E-Paper
Advertisement

Hypersonic Jet: జస్ట్, 7 గంటల్లో ప్రపంచాన్ని చుట్టేసే విమానాన్ని సిద్ధం చేస్తున్న చైనా.. టికెట్ ధర ఎంతంటే?

Hypersonic Jet: జస్ట్, 7 గంటల్లో ప్రపంచాన్ని చుట్టేసే విమానాన్ని సిద్ధం చేస్తున్న చైనా.. టికెట్ ధర ఎంతంటే?
Advertisement

China Hypersonic Jet: టెక్నాలజీ పరంగా చైనా దూసుకెళ్తుంది. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో.. అత్యాధునిక ఏరోస్పేస్ టెక్నాలజీలో కొత్తపుంతలు తొక్కుతుంది. ఇప్పటికే అద్భుతమైన బుల్లెట్ రైళ్లను తయారు చేసిన చైనా, ఇప్పుడు  అత్యంత వేగవంతమైన హైపర్‌ సోనిక్ విమానాల తయారీపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే.. కేవలం 7 గంటల్లో ప్రపంచాన్ని చుట్టేసే విమానాన్ని తయారు చేస్తుంది. ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు భద్రతను మరింత పెంచుతూ ఈ విమానాన్ని రూపొందిస్తుంది. ఈ హైపర్ సోనిక్ ప్రాజెక్టు గురించి కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

హైపర్ సోనిక్ యున్‌జింగ్ ఫ్లైట్

సుదూర ప్రయాణాలను కేవలం నిమిషాల్లో ముగించేలా హైపర్ సోనిక్ యున్‌జింగ్ ఫ్లైట్ ను చైనా రూపొందిస్తోంది. బీజింగ్‌ లో ఉన్న లింగ్‌ కాంగ్ టయాన్‌జింగ్ టెక్నాలజీ అనే ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ ఈ ఫ్యూచరిస్టిక్ విమానాన్ని తయారు చేస్తుంది. దీని స్పీడ్ ధ్వని వేగంతో పోల్చితే నాలుగు రెట్టు ఎక్కువగా ఉంటుంది. అంటే, సుమారు గంటకు 5,000 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ప్రస్తుతం అత్యంత వేగంగా ప్రయాణించే కాన్కార్డ్ విమానంతో పోల్చితే, దీని స్పీడు దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది.

2027లో అందుబాటులోకి వచ్చే అవకాశం!

Advertisement

ఈ హైపర్ సోనిక్ యున్‌జింగ్ ఫ్లైట్ కేవలం 7 గంటల్లో ప్రపంచాన్ని చుట్టేయనుంది. ఈ సమయంలో విమానం ఏకంగా 40,000 కి.మీ ప్రయాణిస్తుంది. ఇంకా చెప్పాలంటే, ప్రస్తుతం లండన్ నుంచి న్యూయార్క్ కు వెళ్లడానికి 7 గంటల సమయం పడితే, ఈ విమానం అందుబాటులోకి వస్తే, జస్ట్ 2 గంటల్లో పూర్తి కానుంది. అటు బీజింగ్ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు 2 గంటలు పడుతుంది. పారిస్ నుంచి బీజింగ్ కు కేవలం గంటలో ప్రయాణం పూర్తవుతుంది. 2024 అక్టోబర్‌ లో ప్రోటోటైప్ టెస్ట్ ఫ్లైట్ ను రెడీ చేసింది. పూర్తి ప్యాసింజర్ వెర్షన్ 2027లో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. వైడ్ వింగ్స్‌ తో, హైపర్‌ సోనిక్ మిస్సైల్స్ టెక్నాలజీ ఆధారంగా ఈ విమానం రూపొందుతుంది. ఒకసారి 10 నుంచి 170 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యంతో తయారు చేస్తున్నారు.

ఈ విమానం టికెట్ ధర ఎంత ఉండొచ్చంటే?

ఇంజనీరింగ్ సంక్లిష్టత, పరిమిత సామర్థ్యం కారణంగా టికెట్ ధర చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక్కో టికెట్ ధర ఏకంగా  30 వేల డాలర్లు(రూ. 2,688,576) ఉండొచ్చంటున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారవుతున్న ఈ విమానాన్ని ఎలైట్ ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నట్ఉల తెలుస్తోంది. సో ఇంకెందుకు ఆలస్యం అందుబాటులోకి వచ్చాక, మీరు కూడా ఓ ట్రిప్ వేసిరండి.

విమాన ప్రయాణంలో సవాళ్లు

Advertisement

⦿ హీట్ మేనేజ్‌ మెంట్: అతి వేగంలో గాలి ఘర్షణ వల్ల విమానం చాలా వేడెక్కుతుంది.

⦿ సోనిక్ బూమ్: సౌండ్ బారియర్ దాటేటప్పుడు ఏర్పడే శబ్దం ప్రజలకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది.

⦿ రెగ్యులేషన్స్: అంతర్జాతీయ చట్టాలు సూపర్‌ సోనిక్ ఫ్లైట్స్‌ ను పరిమితం చేస్తున్నాయి.

⦿ ప్రయాణికుల సేఫ్టీ: ప్రయాణీకులు గ్రావిటీ, రేడియేషన్ లాంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

Read Also:  ఏం తెలివి గురూ.. పాత ల్యాప్‌టాప్ బ్యాటరీలతో ఇంటికి కరెంట్.. ఐడియా అదుర్స్!

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×