E-Paper
Advertisement

డిగ్రీ, బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే లైఫ్ సెట్ బ్రో, ఎంపిక విధానం ఇదే..

డిగ్రీ, బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే లైఫ్ సెట్ బ్రో,  ఎంపిక విధానం ఇదే..
Advertisement

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రముఖ మినీరత్న సంస్థ ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ALIMCO) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాన్పూర్ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 162 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు మే 13వ తేదీ లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం 162 పోస్టులలో అత్యధికంగా మార్కెటింగ్ విభాగంలో 141 ఖాళీలు ఉన్నాయి. ఐటీ డిపార్ట్‌మెంట్‌లో 08 పోస్టులు కేటాయించారు. మెటీరియల్ మేనేజ్‌మెంట్‌లో 05 స్థానాలు అందుబాటులో ఉన్నాయి. క్వాలిటీ కంట్రోల్, ప్రాజెక్ట్ అండ్ మెయింటనెన్స్ విభాగాల్లో చెరో మూడు ఖాళీలు ఉన్నాయి. ప్రొడక్షన్ అండ్ డిజైన్ డెవలప్‌మెంట్ విభాగంలో రెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 162

పోస్టుల వివరాలివే:  ఈ నోటిఫికేషన్ ద్వారా ఐటీ కన్సల్టెంట్‌, లీడ్‌ ఏఐ ఎక్సపర్ట్‌, యూఐ/యూఎక్స్‌ డెవెలపర్‌ వంటి సాంకేతిక పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు యంగ్‌ ప్రొఫెషనల్‌, ఐటీ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, జూనియర్‌ మేనేజర్‌ ఉద్యోగాలు ఉన్నాయి. సివిల్‌ ఇంజినీర్‌ ఆఫీసర్‌, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌, స్టోర్‌ అసిస్టెంట్‌, ప్రొక్యూర్‌మెంట్‌ అసిస్టెంట్‌ వంటి విభిన్న హోదాల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Advertisement

విద్యార్హత: పోస్టును అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా బీటెక్/బీఈ (ప్లాస్టిక్, టెక్స్‌టైల్, సివిల్, ఐటి, సిఎస్) పూర్తి చేసి ఉండాలి. ఎంఈడీ, ఎంసీఏ లేదా డిప్లొమా చేసిన వారు కూడా దరఖాస్తుకు అర్హులు. కొన్ని పోస్టులకు బీపీఓ, బీఏఎస్‌ఎల్‌పీ వంటి స్పెషలైజ్డ్ డిగ్రీలు తప్పనిసరి. ఉద్యోగ బాధ్యతలను బట్టి 0 నుండి 10 ఏళ్ల వరకు పని అనుభవం ఉండాలి. క్లినికల్ పోస్టులకు దరఖాస్తు చేసే వారు ఆర్‌సీఐ రిజిస్ట్రేషన్ కలిగి ఉండటం ఆవశ్యకం.

వయస్సు: ఏప్రిల్ 1, 2026 నాటికి అభ్యర్థుల వయసు పోస్టును బట్టి 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,000 నుండి గరిష్ఠంగా రూ. 1,80,000 వరకు గౌరవ వేతనం చెల్లిస్తారు. అభ్యర్థుల ప్రతిభతో పాటు విద్యార్హతలు, ఇంటర్వ్యూలో ప్రదర్శించిన నైపుణ్యం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఆసక్తి గల అభ్యర్థులు అలిమ్కో అధికారిక వెబ్‌సైట్ ద్వారా మే 13వ తేదీ లోపు దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. ఎంపిక ప్రక్రియలో విద్యార్హతలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇది ఒప్పంద ప్రాతిపదికన జరిగే నియామకం కాబట్టి నిబంధనలకు లోబడి అభ్యర్థులు విధుల్లో చేరాల్సి ఉంటుంది.

అఫీషియల్ వెబ్ సైట్: https://alimco.in/

ALSO READ:  టెన్త్, ఇంటర్ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. మంచి శాలరీ, ఇంకెందుకు ఆలస్యం

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×