E-Paper
Advertisement

గుండ్లపోచంపల్లిలో మహా అద్భుతం.. సిద్దిపేట బాలుడికి దక్కిన పునర్జన్మ!

గుండ్లపోచంపల్లిలో మహా అద్భుతం.. సిద్దిపేట బాలుడికి దక్కిన పునర్జన్మ!
Advertisement

Spine Surgery: స్వేచ్చ బ్యూరో: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బలగాని స్పైన్ అండ్ ఆర్థో హాస్పిటల్‌లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. న్యూరో మస్కులర్ స్కోలియోసిస్‌తో బాధపడుతున్న ఓ బాలుడికి చికిత్స చేసి, అతనికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. డాక్టర్ శ్రీనివాస్ బలగాని, అనస్థీషియా నిపుణురాలి సహకారంతో సుమారు మూడు గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

వివరాల్లోకి వెళితే..

సిద్దిపేట జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్‌కు చెందిన సాత్విక్ (12) పుట్టుకతోనే వెన్నెముక వంకరగా ఉండేది. బాలుడు పెరిగే కొద్దీ వెన్నెముక మరింత వంకర తిరగడంతో నడవడం, కూర్చోవడం కూడా కష్టంగా మారింది. ఇటీవల పరిస్థితి మరింత విషమించడంతో తల్లిదండ్రులు అతడిని డాక్టర్ శ్రీనివాస్ బలగాని వద్దకు తీసుకువచ్చారు. బాలుడి పరిస్థితిని సమీక్షించి, పలు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడు న్యూరో మస్కులర్ స్కోలియోసిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని తల్లిదండ్రులకు భరోసా కల్పించారు.

Advertisement

Also Read: ఆండ్రాయిడ్ ఫోన్లను.. ఘోరంగా అవమానించిన యాపిల్.. నెట్టింట రచ్చ రచ్చ!

చికిత్స విజయవంతం..

అనంతరం ఐదు రోజుల క్రితం శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్స సమయంలో రోగిని అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించారు. అనస్థీషియా నిపుణురాలు ఎనిమిది గంటల పాటు రోగి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ డాక్టర్ శ్రీనివాస్‌కు పూర్తి సహాయ సహకారాలు అందించారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిన ఐదు రోజుల తర్వాత సాత్విక్ కోలుకోవడం ప్రారంభించాడు. గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయి. వంగి నడిచే పరిస్థితి మారి, ప్రస్తుతం నిటారుగా నిలబడటమే కాకుండా సౌకర్యంగా కూర్చోగలుగుతున్నాడు. పూర్తి స్థాయిలో కోలుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు.

ప్రత్యేక కృతజ్ఞతలు..

Advertisement

ఈ సందర్భంగా సాత్విక్ తండ్రి మాట్లాడుతూ, డాక్టర్ శ్రీనివాస్ బలగాని తమ కుమారుడిని కోలుకునేలా చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని అన్నారు. పుట్టినప్పటి నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్న తమ కుమారుడి పరిస్థితి చూసి ఎన్నోసార్లు మనసు కలచివేసిందని, శస్త్రచికిత్స అనంతరం అతని ఆరోగ్యం మెరుగుపడటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. తమ కుమారుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన డాక్టర్ శ్రీనివాస్ బలగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Also read: Flex Fuel: ఇక పెట్రోల్‌కు బై బై చెప్పె రోజులొచ్చాయ్.. మార్కెట్లోకి హీరో ఫ్లెక్స్ బైకులు, మారుతీ కారు..!

Related News

కాంగ్రెస్ నాయకులకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు.. హరీష్ రావు షాకింగ్ కామెంట్స్!

Ramchander Rao: ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులకు బిగ్ షాక్..?

‘ఎల్ నినో’తో ఎండిపోతున్న తెలంగాణ.. కాంగ్రెస్ నిద్రమత్తులో ఉందా? సీఎంకు దాసోజు శ్రవణ్ లేఖ!

రాహుల్ గాంధీ అరెస్ట్‌పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్.. ఏమన్నారంటే?

నా చావు కాలేజీకి చెప్పకండి.. సంతోషిస్తారు!.. కన్నీళ్లు పెట్టిస్తున్న స్టూడెంట్ సూసైడ్ నోట్!

అధికారం పోయినా అహంకారం తగ్గలేదు.. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి వాకిటి శ్రీహరి!

ఉద్యమకారుల కోసం పోరాడి.. బీఆర్ఎస్‌లో బలయ్యాను.. కవిత సంచలన వ్యాఖ్యలు

Education Hub: మాటలు వద్దు.. హకీంపేటలో అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్!

Big Stories

Advertisement
×