E-Paper
Advertisement

Renu Desai: సైబర్ క్రైమ్‌కు రేణు దేశాయ్ ఫిర్యాదు.. అసలు విషయమిదే!

Renu Desai: సైబర్ క్రైమ్‌కు రేణు దేశాయ్ ఫిర్యాదు.. అసలు విషయమిదే!
Advertisement

Renu Desai: నటి రేణు దేశాయ్ (Renu Desai) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలియంది కాదు. తాజాగా ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను (Cybercrime Complaint) ఆశ్రయించారు. సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్స్‌తో వేధిస్తున్న (Social Media Harassment) వారిపై ఆమె ఫిర్యాదు చేశారు. ఎక్స్‌లో ఆమెకు అకౌంట్ లేదు కానీ, ఇన్‌స్టా‌లో మాత్రం ఎప్పుడూ ఆమె ఏదో ఒక వీడియోను షేర్ చేస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా తన ఎన్‌జీఓ‌కు సంబంధించిన విషయాలను షేర్ చేస్తుంటారు. ఈ మధ్య కుక్కల విషయంలో ఆమె ఎలా ఫైట్ చేస్తున్నారో తెలిసిందే. ఆ మధ్య ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఒక్కొక్కరికీ ఇచ్చి పడేశారు. 100 కుక్కల్లో 10 కుక్కలు మాత్రమే మంచివి ఉండవని, అలా అని 100 కుక్కలను ఎలా చంపేస్తారంటూ ఆమె గొంతెత్తారు.

Also Read- Ramayan Film: రామాయణ నుంచి రణబీర్ సాయి పల్లవి ఫోటోలు లీక్.. చిత్ర బృందం రియాక్షన్ ఇదే!

ఇంటికి వెళ్లి మరీ పోరాటం

Advertisement

అంతేకాదు, సమాజంలో చిన్న పిల్లల్ని మొదలుకుని, పండు ముదుసలి వరకు ఆడవాళ్లపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ అత్యాచారాలు చేసే వాళ్ల విషయంలో ప్రభుత్వాలను ప్రశ్నించరు కానీ, ఇప్పుడు కుక్కలను చంపవద్దు అన్నందుకు.. నాపై లేనిపోని రాతలు, పోస్ట్‌లు చేస్తున్నారంటూ ఇటీవల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఆమె పోరాటం చేస్తున్నందుకు కొందరు నెటిజన్లు కావాలని పచ్చి బూతులు తిడుతున్నారని, ఇంట్లో పిల్లల్ని కూడా వదలడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియోలో ఆమె తెలిపారు. ఇంకా ఆమెపై ఎలాంటి పదప్రయోగాలు చేస్తున్నారో కూడా ఈ వీడియోలో ఆమె వెల్లడించారు. ఇకపై అలాంటి కామెంట్స్ చేసే వాళ్లని వదిలిపెట్టేది లేదని, ఆ కామెంట్స్ చేసే వాళ్ల ఇంటికి వెళ్లి మరీ పోరాటం చేస్తానని రేణు దేశాయ్ హెచ్చరించారు. అయినా కూడా కొందరు నెటిజన్లు పద్దతి మార్చుకోకుండా, అలానే ప్రవర్తిస్తుండటంతో.. చేసేది లేక ఆమె సైబర్ క్రైమ్‌‌కు ఫిర్యాదు చేశారు.

Also Read- Salaar: డైనోసార్ కోసం నెట్‌ఫ్లిక్స్ వెతుకులాట.. ‘సలార్’ టీమ్ మాస్ రిప్లై!

అసలు విషయం ఇదే..

Advertisement

తనపై హద్దులు దాటి వ్యక్తిగత దూషణలు చేస్తున్న నాలుగు సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను సేకరించి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ నాలుగు అకౌంట్లలోని వారు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారో.. మొత్తం స్క్రీన్‌షాట్లు, లింకులతో సహా పోలీసులకు అందజేసినట్లుగా సమాచారం. రేణు దేశాయ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో రేణు దేశాయ్‌కి పూర్తి న్యాయం జరిగేలా.. స్పష్టమైన హామీ పోలీసుల నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆ నలుగురి ఆట కట్టించి, సోషల్ మీడియాలోని అలాంటి వారికి తగిన హెచ్చరికను ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారట. సో.. నెటిజన్లు (అందరూ కాదు.. కొందరు) ఇకనైనా మంచి భాషను వాడితే మంచిది.. లేదంటే ఈ రోజు ఆ నలుగురే కావచ్చు.. రేపు మీ వరకు రావచ్చు.. అనేలా నెటిజన్లు కొందరు కామెంట్లతో రేణు దేశాయ్‌కి సపోర్ట్ చేస్తున్నారు.

Also Read- Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ పూర్తి.. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్!

Related News

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

Big Stories

Advertisement
×