Vishwak Sen: టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ త్వరలోనే కల్ట్(Cult) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.. విశ్వక్ తన డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 30వ తేదీ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్ స్లాపర్ థ్రిల్లర్ గా ప్రచారం పొందుతున్న ఈ సినిమా గోవాలోని ఒక పబ్ లో సుమారు 300 మందిని బందీలుగా చేసి ఆడే ఒక ప్రాణాంతకమైన ఆట ఆధారంగా రాబోతుందని తెలుస్తుంది. నిజజీవిత సంఘటనల ఆధారంగా రాబోతుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ (Vishwak Sen) సంకల్ప నాయక్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. విశ్వక్ జోడిగా ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్ సందడి చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకు కొద్ది రోజులు సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు సారధి స్టూడియోలో అభిమానులతో ఫోటో సెషన్ (photo session) ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం నిర్వాహకులు మాత్రం సరైన విధంగా ఏర్పాట్లు చేయలేదని చెప్పాలి. దీంతో ఈ ఫోటో సెషన్ అర్ధాంతరంగా ఆపివేయాల్సి వచ్చింది. అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా అభిమానులు రావడంతో ఈ ఫోటో సెషన్ మధ్యలోనే నిలిపివేశారు దీంతో అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఈవెంట్ మేనేజర్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపివేశారు.
ఇలా సారథి స్టూడియో ప్రాంగణంలో విశ్వక్ అభిమానులు చేసిన రచ్చ మామూలుగా లేదని చెప్పాలి. ఇలా తనతో ఫోటోలు దిగడం కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులకు నిరాశ ఎదురయిందని చెప్పాలి. ఇలా ఫోటో సెషన్ ఈవెంట్ అర్ధాంతరంగా ముగియడంతో అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విశ్వక్ సేన్ తాజాగా ఈ విషయం గురించి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తూ ఒక నోట్ విడుదల చేశారు.
https://tywitter.com/VishwakSenActor/status/2114327869145112854
ఇందులో భాగంగా.. ఫ్యాన్స్ తో ఫోటో సెషన్ సమయంలో మీకు కలిగిన అసౌకర్యానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. మీ నుంచి వచ్చిన స్పందన, ప్రేమ, మేము ఊహించిన దానికంటే చాలా ఎక్కువ అయింది.మా అంచనా దాటేసరికి అందరినీ కలవాలని అనుకున్నప్పటికీ సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ఒక్కసారిగా జనం ఎక్కువ కావడంతో ప్రతి ఒక్కరిని కలవలేకపోయాను. నాతో ఫోటో దిగాలని వచ్చి అవకాశం దక్కక వెనుదిరిగి వెళ్లిన అభిమానులందరికీ క్షమాపణలు చెబుతున్నాను. మిమ్మల్ని కలవలేకపోయానని బాధ నాకు ఉంది. త్వరలోనే మరో ఫ్యాన్ ఫోటో సెషన్ ప్లాన్ చేస్తున్నా, ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగేలా ఏర్పాట్లు చేస్తామని విశ్వక్ ఈ సందర్భంగా అభిమానులకు ఒక స్పెషల్ నోట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
Also Read: ‘ఇరుముడి’ సక్సెస్… తల్లికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన మణెమ్మ..