E-Paper
Advertisement

అమ్మాయిల మనసు గెలవాలంటే ‘సిక్స్‌ ప్యాక్’ అక్కర్లేదు.. ఈ సీక్రెట్స్ తెలిస్తే చాలు!

అమ్మాయిల మనసు గెలవాలంటే ‘సిక్స్‌ ప్యాక్’ అక్కర్లేదు.. ఈ సీక్రెట్స్ తెలిస్తే చాలు!
Advertisement

Relationship Tips : అమ్మాయిలు మీ నుండి అసలేం కోరుకుంటున్నారో తెలీక జుట్టు పీక్కుంటున్నారా.. అసలు అమ్మాయిల మనసులో ఏముందో తెలీక సతమతమైపోతున్నారా.. డబ్బు, అందం ఇలా అన్నీ ఉన్నా వాళ్ళు మిమ్మల్ని అస్సలు దేకట్లేదా.. అయితే అమ్మాయిలు నిజంగా మీ నుండి ఏం కోరుకుంటున్నారో, మిమ్మల్ని వారు ఎలా ఇష్టపడతారో తెలుసుకోవడానికి ఇదిగో ఈ టిప్స్ ఫాలో అయిపోండి.

అమ్మాయిలు ఇష్టపడేది ఎవరినో తెలుసా

Advertisement

మాములుగా మగవాళ్లు ఎప్పుడూ సీరియస్‌గా ఉండటానికి ట్రై చేస్తారు. సొసైటీ మిమ్మల్ని అలా ట్యూన్ చేసింది మరి. కానీ అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడేది ఎవరినో తెలుసా.. ఎమోషనల్‌గా ఉంటూ ఇంటిలిజెన్స్ చూపించేవాళ్లని. అవును.. అలాంటి వారినే ఇష్టపడతారు. ఎందుకంటే తన ప్లస్, మైనస్‌లు ఇలా అన్నింటిని షేర్ చేసుకునే అబ్బాయి అంటే అమ్మాయిలకి రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇతను నా వాడు, నేను ఏదైనా ఓపెన్‌గా చెప్పొచ్చు అనే నమ్మకం కుదిరిందంటే మీ బంధం బలపడినట్టే. సో మీలోని సెన్సిబుల్ యాంగిల్ బయటికి తీయండి, అమ్మాయిలకి దగ్గరైపొండి.

బాగా అబ్జర్వ్ చేసే విషయం ఏంటో తెలుసా

Advertisement

ఇక అమ్మాయిలు మీలో బాగా అబ్జర్వ్ చేసే విషయం ఏంటో తెలుసా.. వాళ్ల పట్ల మీ అటెన్షన్ ఎంతుందని. ముఖ్యంగా ఆమెతో ఉన్నప్పుడు మీరు ఫోన్ పక్కన పెట్టారా లేక ఫోన్‌లో స్క్రోల్ చేస్తూ వింటున్నట్టు నటిస్తున్నారా అనే విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మీ కొంప ముంచేవి. సో ఫోన్‌ని కాసేపు పక్కన పెట్టేయండి, ఆమె ఎలాంటి మూడ్‌లో ఏం చెబుతుందో జాగ్రత్తగా వినండి. మీరు తనని ఎంత కేర్ చేస్తున్నారు అనే దానిమీదే మీ బంధం ఆధారపడి ఉంది మరి.

also read :రికార్డుల రారాజు.. బయోపిక్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్! మైఖేల్ మేనియాకు బాక్సాఫీస్ షేక్!

అమ్మాయిలకి అస్సలు ఇష్టముండదు

ఇక దొరికిందే తడవుగా ఏకదాటిగా ఫోన్లు చేయడం, ఆ తర్వాత అత్తపత్తా లేకుండా పోవడం వంటి పిచ్చి పనులు అస్సలు చేయకండి. ఇలా కన్సిస్టెన్సీ లేని బిహేవియర్ అంటే అమ్మాయిలకి అస్సలు ఇష్టముండదు. మీరే పరిస్థితుల్లో ఉన్నా ప్రతిరోజూ ఒకేలాంటి ప్రేమను, గౌరవాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ నిలకడనే మీ ప్రేమని నిలబెట్టేది.

వారిని అమ్మాయిలు అస్సలు వదులుకోరు

ఇక ప్రేమలో పడ్డాం కదా అని చదువుని, గోల్స్‌ని నిర్లక్ష్యం చేసేవారంటే అమ్మాయిలకి అస్సలు ఇష్టముండదు. ఎందుకంటే మీరు వారిని ఎంత ఇష్టపడుతున్నారు అనేదాని కన్నా మీ గోల్స్ పట్ల మీరెంత ఫోకస్డ్‌గా ఉన్నారనేదే వాళ్లు చూస్తారు. తమ గోల్ కోసం కష్టపడేవారిని, సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్న తపన ఉన్నవారిని అమ్మాయిలు అస్సలు వదులుకోరు. ఎందుకంటే అలాంటి వారితోనే తమ లైఫ్ ఫుల్ సెక్యూర్‌గా ఉంటుందని వాళ్లు ఫీలవుతారు కాబట్టి.

 మీరు గౌరవం ఇస్తున్నారా అనేదే ముఖ్యం

ఇక అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఎంత ప్రేమిస్తున్నారు అనేది కాదు.. వారికి మీరు గౌరవం ఇస్తున్నారా అనేదే ముఖ్యం. ఆమె తీసుకున్న నిర్ణయాలను గౌరవించడం, ఆమెకి పర్సనల్ స్పేస్‌కు వాల్యూ ఇవ్వడం చాలా ముఖ్యం. అలా కాకుండా అస్తమానం అనుమానపడటం, పది మందిలో చులకనగా చూడటం వంటివి చేశారంటే మీ బంధం బంగాళాఖాతంలో కలవడం ఖాయం.

సో ఈ టిప్స్‌ని జాగ్రత్తగా పాటించండి. మీరు మెచ్చిన, మిమ్మల్ని నచ్చిన అమ్మాయిని సొంతం చేసుకోండి!

also read :సినిమా ముచ్చట్లు ..తెర వెనుక సంగతులు

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×