E-Paper
Advertisement

వివాదాల్లో పెద్ది…రామ్ చరణ్ సినిమాపై ఈ రేంజ్ నెగెటివిటీనా?

వివాదాల్లో పెద్ది…రామ్ చరణ్ సినిమాపై ఈ రేంజ్ నెగెటివిటీనా?
Advertisement

Peddi Controversy: రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య నేడు థియేటర్లలోకి వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది.కానీ అదే సినిమా సోషల్ మీడియాలో మాత్రం తీవ్రమైన నెగెటివిటీని మూటగట్టుకుంటోంది. సమాజంలో వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం, ఒక అథ్లెట్ ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ తిరిగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను ప్రమోట్ చేసినప్పటికీ, థియేటర్లలోకి వచ్చాక సీన్ రివర్స్ అయింది. కథలో ఉన్న మంచి సందేశాన్ని పక్కనబెట్టి, దర్శకుడు కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో పెట్టిన కొన్ని కాంట్రవర్సీ సీన్లు ఇప్పుడు సినిమా ఆత్మను దెబ్బతీశాయనే కామెంట్స్ కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి.

బుచ్చిబాబుపై ట్రోల్స్ వర్షం

Advertisement

ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను, నెటిజన్లను తీవ్రంగా గాయపరిచేలా ఒక సన్నివేశాన్ని డిజైన్ చేయడంపై నెట్టింట్లో దర్శకుడు బుచ్చిబాబుపై ట్రోల్స్ వర్షం కురుస్తోంది.సినిమాలో హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్‌ను బలవంతంగా ముద్దుపెట్టుకునే ఒక సీన్ ఉంది. ఆ సమయంలో హీరోయిన్ భయంతో, తీవ్ర అవమానంతో కన్నీళ్లు పెట్టుకుంటుంటే, బ్యాక్‌గ్రౌండ్‌లో మాత్రం ఏదో గొప్ప ప్రేమ సన్నివేశం జరుగుతున్నట్టు లవ్ మ్యూజిక్ ప్లే చేయడం గమనార్హం.

అంతేకాకుండా, హీరో తదనంతరం తన తప్పుడు ప్రవర్తనను సమర్థించుకోవడం థియేటర్లలోని ప్రేక్షకులను సైతం విస్మయానికి గురిచేసింది. అమ్మాయిల అనుమతి లేకుండా వారిపై జరిగే శారీరక వేధింపులను, బలవంతపు చర్యలను ప్రేమ పేరిట గ్లోరిఫై చేయడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి చిత్రాల విషయంలో జరిగిన చర్చను ఈ సీన్ మళ్లీ గుర్తుకు తెస్తోంది.ఇలాంటి ట్రెండ్స్  సమాజానికి చాలా తప్పుడు సంకేతాలను పంపుతాయని, యువతను తప్పుదోవ పట్టిస్తాయని  సైతం పెదవి విరుస్తున్నారు సినీ పండిట్స్. సోషల్ మీడియాలో ఈ సీన్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లు, వీడియోలు వైరల్ అవుతుండటంతో, ఆ వివాదాస్పద సీన్‌ను థియేటర్ల నుండి వెంటనే తొలగించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.

Advertisement

గ్లామర్ డాల్‌ అయిపోయిన జాన్వీ కపూర్

ఈ వివాదం ఒకవైపైతే, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను టాలీవుడ్ దర్శకులు కేవలం ఒక గ్లామర్ డాల్‌లాగే చూస్తున్నారనే అసహనం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. గత ఏడాది ఎన్టీఆర్ సరసన నటించిన ‘దేవర’ చిత్రంలో కూడా ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా కేవలం పాటలకే పరిమితం చేశారనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ‘పెద్ది’ సినిమాలో కూడా అదే సీన్ రిపీట్ అయిందని నెటిజన్లు మండిపడుతున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఒక అథ్లెట్ కథలో కూడా ఆమె కాస్ట్యూమ్స్, కెమెరా యాంగిల్స్ అన్నీ ఆమె అందాల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చేలా ప్లాన్ చేయడం దర్శకుడి కమర్షియల్ మైండ్ సెట్‌ను చూపిస్తోందని విమర్శిస్తున్నారు. జాన్వీ కపూర్ నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకోవాలని చూస్తున్నా, మన సౌత్ దర్శకులు మాత్రం ఆమెను కేవలం గ్లామర్ కోసమే వాడుకుంటున్నారనే ఆరోపణలు నిజమేనని ఈ చిత్రం నిరూపించిందని కామెంట్స్ చేస్తున్నారు.

బుచ్చి అండ్ టీమ్ ఎలా రియాక్ట్ అవుతారో

రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో, ఎమోషనల్ సీన్లలో జీవించేసినప్పటికీ, బుచ్చిబాబు సన రాసుకున్న ఈ బలవంతపు ముద్దు సీన్ మరియు జాన్వీ పాత్రను కేవలం గ్లామర్ కోసమే వాడుకున్న విధానం సినిమాకు పెద్ద మైనస్‌గా మారాయి. ఒకవైపు సామాజిక బాధ్యత గల కథను చెబుతూనే, మరోవైపు ఇలాంటి రిగ్రెసివ్ సీన్లతో సినిమాను నింపేయడం బుచ్చిబాబు సన ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతోందని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. చూడాలి మరి ఈ కాంట్రవర్సీ పై బుచ్చి అండ్ టీమ్ ఎలా రియాక్ట్ అవుతారో !

also read :రెండు కాళ్లు ఫ్రాక్చర్.. ఆసుపత్రి బెడ్‌పై నుంచి పండు మాస్టర్ షాకింగ్ కామెంట్స్!

Related News

వారి టార్చర్ వల్లే వదిలేసా -ఐశ్వర్య లక్ష్మీ

యష్ ‘టాక్సిక్’ కథ లీక్..ఆ సెంటిమెంట్ వింటే మైండ్ పోవాల్సిందే!

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?

జయకృష్ణ సీక్రెట్ లీక్ చేసిన రషా.. ‘శ్రీనివాస మంగాపురం’ సెట్స్‌లో ఏం జరిగిందంటే?

మరో కొత్త సినిమాతో ‘లెనిన్ ‘డైరెక్టర్.. ఒక హిట్.. క్రేజీ హీరోతో ఛాన్స్!

NBK 111:బాబాయ్ కోసం అబ్బాయ్ ఎమోషనల్ మెసేజ్.. జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నాడంటే?

జాన్ అబ్రహం కొత్త ఇల్లు ఎంతో తెలుసా ..రేటు చూస్తే మతి పోవాల్సిందే !

Big Stories

Advertisement
×