E-Paper
Advertisement

Srivari Mettu: శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్న రహస్య ఆలయాలు ఏవో తెలుసా..?

Srivari Mettu: శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్న రహస్య ఆలయాలు ఏవో తెలుసా..?

Srivari Mettu: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్తుంటారు చాలా మంది భక్తులు అయితే ఈ శ్రీవారి మెట్టు మార్గంలో ఎవరికీ తెలియని చాలా రహస్య ఆలయాలు ఉన్నాయట. ఆ ఆలయాల్లో ఇప్పటికీ దేవతలు, రుషులు సూక్ష్మరూపలో వచ్చి పూజలు చేసుకుని వెళ్లిపోతుంటారట. అయితే ఆ ఆలయాల్లో కొన్ని భక్తులకు కూడా కనిపిస్తాయని మరికొన్ని సూక్ష్మరూపంలో ఎవ్వరికీ కనిపించకుండా ఉంటాయని పండితులు చెప్తున్నారు.

శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకి వెళ్లేటప్పుడు చాలామందికి తెలియని కొన్ని చిన్న కానీ పవిత్రమైన దేవాలయాలు మరియు స్థలాలు ఉన్నాయట.. భక్తులు వీటిని “రహస్య దేవాలయాలు” అని కూడా పిలుస్తారట. ఎందుకంటే ఈ ఆలయాలను చాలా మంది భక్తులు గమనించకుండానే వెళ్లిపోతుంటారట. అయితే మరికొన్ని ఆలయాలు అసలు భక్తులు కనిపించకుండా సూక్ష్మంగా ఉంటాయట.  భక్తులకు కనిపించే కొన్ని ముఖ్యమైన ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీ భూ వరాహ స్వామి ఆలయం: శ్రీవారి మెట్ల మార్గంలో చిన్న భూవరాహ స్వామి ఆలయం ఉంటుందట. పురాణాల ప్రకారం తిరుమల ప్రాంతాన్ని ముందుగా ఈ వరాహ స్వామే పరిపాలించారని చెబుతారు. అందుకే భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించాలి అని సంప్రదాయం ఉంది. శ్రీవారి మెట్టు మార్గంలో కానీ తిరుమల కొండ మీద ఉన్న స్వామివారిని కానీ తప్పకుండా దర్శనం చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఆంజనేయ స్వామి విగ్రహాలు: శ్రీవారి మెట్ల మార్గంలో కొండ మీదకు ఎక్కుతుంటే.. కొన్ని చోట్ల  ఆంజనేయ స్వామి విగ్రహాలు కనిపిస్తాయి. అయితే హనుమంతుడు ఈ కొండల్లో భక్తులను కాపాడుతుంటాడని భక్తులు నమ్మకం. ఇదే కాకుండా అలిపిరి మార్గంలో కూడా ఆంజనేయస్వామి విగ్రహాలు కనిపిస్తాయి. ఇక అలిపిరి మార్గంలో టీటీడీ వారు ఏర్పాటు చేసిన పెద్ద హనుమంతుడు ఇప్పటికీ భక్తులకు అభయం ఇస్తున్నట్టు కనిపిస్తాడు.

చిన్నశివలింగాలు: శ్రీవారి మెట్ల మార్గంలోని కొన్ని చోట్ల చిన్న చిన్న శివలింగాలు దర్శనం ఇస్తుంటాయి. వీటిని కూడా భక్తితో దర్శనం చేసుకోవాలని సూచిస్తుంటారు. ఎందుకంటే అప్పట్లో ఎంతో మంది మునులు ఈ ప్రాతంలో తపస్సు చేసి ఈ శివలింగాలను ప్రతిష్టించి ఉండొచ్చని చెప్తుంటారు. శైవ సంప్రదాయం ప్రకారం తిరుమల పర్వతాలు శేషాచలంగా పిలుస్తారు.. అంటే ఈ ప్రాతంలో శివుడికి సంబంధించిన పవిత్ర స్థలాలు ఉన్నాయని అందుకే శేషాచలంగా ప్రసిద్ది చెందిందని చెప్తుంటారు.

గరుడ ఆలయం: శ్రీవారి మెట్టు మార్గంలో  కొన్ని చోట్ల గరుడ ఆళ్వార్ విగ్రహాలు దర్శనం ఇస్తుంటాయి. వీటిని కూడా భక్తులు దర్శనం చేసుకోవాలని సూచిస్తుంటారు. గరుడుడు అంట ఏవరో కాదు సాక్ష్యాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికి వాహనం. ఈ గరుత్మండే.. తిరుమలకు వచ్చే భక్తులను తిరుమలను రక్షిస్తుంటాడని భక్తుల నమ్మకం.

ఋషులు తపస్సు చేసిన స్థలాలు: పురాణ కథనాల ప్రకారం శ్రీవారి మెట్టు మార్గంలో  కొన్ని చోట్ల ఋషులు, యోగులు తపస్సు చేశారని చెబుతారు. అందుకే కొన్ని చోట్ల చిన్న పూజా స్థలాలు  భక్తులకు దర్శనం ఇస్తుంటాయి.

చివరగా శ్రీవారి మెట్టు మార్గంలో నడుచుకుంటూ వెళ్లిన భక్తులు ముఖ్యంగా   తిరుమల చేరుకున్నాక ముందుగా స్వామి పుష్కరిణిలో స్నానం ఆచరించి అక్కడి నుంచి నేరుగా వరాహస్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని అక్కడి నుంచి బేడి ఆంజనేయ స్వామి, తర్వాత తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: మాడ వీధులు అంటే అర్థం తెలుసా..? తిరుమలలో ఎన్ని మాడ వీధులు ఉంటాయంటే

 

 

 

 

 

 

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×