E-Paper
Advertisement

Comedy Movie OTT: భార్య ఒకరితో భర్త మరొకరితో… సోషల్ మీడియాలో కొత్త ప్రేమ… క్లైమాక్స్ వరకు నవ్వులే

Comedy Movie OTT: భార్య ఒకరితో భర్త మరొకరితో… సోషల్ మీడియాలో కొత్త ప్రేమ… క్లైమాక్స్ వరకు నవ్వులే
Advertisement

Comedy Movie OTT : సరదాగా సాగిపోయే ఫ్యామిలీ డ్రామాను చూడాలనుకుంటే, ఈ పంజాబీ సినిమాపై ఓ లుక్ వేయండి. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ సాధించింది. ముఖ్యంగా ఈ కామెడీకి అందరూ ఫిదా అయ్యారు. ఈ కథ ఆరేళ్ల వివాహంలో ఉన్న భార్యాభర్తల చుట్టూ తిరుగుతుంది. ఫేక్ ఫేస్‌బుక్ ఐడిలతో ఒకరికొకరు తెలియకుండానే, ఒకరితో ఒకరు చాట్ చేసుకుంటూ చిక్కుల్లో పడతారు. ఈ సినిమా పేరు, ఎక్కడ చూడచ్చు అనే వివరాల్లోకి వెళ్తే…

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ పంజాబీ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా పేరు ‘యర్ మేరా టిట్లియాన్ వర్గ’ (Yaar Mera Titliaan Warga). 2022 సెప్టెంబర్లో వచ్చిన ఈ సినిమాలో గిప్పీ గ్రేవాల్, తను గ్రేవాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. వీళ్ళకి తోడుగా కరంజిత్ అన్మోల్, రాజ్ ధాలివాల్ కూడా ఉన్నారు. వికాస్ వశిష్ట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మీరు ఈ సినిమాను Amazon Prime Video లో చూడచ్చు. హంబుల్ మోషన్ పిక్చర్స్, ఓంజీ స్టార్ స్టూడియోస్ బ్యానర్‌పై గిప్పీ గ్రెవాల్ స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా సుమారు ₹5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడింది. దాదాపు 20 కోట్ల వరకు వసూళ్లను సాధించి పంజాబీ చిత్ర పరిశ్రమలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన టాప్ 10 చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

గుర్మెల్ (గిప్పీ గ్రేవాల్), బియాంత్ (తను గ్రేవాల్) భార్యాభర్తలు. వీళ్ళకి పెళ్లయ్యి ఆరేళ్లు అవుతుంది. వీళ్ళ కాపురానికి ఒక బాబు కూడా ఉంటాడు. అయితే పెళ్లయిన కొత్తలో ఉన్న ఆ రొమాన్స్, ఎగ్జైట్‌మెంట్ ఇప్పుడు వాళ్ళ మధ్య తగ్గిపోతుంది. లైఫ్ చాలా బోర్ కొడుతున్నట్లు ఇద్దరూ ఫీల్ అవుతుంటారు. తన లైఫ్‌లో మళ్ళీ ఆ కిక్ కోసం గుర్మెల్ ఒక ప్లాన్ వేస్తాడు. ఫేస్‌బుక్‌లో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వేరే అమ్మాయిలతో చాటింగ్ చేయాలనుకుంటాడు. ట్విస్ట్ ఏంటంటే, తన భర్త తనని పట్టించుకోవడం లేదని బాధపడుతున్న బియాంత్ కూడా అదే టైమ్‌లో ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేస్తుంది. అయితే కామెడిగా, ఈ ఇద్దరూ ఒకరికొకరు ఎవరో తెలియకుండానే ఆ ఫేక్ ఐడిలతో పరిచయం చేసుకుంటారు. ఒకరితో ఒకరు తెగ ఫ్లర్టింగ్ చేసేసుకుంటారు. చివరకు ఈ విషయం ఒకరికొకరు ఎలా తెలిసింది? ఆ తర్వాత వాళ్ళ సంసారంలో ఎలాంటి గొడవలు జరిగాయి? అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ.

Read  Also : ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్ ఇచ్చే శిష్యుడు… గురువు అంతకు మించి… టాప్ లేపుతున్న స్పోర్ట్స్ డ్రామా

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×