E-Paper
Advertisement

Ramchander Rao: రామచందర్రావుకి కోపమొచ్చింది..

Ramchander Rao: రామచందర్రావుకి కోపమొచ్చింది..
Advertisement

Ramchander Rao: బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా అట్టర్ ప్లాఫ్ అయ్యిందా..? పార్టీ సోషల్ మీడియాపై రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు గరం గరం ఎందుకు అయ్యారు..? కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సరే, సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలే రామ చందర్ రావును టార్గెట్ చేస్తున్నారా..? ఆయనను టార్గెట్ చేస్తున్నదెవరు..? అసలు కాషాయపార్టీలో ఆ పరిస్థితి ఎందుకు తలెత్తింది?

బీజేపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో వివాదాలు

బిజెపి నేతల మధ్య తీవ్రస్థాయిలో వివాదాలు, విభేదాలతో ఒకరిపై ఒకరు వరస ఆరోపణలతో రచ్చ కెక్కుతున్న పరిస్థితులు రాష్ట్ర పార్టీలో తారా స్థాయిలో కనిపిస్తున్నాయి. చివరకు హలో రామచందర్రావు అంటూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికే వార్నింగ్ లిచ్చే స్థాయికి నేతల కుమ్ములాటలు వెళ్ళాయి. ఒకరు మతం అంటారు, మరొకరు మతం పనికి రాదంటారు, ఒకరు కిషన్ రెడ్డిదే పెత్తనం అంటారు, ఇంకొకరు కిషన్ రెడ్డే కీలకం అంటారు.

లోకల్ బాడీ సమావేశాల్లో ప్రసంగాలు

Advertisement

ఒకరు రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అంటారు, మరొకరు ఇంటెంట్, కంటెంట్ లేని పార్టీ అంటారు. అంతేకాదు ఎవరికి వారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు తెలీకుండా పోటీ పడి కరీంనగర్ అడ్డాలో లోకల్ బాడీ సమావేశాలు పెట్టి, ఇష్టమొచ్చినట్టు ప్రసంగాలు చేస్తున్నారట. ఇట్లా పార్టీని ఎవరు పడితే వాళ్ళు, ఏది పడితే అది కామెంట్లు చేసి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి చెప్పినట్టు ఫుట్ బాల్ ఆడేసుకుంటున్నారట.. ఆ క్రమంలో పాపం రామచందర్రావు రాజాసింగ్ చెప్పిన రబ్బర్ స్టాంప్‌లా ఉండిపోవాల్సి వస్తుందనే టాక్ ఆ పార్టీ వర్గాల్లో నడుస్తోంది

నేతల మధ్య విభేదాలు, అభిప్రాయబేధాలపై చర్యలు

ఇక ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కార్పెట్ బాంబింగ్ ప్రచారాలతో కమలం పార్టీ కష్టపడినా చివరకు డిపాజిట్ కోల్పోయి ఘోర పరాజయం పాలై, పరువు తీసుకున్నదనే చర్చ జరుగుతున్న నేపద్యంలో బిజెపి స్టేట్ చీఫ్ రామచందర్రావు తన ఉగ్ర రూపానికి పదును పెడుతున్నారంట. నేతల మధ్య విభేదాలు, అభిప్రాయబేధాలపై చర్యలు ప్రారంభించారట. అందులో భాగంగానే రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో నేతలకు, కార్యకర్తలకు గట్టిగా ఇచ్చిపడేశారట.

Advertisement

పార్టీని డామేజ్ చేసే విధంగా నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారంట. అధ్యక్షుడిపై, పార్టీపై ఎవరైనా సరే ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేస్తే సస్పెండ్ చేస్తాం అంటూ హెచ్చరించారంట. ఈ సారి సమయం కూడా ఇవ్వం, నిర్ధాక్షిణ్యంగా పార్టీ నుంచి బయటకు పంపించేస్తాం అంటూ గరంగరం అయ్యి అందరినీ బెంబేలెత్తించారట.

బీజేపీ నేతల పై రామచందర్రావు ఆగ్రహం

కొందరు తాము బీజేపీ అంటూనే.. బీజేపీ నేతల మీదనే వ్యతిరేకంగా పోస్టింగ్‌లు పెడుతున్నారని రామచందర్రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సోషల్ మీడియాలో దాడులకు ప్రతి దాడులుండాలి, పార్టీ నేతలు కావొద్దు, ఇంకేవ్వరైనా కావొచ్చు సమాధానం చెప్పండి, వ్యక్తిత్వాలను చంపుకోవద్దని పార్టీ సోషల్ మీడియా, యూట్యూబ్ వారికి రామచందర్రావు దిశ నిర్దేశం చేశారంట. ప్రస్తుతం రామచందర్రావు చేసిన కామెంట్స్ కమలం పార్టీలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

ఇక పార్టీ నేతలు, కార్యకర్తల్నే కాదు కాంగ్రెస్, బీఆర్ఎస్ సోషల్ మీడియాలను సైతం ఆయన ఉతికి ఆరేశారు. ఒకవైపు పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరైనా ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేస్తే సస్పెండ్ చేస్తాం అంటూ హెచ్చరికలు ఇస్తూనే, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఫేక్ అకౌంట్స్ సృష్టించి బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నాయని, అభివృద్ధి పనుల కోసం కేంద్ర మంత్రులను కలిసినా, ఫిర్యాదు చేసేందుకు వెళ్లారని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తున్నారని, అట్లాంటి డిజిటల్ పేపర్స్, యూట్యూబ్ చానల్స్ పై .5 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తస్మాత్ జాగ్రత్త, ఒకడు దుబాయ్, మరొకడు అమెరికాలో ఉండి మా పార్టీపై బురద జల్లే ప్రయత్న చేస్తున్నారని మండిపడ్డారు.

జైలుకు పంపిస్తామంటూ సొంత పార్టీ నేతలపై ఫైర్

ఖబడ్దార్ దమ్ముంటే ముందుకు రండి తేల్చుకుందాం అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల సోషల్ మీడియా తో పాటు, ఇండిపెండెంట్ సోషల్ మీడియాకు సవాల్ విసిరారు వకీల్ సాబ్. అంతేకాదు ఎవరినీ ఉపేక్షించేది లేదు. పార్టీ నేతలైనా సరే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కేసులుబెట్టి జైలుకు పంపిస్తామంటూ సొంత పార్టీ నేతలపై విరుచుకు పడ్డారు. పార్టీ మీద వ్యంగoగా ఎవరు పోస్టులు పెట్టినా కౌంటర్ ఇవ్వండి. బీజేపీ చిల్లర రాజకీయాలకు భయపడదు. దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడండి, నా మీద కూడా ఫేక్ వార్తలు సృష్టిస్తున్నారు, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇస్తున్నా, మా మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నo మానుకోండి అంటూ ఫైర్ అయ్యారు.

కార్యకర్తలకు బిజెపి స్టేట్ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్

గత కొంతకాలంగా పార్టీలో నేతల మధ్య విభేదాలు ప్రభలి, పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండటంతో, ఇకపై పార్టీకి డ్యామేజ్ కలిగించే విధంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించలేదని ఇన్ డైరెక్ట్ గా ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలకు బిజెపి స్టేట్ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రామచందర్రావును ఎవరు టార్గెట్ చేశారు..? సొంత పార్టీ నేతలే టార్గెట్ చేశారా..? లేక ఇతర పార్టీల సోషల్ మీడియాతో టార్గెట్ చేయిస్తున్నారా..? అంతలా వకిల్ సాబ్ ను టచ్ చేసిందెవరు..? అన్నది ఇప్పుడు పార్టీలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. అంతేకాదు హలో రామచందర్రావు అంటూ వార్నింగ్ లిచ్చిన ధర్మపురి లాంటి వారికి, రబ్బర్ స్టాంప్ అన్నవారికి, డమ్మీ అన్న వారికి నేరుగా కౌంటర్లు ఎక్కుపెట్టారనే టాక్ సైతం నడుస్తోంది.

Story By Apparao, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×