E-Paper
Advertisement

Tecno Pova 8 లాంచ్ డేట్ లీక్.. 8000mAh బ్యాటరీతో బడ్జెట్ ఫోన్లకు టఫ్ కాంపిటీషన్!

Tecno Pova 8 లాంచ్ డేట్ లీక్.. 8000mAh బ్యాటరీతో బడ్జెట్ ఫోన్లకు టఫ్ కాంపిటీషన్!
Advertisement

Tecno Pova 8: టెక్నో ప్రియులకు గుడ్ న్యూస్. భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు టెక్నో సంస్థ సర్వం సిద్ధం చేసింది. తన పాపులర్ పోవా సిరీస్‌లో భాగంగా Tecno Pova 8 ఫోన్ లాంచ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన డిజైన్, కలర్స్, బ్యాటరీ వివరాలను కూడా కంపెనీ టీజ్ చేసింది.

వచ్చే వారమే గ్రాండ్ ఎంట్రీ:

Tecno Pova 8 స్మార్ట్‌ఫోన్ ఈనెల 11న భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని కంపెనీ తమ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పష్టం చేసింది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న బ్యానర్ ప్రకారం.. ఈ ఫోన్ సేల్స్ కూడా ఫ్లిప్‌కార్ట్ ద్వారానే జరగనున్నాయి.

నథింగ్ ఫోన్ స్టైల్‌లో లైటింగ్:

Advertisement

ఈ కొత్త ఫోన్ డిజైన్ పరంగా అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా గ్రీన్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఫోన్ వెనుక వైపు కెమెరా మాడ్యూల్‌ను కాస్త వైవిధ్యంగా డిజైన్ చేశారు. అలాగే దీనిలో మ్యాట్రిక్స్ స్టైల్ డాటెడ్ లైటింగ్ ఫీచర్‌ను అందించినట్లు తెలుస్తోంది. నథింగ్ ఫోన్లలో కనిపించే గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ తరహాలోనే, స్క్రీన్ ఆన్ చేయకుండానే నోటిఫికేషన్లు, ఇతర సమాచారాన్ని ఈ మైక్రో ఎల్‌ఈడీ లైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.

Also Read: 10000mAh భారీ బ్యాటరీతో రియల్‌మీ కొత్త 5G ఫోన్లు.. ఒక్క ఛార్జ్‌తో 2 రోజుల బ్యాకప్?

8,000mAh మెగా బ్యాటరీ:

Advertisement

ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ సామర్థ్యమే. దీనిలో ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీని అందిస్తున్నట్లు కంపెనీ ధృవీకరించింది. దీనికి తోడు 45W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో బ్యాటరీ త్వరగానే ఫుల్ అవుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు, మూడు రోజుల పాటు బ్యాటరీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు.

పవర్‌ఫుల్ ఫీచర్లు:

లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌తో రానుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది పనిచేయనుంది. కనెక్టివిటీ పరంగా 5G నెట్‌వర్క్‌తో పాటు బ్లూటూత్, వై-ఫై, ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB+128GB, 8GB+128GB, అలాగే 8GB+256GB వేరియంట్లలో లభించే అవకాశం ఉంది.

Also Read: WhatsAppలో ఈ ఒక్క సెట్టింగ్ OFFలో ఉంటే.. మీ పర్సనల్ చాట్స్ హాకర్ల చేతికి చిక్కినట్టే!

Related News

అరె వా ఏమి సౌండ్! రూ.2199 బడ్జెట్‌లో నంబర్ 1 పార్టీ స్పీకర్ ఇదేనా?

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Big Stories

Advertisement
×