E-Paper
Advertisement

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కొత్త హెయిర్ స్టైల్ వెనక రహస్యం ఏదైనా, తేరి రీమేక్?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కొత్త హెయిర్ స్టైల్ వెనక రహస్యం ఏదైనా, తేరి రీమేక్?
Advertisement

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఎలా చూపించాలి అనే క్లారిటీ ఉన్న దర్శకులలో మొదటి వినిపించే పేరు హరీష్ శంకర్. దీనికి మంచి ఎగ్జాంపుల్ గబ్బర్ సింగ్ సినిమా. అది రీమేక్ సినిమా అయినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతంగా వర్కౌట్ అయింది. పవన్ కళ్యాణ్ ఏమి చేస్తే ప్రేక్షకులు ఇష్టపడతారో ఆ విషయాలన్నిటిని కూడా హరీష్ శంకర్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అయ్యేలా డిజైన్ చేశాడు. అందుకే ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి కొన్ని కంప్లైంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అట్లీ దర్శకత్వంలో విజయ్ నటించిన తెలుగు సినిమాకు ఈ సినిమా రీమేక్ అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీని గురించి దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు దర్శకుడు దశరథ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇది రీమేక్ అని మళ్లీ టాపిక్ మొదలైంది.

హెయిర్ స్టైల్ వెనక కారణం 

Advertisement

తెలుగు సినిమాలో ఒక పాత్ర పోలీస్ పాత్రగా ఉండబోతున్న సంగతి తెలిసిందే. పోలీస్ పాత్ర అన్నప్పుడు షార్ట్ హెయిర్ ఉండటం అనేది కామన్ గా జరుగుతుంది. తేరి సినిమాలో విజయ్ కి కూడా అలానే ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ చాలా షార్ట్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా పొలిటికల్ ఈవెంట్స్ లో హాజరవ్వడం. అలానే దర్శకుడు సుజిత్ కి కారు గిఫ్టుగా ఇచ్చిన ఫోటోలు కూడా విడుదలైన సంగతి తెలిసిందే. దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ కి షార్ట్ హెయిర్ ఉంది. అయితే ఇదంతా కూడా కేవలం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసమే పవన్ కళ్యాణ్ అలా చేశారు అని తెలుస్తుంది.

డిసెంబర్ లో మరో షెడ్యూల్ 

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి కేరళ షెడ్యూల్ డిసెంబర్ 19 నుంచి మొదలుకానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది ఆ సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే చాలా రోజులు తర్వాత పవన్ కళ్యాణ్ లోని కంప్లీట్ ఎనర్జీని ఆడియోస్ అందరూ విట్నెస్ చేశారు. ఇది కదా పవన్ కళ్యాణ్ నుంచి కోరుకునేది అని అందరూ తెగ సంబరపడిపోయారు. కేవలం సాంగ్ మాత్రమే ఇలా ఉంటే కంప్లీట్ సినిమా ఎలా ఉండబోతుందో అని ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోయింది.

Advertisement

Also Read: AA22xA6 : అట్లీ అల్లు అర్జున్ సినిమా కోసం భారీ వాటర్ సీక్వెన్స్

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×