E-Paper
Advertisement

Ameenpur Lake: డేంజర్ బెల్స్.. మాయమైపోతున్న అమీన్‌పూ‌ర్ పెద్ద చెరువు..?

Ameenpur Lake: డేంజర్ బెల్స్.. మాయమైపోతున్న అమీన్‌పూ‌ర్ పెద్ద చెరువు..?
Advertisement

Ameenpur Lake: ఇవీ అమీన్‌పూర్ పెద్ద చెరువు వద్ద ఓపెన్‌గా జరుగుతున్న బేరాలు. చెరువులో మట్టి నింపే గ్యాంగులు కొందరితో చేసుకుంటున్న డీల్స్. డీల్ సెట్ కాగానే రాత్రి వేళల్లో టిప్పర్లతో మట్టిని తరలిస్తూ చెరువును క్రమంగా పూడ్చేస్తున్నారు. ఇది 93 ఎకరాలు. ఇది అమీన్‌పూర్ పెద్ద చెరువు విస్తీర్ణం. 2016లో ఈ పెద్ద చెరువును జీవవైవిధ్య సరస్సుగా గుర్తించారు. ప్రతి సంవత్సరం వివిధ దేశాల నుంచి వచ్చే వాటితో పాటు ఇక్కడి వాటితో కలిపి 171 రకాల పక్షులు ఇక్కడికి వస్తుంటాయి. 250 అరుదైన మొక్కలు, 9 రకాల చేపలు, 41 రకాల సీతాకోకచిలుకలు, ఇతర జంతువులకు ఆవాసం ఈ చెరువు. ఒకప్పుడు ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం ఈ చెరువు. కానీ ఇప్పుడు ఆక్రమణలతో తన ఉనికిని కోల్పోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

అభివృద్దే శాపం..

ప్రస్తుతం అమీన్‌పూర్‌ ఏరియా చాలా డెవలప్‌ అయ్యింది. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఏర్పాటై, ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో విలీనమైంది ఈ ప్రాంతం. ఈ ఏరియాలో 200కుపైగా కాలనీలు ఏర్పడ్డాయి. అమీన్‌పూర్‌ నడి బొడ్డున ఉన్న పెద్ద చెరువు చుట్టూ వేగంగా అభివృద్ధి జరిగింది. అదే ఇప్పుడు ఈ చెరువుకు శాపంగా మారింది. ఈ చెరువు విస్తీర్ణాన్ని తగ్గించి.. మరింత రియల్ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలనే కొందరి కుట్ర ఇప్పుడు మరిన్ని అక్రమాలకు తెరలేపుతున్నట్టు తెలుస్తోంది.

రాత్రికి రాత్రే..

Advertisement

స్థానికుల ఆరోపణల ప్రకారం 100 గజాల స్థలాన్ని మట్టితో నింపే వరకు కాపలా కాస్తూ పనులు పూర్తి చేసే గ్యాంగ్‌లు 50 వేల వరకు వసూలు చేస్తున్నాయి. టిప్పర్ కిరాయి, మట్టికి మరో 5 లక్షలు అదనం. రాత్రికి రాత్రే పదుల సంఖ్యలో లారీలు చెరువులోకి వెళ్లి మట్టిని డంప్ చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

Also read: Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అధికారులకు బెదిరింపులు..

Advertisement

అర్ధరాత్రి వేళల్లో చెరువులో మట్టి నింపుతున్న వీడియోలు వైరల్ కావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. కొందరు రియల్టర్లు చెరువులో మట్టి నింపి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. చెరువులో నిర్మాణాలు చేపడుతున్న వారు కోర్టు కేసుల పేరుతో అధికారులను సైతం బెదిరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం వెనుకంజ వేస్తోందనే విమర్శలు వస్తున్నాయి.

హైడ్రా సర్వే చేసినా..

నిజానికి అమీన్పూర్ పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో గతంలో హైడ్రా, రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. అంతేకాదు.. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణాలతో పాటు 25 విల్లాలను హైడ్రా కూల్చేసింది కూడా. నిజానికి అప్పట్లో ఇదొక సెన్సేషన్. కొంత మంది నష్టపోయినా.. చెరువు బతుకుతుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్నారు. హైడ్రా ఉందన్న భయం లేదు.. అధికారులు చర్యలు తీసుకుంటారనే ఆలోచన కూడా లేదు. వాళ్లు చేయాలనుకున్నది చేసేస్తున్నారు. కొందరు ప్రశ్నిస్తే.. పెద్ద చెరువు విస్తీర్ణాన్ని హైడ్రా తగ్గించేసింది.. అంటూ తప్పించుకుంటున్నారని తెలిసింది.

Also read: ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

బేరాలు నడిపేది ఎవరు?

ఇంతకీ ఈ ముఠాలతో బేరాలు నడిపేది ఎవరు? డబ్బులు ఇచ్చేది ఎవరు? తీసుకునేది ఎవరు? చెరువును చెరపట్టాలనే ఆలోచన ఎవరిది? తెర వెనకుండి కథ నడిపిస్తున్నది ఎవరు? అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? HYDRAA ఇటువైపు ఎందుకు చూడటం లేదు? మొత్తం ఆక్రమణ జరిగే వరకు వేచి చూసి అప్పుడు సీన్‌లోకి ఎంట్రీ ఇస్తారా? ఇప్పుడీ ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.

సరస్సును కాపాడుతారా..?

కబ్జాకు గురవుతున్న పెద్ద చెరువును రక్షించాలని స్థానికులు, ప్రకృతి ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. చెరువు సంరక్షణ కోసం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. జీవవైవిధ్యానికి నిలయమైన అమీన్‌పూర్ పెద్ద చెరువును కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. విదేశీ పక్షులకు ఆశ్రయంగా నిలిచిన జీవవైవిధ్య సరస్సును కాపాడుతారా.? లేక కబ్జాదారులకే వదిలేస్తారా…? అనేది చూడాలి.

Also Read: కిలాడీ జంట లగ్జరీ లైఫ్ బిల్డప్.. తెరవెనుక కోట్లలో చీటింగ్.. నందూస్ వరల్డ్ జంట అసలు రంగు బట్టబయలు..?

Related News

ఉత్తరాదిని ముంచెత్తుతున్న వానలు.. నదుల ఉగ్రరూపం, చార్‌ధామ్ యాత్ర వాయిదా!

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

Big Stories

Advertisement
×