E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 100 : తనూజ ప్లేయర్ ఆఫ్ ద డే… డెమోన్ పై బిగ్ బాస్ సెటైర్లు… ఇమ్మూ – కళ్యాణ్ కు వార్నింగ్

Bigg Boss 9 Telugu Day 100 : తనూజ ప్లేయర్ ఆఫ్ ద డే… డెమోన్ పై బిగ్ బాస్ సెటైర్లు… ఇమ్మూ – కళ్యాణ్ కు వార్నింగ్
Advertisement

Bigg Boss 9 Telugu Day 100 : బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరో మరో వారం రోజుల్లోపే తేలిపోనుంది. ఈ క్రమంలోనే టాప్ 5కి వన్స్ మోర్ వన్ మోర్ టైమ్ అంటూ బిగ్ బాస్ టాస్క్ లు పెడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా తాజా ఎపిసోడ్ లో ‘సేవ్ ఇట్ టు విన్ ఇట్’ అనే టాస్క్ పెట్టారు.

సొంత తెలివి తేటలు వద్దు 

ముందుగా బిగ్ బాస్ “ఈ టాస్క్ గుర్తుంది కదా… చాలా బాగా ఆడారు కదా. ఇప్పటికైనా సరిగ్గా ఆడతారా? సొంత తెలివితేటలు వాడతారా?” అంటూ టాప్ 5పై సెటైర్లు వేశారు. దీంతో సారీ చెప్పి బాగా ఆడతామని చెప్పారు హౌస్ మేట్స్. కానీ సంచాలక్ ఎవరో చెప్పండి అనేసరికి నవ్వు మొహాలు కాస్తా సీరియస్ అయ్యాయి. ఇప్పటికే రెండు స్టార్లు సంపాదించిన డెమోన్ ను మిగతా నలుగురూ టార్గెట్ చేశారు. “కానీ ఇప్పుడు నన్ను పక్కన పెడితే నెక్ట్స్ గేమ్స్ లో నేను అస్సలు వెనక్కి తగ్గను మీ ఇష్టం” అని వార్నింగ్ ఇచ్చాడు డెమోన్. ఏదైతేనేం అతన్ని కన్విన్స్ చేసి సంచాలక్ గా చేశారు. కళ్యాణ్ – తనూజా, ఇమ్మూ – సంజన రెండు టీమ్ లుగా మారి గేమ్ ఆడారు. అయినా కూడా “చివరికి మూడు బెలూన్లు పగిలాయి కదా” అంటూ ఇమ్మూ, “అయితేనేం మా బెలూన్లు ఎక్కువసేపు గాలిలో ఉన్నాయి కదా” అంటూ తనూజ వాదించుకున్నారు. సంచాలక్ డెమోన్ మాత్రం తనూజా టీం విన్ అని ప్రకటించారు. దీంతో విన్ అయిన తనూజ – కళ్యాణ్ లకు స్టార్స్ తో పాటు చికెన్ వింగ్ ట్రీట్ గా వచ్చింది.

Advertisement

తరువాత ప్లేయర్ ఆఫ్ ది డేను డెమోన్ కు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ డెమోన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వీడియో మెసేజ్ ను ప్లే చేశారు. అందులో డెమోన్ అన్న మాట్లాడుతూ టాప్ 5లోకి రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఆ వీడియో చూశాక డెమోన్ సంతోషంలో మునిగిపోయాడు.

ధమాకా కింగ్ డెమోన్   

వన్స్ మోర్ వన్ మోర్ ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన మరో టాస్క్ పిక్ ది బోన్. తాళ్లతో ఏర్పాటు చేసిన ఉచ్చు, అడ్డంగా ఉన్న టైర్లు, వుడెన్ ప్లాంక్ ను దాటుకుని బోన్ ను తీసుకోవాలి. ఈ టాస్క్ వివిధ రౌండ్ లో జరిగింది. ఎక్కువ సార్లు బోన్ ను పట్టుకున్న వాళ్ళే విన్నర్. ఇందులో కూడా డెమోన్ విన్నర్ గా నిలిచి, మరో స్టార్ కొట్టేశాడు. ట్రీట్ గా ఫ్రాంకీ అందుకున్నాడు. అనంతరం ‘గెయిన్ ఇట్ టు విన్ ఇట్’ అంటూ టవర్ టాస్క్ పెట్టారు. ఇందులో తనూజ, ఇమ్మూ, సంజన పాల్గొనగా, తనూజ గెలిచింది. ఆమెకు ట్రీట్ గా డ్రై ఫ్రూట్ రబ్డి, అలాగే స్టార్ పంపారు బిగ్ బాస్.

Advertisement

నేటి ఎపిసోడ్ లో చివరగా ఇచ్చిన టాస్క్ ‘ధమాకా కింగ్’. ఈ టాస్క్ గుర్తుంది కదా… అంటూ డెమోన్ ఈ టాస్క్ ఆడుతూ కింద పడిన క్షణాన్ని గుర్తు చేశారు. అందరూ నవ్వడంతో ఈసారి 7 పాయింట్స్ సంపాదించి చూపిస్తా అంటూ శపథం చేశాడు. సంజన,, తనూజా ఈసారి కూడా సక్సెస్ ఫుల్ గా ఈ టాస్క్ లో ఫెయిల్ అయ్యారు. 3 ఛాన్సులు ముగిసాక విన్నర్ డెమోన్ అని తేలిపోయింది. చివరికి ఇంటి సభ్యులు అందరూ కలిసి తనూజను ప్లేయర్ ఆఫ్ ది డే అని అనౌన్స్ చేయడంతో ఇంటి నుంచి తన చెల్లి పెళ్ళిలో దిగిన ఫ్యామిలీ ఫొటోను పంపారు బిగ్ బాస్. తన తండ్రి ఫొటోను చూసి ఎమోషనల్ అయ్యింది తనూజా.

Read Also : ఈ పర్సన్ ఫ్రెండ్ కంటే ఎక్కువ… డెమోన్ చేస్తే తప్పు కళ్యాణ్ చేస్తే ఒప్పా తనూజా?

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×