E-Paper
Advertisement

ఇంస్టాగ్రామ్ నుంచి తప్పుకున్న పవన్ వైఫ్ అన్నా ..కారణం అదేనా?

ఇంస్టాగ్రామ్ నుంచి తప్పుకున్న పవన్ వైఫ్ అన్నా ..కారణం అదేనా?
Advertisement

Anna Lezhneva: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు నిత్యం అభిమానులతో టచ్ లో ఉండటం కోసం సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎంతోమంది యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా నిత్యం వారికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు అనుకోకుండా సోషల్ మీడియాకు పూర్తిగా దూరమవుతున్న సంగతి తెలిసిందే. అయితే వారి వారి వ్యక్తిగత విషయాల వల్ల ఇలా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు.

ఇంస్టాగ్రామ్ కు దూరంగా అన్నా లెజినోవా..

ఈ నేపథ్యంలోనే సినీ నటుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) భార్య అన్నా లెజినోవా(Anna Lezhneva) సైతం చాలా ఆలస్యంగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈమె గత కొద్ది నెలల క్రితం ఇంస్టాగ్రామ్ (Instagram)అకౌంట్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక అన్నా లేజినోవా సైతం నిత్యం తన జిమ్ కు సంబంధించిన ఫోటోలతో పాటు పవన్ కళ్యాణ్ తో కొన్ని పర్సనల్, క్యూట్ ఫోటోలను కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంటూ అభిమానులతో అన్ని విషయాలను ముచ్చటించేవారు.

నెగిటివ్ కామెంట్స్ కారణమా..

Advertisement

ఇలా మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలతో పాటు తన విషయాలను అలాగే అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో ఎంతో యాక్టివ్ గా ఉన్న లేజినోవా ఉన్నఫలంగా ఇంస్టాగ్రామ్ అకౌంట్ డీ యాక్టివేట్ చేశారు. ఇలా ఈమె తన ఇంస్టాగ్రామ్ డీ యాక్టివేట్ చేయడానికి కారణం ఏంటి అంటూ అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు అయితే అన్నా లెజినోవా ఉన్నఫలంగా ఇంస్టాగ్రామ్ కు దూరం అవడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా వేదికగా వచ్చే నెగిటివ్ కామెంట్స్ (Negative Comments) అనే చెప్పాలి. సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఫాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవాలి అంటే వారి గురించి వచ్చే విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

టార్గెట్ చేస్తున్న పవన్ యాంటీ ఫ్యాన్స్..

కొంతమంది సెలబ్రిటీలు ఈ విమర్శలను దీటుగా ఎదుర్కొంటూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. మరి కొంతమంది మాత్రం ఇలాంటి విమర్శలను ఎదుర్కోలేక సోషల్ మీడియాకు దూరమవుతూ ఉంటారు. అన్నా లేజినోవా కూడా భారీగా విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈమె భర్త పవన్ కళ్యాణ్ సినీ, రాజకీయాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో కొందరు యాంటీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ కూడా ఈమె పై విమర్శలు కురిపిస్తూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్న నేపథ్యంలోనే ఇంస్టాగ్రామ్ నుంచి తప్పుకున్నారని తెలుస్తుంది. మరి అన్నా లెజినోవా శాశ్వతంగా ఇంస్టాగ్రామ్ కు దూరమవుతారా లేదా తిరిగి యాక్టివ్ అవుతారా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన విశ్వక్ సేన్.. ఇది ఊహించలేదంటూ!

Related News

అసలు నేను చేసిందేంటి? గరివిడి లక్ష్మి వివాదంపై ఆర్పీ ఆవేదన!

గరివిడి లక్ష్మి వివాదంపై ఆర్పీ పట్నాయక్ సంచలన వ్యాఖ్యలు.. బయోపిక్‌లో నిజాలు చూపించారా?

ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన విశ్వక్ సేన్.. ఇది ఊహించలేదంటూ!

త్రిష రోడ్ షో చూస్తే మైండ్ బ్లాక్.. పొలిటికల్ ఎంట్రీకి ఇదే సిగ్నలా?

‘ఇరుముడి’ సక్సెస్… తల్లికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన మణెమ్మ..

ఇడుపు కాయితం పాట పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్!

ఘనంగా అర్జున్ చిన్న కూతురు పెళ్లి.. ఫోటోలు వైరల్!

Big Stories

Advertisement
×