E-Paper
Advertisement

Pawan Kalyan: రాజకీయాలలోకి రావచ్చు కదా..ఆ హీరోయిన్ కు పవన్ ఆఫర్.. ఎవరా బ్యూటీ?

Pawan Kalyan: రాజకీయాలలోకి రావచ్చు కదా..ఆ హీరోయిన్ కు పవన్ ఆఫర్.. ఎవరా బ్యూటీ?
Advertisement

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయాలలో కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) త్వరలోనే హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రీ రిలీజ్ వేడుక కూడా ఎంతో ఘనంగా జరిగింది.

ఐఏఎస్ అవ్వాలనుకున్న రాశీ ఖన్నా…

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి రాశిఖన్నా(Raashii Khanna) వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటు సందడి చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఈమె పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తనతో ఓసారి మాట్లాడుతూ తన గురించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు అని తెలిపారు.. అసలు సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందు మీరేం అవ్వాలనుకున్నారనే ప్రశ్న పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చిందని ఆ సమయంలో తాను ఐఏఎస్ అవ్వాలనుకున్నాను కానీ అది కుదరని నేపథ్యంలోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని రాశికన్నా రిప్లై ఇచ్చినట్టు తెలిపారు.

రాజకీయాలలోకి వచ్చి ప్రజాసేవ చెయ్యొచ్చు కదా..

Advertisement

ఈ విధంగా తాను ఐఏఎస్ కావాలనుకున్నాను అనే విషయాన్ని చెప్పడంతో వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఐఏఎస్ కుదరకపోతే రాజకీయాలలోకి రావచ్చు కదా.. ఇలాగైనా ప్రజలకు సేవ చేయొచ్చు కదా అంటూ తనకు సలహాలు ఇచ్చారని రాశిఖన్నా తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలలోకి రమ్మని సలహా ఇచ్చినా, రాజకీయాలు తన వల్ల అసలు కాదు అంటూ సమాధానం ఇచ్చానని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తో జరిగిన సంభాషణ గురించి ఈమె తెలియజేయడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక రాశిఖన్నా ఊహలు గుసగుసలాడే అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు..

కథ వినకుండానే సినిమాకు గ్రీన్ సిగ్నల్..

Advertisement

ఇలా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమైన ఈమె మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ కావడంతో తదుపరి తెలుగులో వరుస సినిమాలలో నటించారు. ప్రస్తుతం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషలలో కూడా సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ తో మొదటిసారి ఈమె స్క్రీన్ పంచుకోవడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కనీసం కథ కూడా వినకుండానే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జోడిగా శ్రీలీల హీరోయిన్ గా నటించగా రాశికన్నా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మరియు ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ అందించబోతుందో తెలియాల్సి ఉంది.

Also Read: Indraneel -Meghana: సీరియల్ నటుడు ఇంద్రనీల్ మేఘన పెళ్లి వెనుక విస్తు పోయే నిజాలు.. యుద్ధమే జరిగిందంటూ!

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×