Peddi Controversy: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. జూన్ 4, 2026న వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు రూ.136 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన సినిమా, రెండో రోజుకి ఏకంగా 181కోట్లని కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలకు పెద్ద షాక్ ఇచ్చింది.
గతంలో ‘RRR’ సినిమాతో గ్లోబల్ స్థాయిలో సత్తా చాటిన రామ్ చరణ్ , ఇప్పుడు ‘పెద్ది’ చిత్రంతో తన స్టార్ పవర్‌ను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ నటన, డైరెక్టర్ బుచ్చిబాబు మేకింగ్ స్టైల్‌పై సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లగా, సీనియర్ నటులు జగపతి బాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ తమ నటనతో సినిమాకు ప్రధాన బలంగా నిలిచారనే చెప్పాలి.
అయితే భారీ బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాకు ఒకవైపు సాలిడ్ కలెక్షన్లు వస్తున్నప్పటికీ,మరోవైపు నెట్టింట ఒక వర్గం ప్రేక్షకుల నుంచి ట్రోలింగ్ గట్టిగానే జరుగుతుంది.ముఖ్యంగా ఈ సినిమాలో కథానాయికగా నటించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పోషించిన ‘అచ్చియమ్మ’ పాత్రని డిజైన్ చేసినప్పటికీ నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో జాన్వీ కపూర్ ‘దేవర’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ‘పెద్ది’ సినిమాలో ఆమె పాత్ర కేవలం గ్లామర్ షోకే పరిమితమైందని, ముఖ్యంగా కొన్ని ముద్దు సీన్స్ మహిళా ప్రేక్షకులను అసౌకర్యానికి గురిచేసేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ నడుస్తుంది.
ఈ విమర్శలపై దర్శకుడు బుచ్చిబాబు సన బాధ్యతాయుతంగా స్పందించారు.ప్రేక్షకుల నెగిటివ్ ఫీడ్‌బ్యాక్‌ను గౌరవిస్తూ ఆయన తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్‌లో ఒక పోస్ట్ వదిలారు. ఒక సినిమా దర్శకుడిగా సినిమా ప్రేక్షకులను అలరించాలని, వారితో మమేకం కావాలని తాను నమ్ముతానని, అది ఎవరినీ అసౌకర్యానికి గురిచేయకూడదని ఆయన పేర్కొన్నారు. ‘పెద్ది’లోని కొన్ని సన్నివేశాల గురించి వచ్చిన అభిప్రాయాలను తాము గౌరవిస్తామని, తెరపైన, తెర వెనుక కూడా మహిళల పట్ల తనకు ఎల్లప్పుడూ అపారమైన గౌరవం ఉందని స్పష్టం చేశారు. ఏ స్త్రీ పాత్రను వస్తువుగా చూపించడం లేదా అగౌరవపరచడం తమ ఉద్దేశ్యం కాదని, ఒకవేళ ఎవరైనా అలా భావించి ఉంటే వారి భావాలను గౌరవిస్తూ మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు.
As a filmmaker, I believe cinema should entertain, inspire, and connect with audiences. It should never make anyone feel uncomfortable or disrespected. We have heard the feedback regarding certain scenes in Peddi and have taken it seriously.
I have always had immense respect for…
— BuchiBabuSana (@BuchiBabuSana) June 6, 2026
అంతేకాదు, కేవలం క్షమాపణలతో సరిపెట్టకుండా కాంట్రవర్సీ కి కారణమైన ముద్దు సీన్స్ ని సినిమా నుంచి వెంటనే తొలగిస్తున్నట్లు (ట్రిమ్ చేస్తున్నట్లు) బుచ్చిబాబు సంచలన ప్రకటన చేశారు. ప్రేక్షకుల అభిప్రాయాల పట్ల శ్రద్ధ వహించాల్సిన బాధ్యత కథకులుగా తమపై ఉందన్న ఆయన, ప్రతి మహిళ గౌరవించబడటానికి, హుందాగా ప్రాతినిధ్యం వహించడానికి అర్హురాలని అన్నారు. బలమైన పాత్రలతో కథలను చెప్పడానికే తాము కట్టుబడి ఉన్నామని, నిజాయితీగా అభిప్రాయాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
సినిమా వందల కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతున్న తరుణంలో, ఈగోలకు పోకుండా ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌ను స్వీకరించి వెంటనే సినిమాలో మార్పులు చేయడంపై చిత్ర యూనిట్‌పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఒక స్టార్ డైరెక్టర్ ప్రతి ఒక్క నెటిజన్ అభిప్రాయానికి అంతటి గౌరవం ఇవ్వడం నిజంగా గ్రేట్ అంటూ సినీ ఇండస్ట్రీ వర్గాలు సైతం బుచ్చిబాబును అభినందిస్తున్నాయి. ఈ మార్పుల తర్వాత సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత కనెక్ట్ అవుతుందని, రాబోయే రోజుల్లో ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద మరిన్ని కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.
also read :రామ్‌చరణ్ ఊచకోత.. 48 గంటల్లోనే రూ. 181 కోట్లు. కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్!