E-Paper
Advertisement

Bheema Rayudu: బొలెరో ఢీకొని సర్పంచ్ మృతి.. హత్యా? ప్రమాదమా?

Bheema Rayudu: బొలెరో ఢీకొని సర్పంచ్ మృతి.. హత్యా? ప్రమాదమా?
Advertisement

Bheema Rayudu: జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం నందిన్నె గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్ భీమా రాయుడు మృతి చెందాడు. గద్వాల నుంచి నందిన్నెకు వస్తుండగా జాంపల్లి వద్ద వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం బైక్‌ను డీ కొట్టింది. సుమారు 250 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో భీమా రాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం పై భీమా రాయుడు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ, సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఉండడంతో కక్ష పూరిత హత్య అయ్యి ఉండొచ్చని ఆరోపిస్తున్నారు. ఘటన అనంతరం బొలెరో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. భీమా రాయుడు మృతితో గ్రామంలో ఉద్రిక్తత పెరగడంతో భద్రతా ఏర్పాట్లు చేశారు.

Advertisement

 

Related News

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

22A భూములపై పొలిటికల్‌ వార్‌..!

సెక్రటీరియట్‌లో లంచావతారాలు..!

తెగిపడిన పోతిరెడ్డిపాడు గేట్.. జలపోరు మళ్లీ షురూ!

బాబు మార్క్ పాలన.. ముందుగానే ప్రజలకు సంక్షేమ క్యాలెండర్!

సర్వే సమరం.. ప్రజలు ఎవరివైపు..?

జనసేనలోకి బడా నేతలకు దారేది?

Big Stories

Advertisement
×