E-Paper
Advertisement

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సెకండ్ సింగిల్ ప్రేక్షకులను మెప్పించలేదా?.. ఆరా మిస్ అయిందా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సెకండ్ సింగిల్ ప్రేక్షకులను మెప్పించలేదా?.. ఆరా మిస్ అయిందా?
Advertisement

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. టాలీవుడ్ లో ఆయన పేరే ఒక బ్రాండ్.. ఆయన పోస్టర్ వస్తేనే సినిమా పరిశ్రమలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు ఉన్న స్టామినా అంతా ఇంతా కాదు.. పవన్ ప్లాప్ సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ దాటేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానిని ఉదాహరణగా అనేక సినిమాలు చెప్పుకోవచ్చే.. గత ఏడాది విడుదలైన ఓజీ ఏ రేంజ్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే… అయితే ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సింగిల్ చాట్ బాస్టర్గా నిలిచింది. అయతే తాజాగా విడుదలైన రెండో సింగిల్ ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ దర్శకడు అనుకున్నంత రీచ్ లేనట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే.. ఈ పాటలో కేవలం పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని గురించి మాత్రమే పొగుడుతూ.. లిరిక్స్ ఉంటాయి. దీంతో అవి ఫ్యాన్స్ కు మాత్రమే నచ్చేట్లుగా ఉన్నాయి.. దీంతో ఈ పాట రీచ్ కూడా అనుకున్నంత వెళ్లలేదు. పాట రీచ్ పెంచడానకి దర్శకుడు విశ్వ విధాల ప్రచత్నిస్తున్నారు. అయినా పాటకు తగినంత వ్యూస్ రాకపోవడంతో దర్శకుడు సందిగ్థంలో పడ్డారు.

Read also-Comedy Movie OTT: భార్య ఒకరితో భర్త మరొకరితో… సోషల్ మీడియాలో కొత్త ప్రేమ… క్లైమాక్స్ వరకు నవ్వులే

అభిమానుల అంచనాలు.. దర్శకుడి ప్రయత్నం

Advertisement

గతంలో పవన్-హరీష్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మొదటి పాట మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోగా, రెండో పాటపై చిత్ర యూనిట్ చాలా ఆశలు పెట్టుకుంది. దర్శకుడు హరీష్ శంకర్ ఈ పాటను పవన్ కళ్యాణ్ మేనరిజం, ఆయన వ్యక్తిత్వాన్ని ఎలివేట్ చేసేలా తీర్చిదిద్దారు. సినిమా విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ ఆశించిన స్థాయిలో వ్యూస్ రాబట్టకపోవడానికి ప్రధాన కారణాలు ఇలా ఉన్నాయి.. ఈ పాటలోని లిరిక్స్ పూర్తిగా పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను పొగుడుతూ సాగడం వల్ల, ఇది కేవలం ‘హార్డ్ కోర్’ ఫ్యాన్స్‌కు మాత్రమే కనెక్ట్ అయ్యింది. సగటు సినిమా ప్రేక్షకుడు ఆశించే మెలోడీ లేదా మాస్ బీట్ ఇందులో కొంత లోపించిందని టాక్. దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా ఈ పాటను జనాల్లోకి తీసుకెళ్లడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ లో ఆశించిన ‘బజ్’ కనిపించడం లేదు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్ పాత వాసనలు వెదజల్లుతోందని, పవన్ గత సినిమాల్లోని ఎనర్జీ లెవల్స్‌కు ఇది సరిపోలేదని కొందరు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.

Read also-Gundeninda GudiGantalu Today episode: బాలు ఫోన్ కొట్టేసిన రోహిణి.. సంజుతో బాలు పరాచకాలు.. మీనా దొరుకుంతుందా..?

అసంతృప్తిలో పవన్ ఫ్యాన్స్

Advertisement

ఒక స్టార్ హీరో సినిమా సాంగ్ విడుదలైన నిమిషాల్లోనే మిలియన్ల వ్యూస్ రావడం సహజం. కానీ, పవన్ కళ్యాణ్ లాంటి భారీ బ్రాండ్ ఇమేజ్ ఉన్న హీరో పాటకు వ్యూస్ నెమ్మదించడం అభిమానులను కొంత ఆందోళనకు గురిచేస్తోంది. సోషల్ మీడియాలో దీనిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా అంటే కేవలం పాటలు మాత్రమే కాదు, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమా రిజల్ట్‌ను మార్చేస్తుంది. ఈ పాట వ్యూస్ పరంగా వెనుకబడినా, థియేటర్లలో పవన్ మేనరిజమ్స్ తోడైతే సీన్ వేరేలా ఉంటుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, హరీష్ శంకర్ ఈ సినిమాతో మళ్ళీ ‘గబ్బర్ సింగ్’ మ్యాజిక్ రిపీట్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. రాబోయే రోజుల్లో విడుదలయ్యే ట్రైలర్ లేదా తదుపరి సాంగ్స్ ఈ లోటును భర్తీ చేస్తాయేమో చూడాలి. ఈ సినిమా మార్చి 26, 2026 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×