లీ రిపీట్.. ఆరేళ్ల క్రితం కన్నుమూసిన లెజెండరీ వైద్యుడిగా సూర్య?
Advertisement

Suriya Biopic: కరుప్పు, వీరభద్రుడు అందించిన బ్లాక్‌బస్టర్ విజయంతో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తిరుగులేని జోష్‌లో ఉన్నాడు. దాదాపు పదమూడేళ్లుగా తన పాత బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేయలేక కెరీర్‌లో ఎన్నో ఇబ్బందులు పడ్డ ఆయన, ఇప్పుడు ఏకంగా 300 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టి తన సత్తా ఏంటో నిరూపించాడు. ఈ జర్నీలో  సూర్య పడిన స్ట్రగుల్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు గజినీ వంటి సినిమాలతో సత్తా చాటినా మధ్యలో కంగువ వంటి సినిమాలతో దెబ్బతినడం ఫ్యాన్స్‌ను ఫుల్ డిసప్పాయింట్ చేసింది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. సూర్య మార్కెట్ వాల్యూ ఏ స్థాయికి చేరిందంటే, ఆయన తదుపరి రాబోయే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రానికి మునుపు అనుకున్న బడ్జెట్, బిజినెస్ అంచనాల కంటే డబుల్ రేట్లు పలుకుతుండడం విశేషం.

టీజె జ్ఞానవేల్‌తో జోడీ కట్టబోతున్న సూర్య 

Advertisement

ఇలాంటి క్రేజీ టైమ్‌లో సూర్య తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. గతంలో ఆయనకు ‘జై భీమ్’ రూపంలో ఒక మైల్‌స్టోన్ లాంటి సోషల్ క్లాసిక్ అందించిన డైరెక్టర్ టీజె జ్ఞానవేల్‌తో సూర్య మళ్లీ చేతులు కలపబోతున్నాడనే ప్రచారం ఇండస్ట్రీలో ఊపందుకుంది. అయితే, జ్ఞానవేల్ ఇటీవలే సూపర్ స్టార్ రజనీకాంత్‌తో చేసిన ‘వెట్టయన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేక ఫ్లాప్‌గా మిగిలింది.

ఒక బలమైన సామాజిక సమస్యకు కమర్షియల్ హంగులు అద్దాలని చూసిన జ్ఞానవేల్, రజనీ లాంటి మాస్ హీరో ఇమేజ్‌ను సరిగ్గా హ్యాండిల్ చేయలేక తడబడ్డారనే విమర్శలు వచ్చాయి. ఈ పరాజయం డైరెక్టర్ ట్రాక్ రికార్డ్‌పై కొంత నెగెటివిటి  చూపినప్పటికీ, సూర్య మాత్రం కంటెంట్ నమ్మి ఆయనకు మరో అవకాశం ఇవ్వడానికై రెడీ అయినట్టు తెలుస్తుంది.

Advertisement

‘వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ మెడిసిన్’

యస్ .. ఈ సారి వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక విభిన్నమైన బయోపిక్ రాబోతోందని చెన్నై వర్గాల సమాచారం. చెన్నైకి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కృష్ణ వరదాచారి తిరువేంగడం జీవిత చరిత్ర ఆధారంగా ఈ కథను సిద్ధం చేసినట్లు టాక్. కార్పొరేట్ ఆసుపత్రులు వందల రూపాయల ఫీజులు గుంజుతున్న రోజుల్లో, తన దగ్గరకు వచ్చే నిరుపేద రోగుల నుంచి కేవలం 2 లేదా 5 రూపాయలు మాత్రమే తీసుకుని వైద్యం అందించి ‘రూపాయి డాక్టర్’గా ఆయన పేదల పాలిట పెన్నిధిగా నిలిచారు.

ఛాతీ వ్యాధుల నిపుణుడైన ఆయన అపారమైన వైద్య జ్ఞానాన్ని చూసి మెడికల్ రంగంలో అందరూ ఆయన్ను ‘వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ మెడిసిన్’ అని పిలిచేవారు. సమాజానికి ఆయన చేసిన నిస్వార్థ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయన్ను అత్యున్నత ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. దాదాపు ఆరేళ్ల క్రితం, తన 94వ ఏట అనారోగ్యంతో ఈ లెజెండరీ వైద్యుడు కన్నుమూశారు.

సూర్య కెరీర్‌లో మరో నేషనల్ లెవెల్ స్పెషల్ రోల్

ఆయన సుదీర్ఘ జీవిత ప్రయాణంలో చూసిన ఎన్నో ఎత్తుపల్లాలు, ఎదుర్కొన్న అవమానాలు, సాధించిన విజయాలను వెండితెరపై ఆవిష్కరించేందుకు జ్ఞానవేల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ఈ ప్రాజెక్ట్ వినడానికి చాలా ఎమోషనల్‌గా, పవర్‌ఫుల్‌గా ఉన్నప్పటికీ బిజినెస్ పరంగా దీనిపై కొన్ని సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడిప్పుడే భారీ మాస్ సక్సెస్‌తో ట్రాక్‌లోకి వచ్చిన సూర్య, మళ్లీ ఇలాంటి డీగ్లామరైజ్డ్ సోషల్ సబ్జెక్ట్ వైపు వెళ్తే మాస్ ఆడియన్స్ మరియు కమర్షియల్ మార్కెట్ ఎంతవరకు ఆదరిస్తుందనేది ఇక్కడ పెద్ద ప్రశ్న.పైగా దర్శకుడు జ్ఞానవేల్ ఫ్లాప్ ఫామ్‌లో ఉండడం కూడా కొంత ఆందోళన కలిగించే విషయమే.

అయినప్పటికీ ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ లాంటి చిత్రాల్లో సూర్య చూపించిన నటనను గుర్తుచేసుకుంటే, ఇలాంటి పాత్రలు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, కోలీవుడ్ సర్కిల్స్‌లో మాత్రం ఈ క్రేజీ బయోపిక్ గురించిన వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే, సూర్య కెరీర్‌లో మరో నేషనల్ లెవెల్ స్పెషల్ రోల్ ఖాయమని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్ .

Also read :లీకుల ఊబిలో ‘స్పిరిట్’.. సెట్ నుండి షాకింగ్ వీడియో వైరల్.. సందీప్ వంగాపై ఫ్యాన్స్ ఫైర్!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×