E-Paper
Advertisement

Ustaad Bhagat Singh : ఉస్తాద్ సెట్స్ నుంచి వీడియో సాంగ్ లీక్, పవర్ స్టార్ ఎనర్జీ మామూలుగా లేదు

Ustaad Bhagat Singh : ఉస్తాద్ సెట్స్ నుంచి వీడియో సాంగ్ లీక్, పవర్ స్టార్ ఎనర్జీ మామూలుగా లేదు
Advertisement

Ustaad Bhagat Singh : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ అనే సినిమా బాక్స్ ఆఫీస్ ఉందా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాను హరీష్ శంకర్ డీల్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.

అంటే ఒక రీమేక్ సినిమాతో కూడా రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు అని ప్రూవ్ చేసింది ఆ సినిమా. అప్పటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా. హిందీ దబాంగ్ సినిమా కంటే 100 టైమ్స్ బెటర్ గా ఉంది అని రామ్ గోపాల్ వర్మ ఆ సినిమాను ఉద్దేశించి అప్పట్లో అన్నాడు. అసలు ఆ సినిమానే ఒక సంచలనం. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి ఒరిజినల్ ఆటిట్యూడ్ కి సరిపడే డైలాగ్స్ ఆ సినిమాలో రాశాడు హరీష్ శంకర్. అందుకే ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా పైన విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

అలా ఎలా ఒప్పించావు హరీష్?

Advertisement

పవన్ కళ్యాణ్ తో కొన్ని సీన్స్ చేయటం అనేది చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో రీ టేక్ కూడా ఒప్పుకోడు అని కొంతమంది దర్శకులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా డాన్స్ విషయంలో ఒళ్ళు హూనం చేసుకునే స్టెప్స్ అయితే అసలు వేయరు. చాలామంది విపరీతంగా కష్టపడుతూ డాన్సులు వేస్తూ ఉంటారు. అని పవన్ కళ్యాణ్ మాత్రం అలా నడిచొస్తేనే అది ఒక హై.

అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక లీక్ వీడియో వైరల్ గా మారింది. ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లో పవన్ కళ్యాణ్ డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. దానిలో పవన్ కళ్యాణ్ ఎనర్జీ చూస్తుంటే ఫ్యాన్స్ కి పూనకాలు రావడం ఖాయం అని అభిప్రాయం కలుగుతుంది.

Advertisement

ప్రస్తుతం చాలామంది సోషల్ మీడియాలో హరీష్ శంకర్ అలా ఎలా ఒప్పించాడు అని విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది పవన్ కళ్యాణ్ కాళ్లు అయిన పట్టుకొని హరీష్ ఈ రేంజ్ పెర్ఫామెన్స్ చేస్తున్నట్లు ఉన్నాడు అంటున్నారు. గతంలో దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ డాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఈ సినిమాలో ఉండబోతుంది అని ఒక టాక్ షోలో చెప్పాడు. విడుదలైన వీడియో చూస్తుంటే అది నిజం అనిపిస్తుంది.

సమ్మర్ రిలీజ్ 

ఎప్పుడూ రిలీజ్ కావలసిన ఈ సినిమా కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమా వాయిదా పడే ప్రాసెస్లో హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ అనే సినిమా కూడా పూర్తి చేశాడు. సినిమా ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇప్పుడు అంచనాలన్నీ కూడా ఈ సినిమా మీదే ఉన్నాయి.

అతనికి ఈ సినిమాను సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఇంకా అధికారక ప్రకటన రాలేదు. మొత్తానికి మెగా అభిమానుల కోసం 2026వ సంవత్సరంలో భారీ బడ్జెట్ సినిమాలన్నీ విడుదలకు రెడీగా ఉన్నాయి.

Also Read: Saailu Kampati: ఒక రూపాయి కోసం రూమ్ మొత్తం వెతికా, మీ కష్టం పగోడు కూడా రాకూడదు అన్న

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×