E-Paper
Advertisement

న్యూజిలాండ్ లో టీమిండియా క్రికెట‌ర్ల‌కు ఫుడ్ క‌ష్టాలు…పాములు, తేళ్లు, గ‌బ్బిపాలు!

న్యూజిలాండ్ లో టీమిండియా క్రికెట‌ర్ల‌కు ఫుడ్ క‌ష్టాలు…పాములు, తేళ్లు, గ‌బ్బిపాలు!
Advertisement

IND VS NZ: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (Team India vs New Zealand) మధ్య టీ20 సిరీస్ అద్భుతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో రెండు టీ20లు పూర్తి కాగా.. అక్టోబర్ 27వ తేదీన మూడో మ్యాచ్ జరగనుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా క్రికెటర్లకు ఫుడ్ కష్టాలు వచ్చాయి. ఇండియా తరహాలో న్యూజిలాండ్ లో ప్లేయర్లకు ఇష్టమైన ఆహారం దొరకడం లేదని తెలుస్తోంది. తాజాగా అభిషేక్ శర్మ అలాగే అక్షర్ పటేల్ ఓ రెస్టారెంట్ కు వెళ్లినప్పటికీ రుచికరమైన ఫుడ్ దొరకలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన రీల్స్ వైర‌ల్ గా మారాయి.

న్యూజిలాండ్ లో టీమిండియా క్రికెట‌ర్ల‌కు ఫుడ్ క‌ష్టాలు

న్యూజిలాండ్ పై రెండో విక్టరీ నమోదు చేసుకున్న జోష్ లో అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ ఇద్దరూ రెస్టారెంట్ కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్క‌డి బ‌య‌టి ఫుడ్ తినే ప్రయత్నం చేశారు. ఇచ్చిన ఆర్డర్ టేబుల్ పైకి రాగానే అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ ముఖాలు వాలిపోయాయి. ఇదెక్కడి ఫుడ్ రా నాయనా? అంటూ వాపోయారు. ఇది ఎలా తినాలో అర్థం కావడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే మాకు రొట్టెలు, వడపావ్ లు కావాల‌ని వేడుకుంటూ రచ్చ చేస్తూ, రీల్స్‌ చేశారు. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు. పాపం టీమిండియా క్రికెట‌ర్లకు పాములు, తేళ్లు, గ‌బ్బిపాలు పెడుతున్నారా ? జ‌ర ఇండియాలో దొరుకుతున్న ఫుడ్ కాస్త అందించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అవ‌స‌ర‌మైతే, హైద‌రాబాద్ బిర్యానీ వండించి, పెట్టాల‌ని మ‌రికొంద‌రు రియాక్ట్ అవుతున్నారు.

Advertisement

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

న్యూజిలాండ్ గ‌డ్డ‌పై ఇర‌గ‌దీస్తున్న టీమిండియా

న్యూజిలాండ్ గడ్డపై టీ20లు ఆడుతున్న టీమ్ ఇండియా ఇరగదీస్తోంది. ఫ్లాట్ మైదానాలపై మాత్రమే టీమిండియా క్రికెటర్లు ఆడతారని కొంత మంది ట్రోల్ చేశారు. విదేశీ గడ్డ‌ల‌పై తేలిపోతారని ఇన్సల్ట్ చేశారు. కానీ అందరి విమర్శలను తిప్పికొడుతూ టీమిండియా.. న్యూజిలాండ్ గడ్డపై దుమ్ము లేపుతోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు టీ20 లలో విజయం సాధించింది. మ‌రో మ్యాచ్ లో గెలిస్తే, టీ20 సిరీస్ ద‌క్కించుకోనుంది. ఇక న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య అక్టోబర్ 27వ తేదీన వెల్లింగ్టన్ వేదికగా మూడవ టి20 జరగనుంది. ఈ మ్యాచ్ లో కూడా సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించనుంది. అంటే మరోసారి టాస్ కీలకం అవుతుంది. నిన్న జరిగిన రెండో టి20 సందర్భంగా తెలుగు కుర్రాళ్ళు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి అదరగొట్టి మ్యాచ్ గెలిపించారు.

Advertisement

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

 

Related News

మీరు మగాళ్లయితే, ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసి 250 ప‌రుగులు చేయండి!

వాంఖ‌డే స్టేడియంలో ముంబై జెర్సీలే క‌న‌బ‌డాలి…కీరన్ పొలార్డ్ హుకుం

30 ప‌రుగుల‌తో టీమిండియా ఓడిపోయేది…కానీ బీసీసీఐ కుట్ర‌ల‌తోనే గెలిచారు!

ఇది రా తెలుగోడి బ్రాండ్.. తిల‌క్ వ‌ర్మపై ఈగ కూడా వాల‌నివ్వ‌కుండా సెక్యూరిటీ?

తిలక్ వర్మ హీరో కాదు, జీరో…బంతుల‌న్ని మింగాడు

తిల‌క్ వ‌ర్మ‌ కాళ్లు క‌డిగి నెత్తిన పోసుకోండి…త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

ఒరేయ్ రెడ్డి..? నితీశ్ కుమార్‌ను బూతులు తిట్టిన తిలక్ వర్మ !

Big Stories

Advertisement
×