E-Paper
Advertisement

Best AC Brands 2026: కొత్త ఏసీ కావాలా? అత్యంత నమ్మకమైన బ్రాండ్స్ ఇవే.. గత కొన్నేళ్లుగా సూపర్ సక్సెస్!

Best AC Brands 2026: కొత్త ఏసీ కావాలా? అత్యంత నమ్మకమైన బ్రాండ్స్ ఇవే.. గత కొన్నేళ్లుగా సూపర్ సక్సెస్!
Advertisement

Best AC Brands 2026: వేసవి కాలంలో సహజంగానే ఏసీలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు మార్కెట్లో నమ్మకమైన ఏసీ కోసం ప్రజలు తెగ సెర్చ్ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం చాలా రకాల బ్రాండ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ కంపెనీలు అన్ని దాదాపుగా 2026 ఏసీ మోడల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అత్యాధునిక ఏఐ ఫీచర్లను వాటిలో అందిస్తున్నాయి. దీంతో ఏది కొనాలో అర్థం కానీ పరిస్థితి చాలా మందిలో ఉంటోంది. అయితే బ్రాండ్స్ పరంగా ఏసీని ఎంచుకోవాల్సి వస్తే ప్రస్తుతం ఏవి బాగున్నాయి? కస్టమర్ల ఫీడ్ బ్యాక్ ఎలా ఉంది? నిపుణులు ఏం చెబుతున్నారు? ఈ కథనంలో పరిశీలిద్దాం.

సాధారణంగా నూటికి నూరు శాతం పర్ఫెక్ట్ అని ఏ ఏసీ బ్రాండ్ ను చెప్పలేం. ఎందుకంటే ఒక్కో బ్రాండ్ ఏసీలు.. కొన్ని ప్రత్యేకమైన విభాగాల్లో స్ట్రాంగ్ గా ఉన్నాయి. కొన్ని కూలింగ్ కు పాపులర్ అయితే.. మరికొన్ని మన్నికకు పేరుపొందాయి. అయితే తాజా విశ్లేషణల.. డైకిన్ (Daikin), ఎల్‌జీ (LG) బ్రాండ్లు స్థిరమైన పనితీరుతో ముందంజలో ఉన్నాయి. ఈ బ్రాండ్ ఏసీల వినియోగం పట్ల మెజారిటీ కస్టమర్లు సంతృప్తిగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

మరోవైపు పానాసోనిక్ (Panasonic), బ్లూ స్టార్ (Blue Star) బ్రాండ్లు కూడా మార్కెట్లో గట్టి పోటీనిస్తూ తమ పట్టును నిలుపుకుంటున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అత్యాధునిక ఫీచర్లకు, పవర్ ఫుల్ కూలింగ్ టెక్నాలజీకి ఈ ఏసీలు కేరాఫ్ గా నిలుస్తున్నాయని పేర్కొంటున్నారు. అటు లాయిడ్, వోల్టాస్ సైతం.. నమ్మదగిన బ్రాండ్స్ గా దేశంలో ఎదుగుతున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. అయితే ఎక్కువ కాలం మన్నిక విషయంలో మాత్రం ఇవి కాస్త వెనుకబడిపోతున్నట్లు అభిప్రాయాలు ఉన్నాయి. మరోవైపు హైయర్ బ్రాండ్ ఫాస్ట్ కూలింగ్, ఫ్లెక్సిబుల్ మోడ్స్ తో.. యంగ్ జనరేషన్ కస్టమర్లను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: No Cost EMIలో వస్తువులు కొంటున్నారా? దీని వెనుకున్న మోసం తెలిస్తే.. ఇంకెప్పుడు ఆ ధైర్యం చేయరు!

Advertisement

మెుత్తంగా చూస్తే స్థిరమైన పనితీరు విషయంలో డైకిన్, ఎల్ జీ బ్రాండ్లు పెద్ద ఎత్తున కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. భిన్నమైన పరిస్థితుల్లోనూ నిలకడైన పనితీరును ఇవి కనబరుస్తున్నాయి. మరోవైపు పానాసోనిక్, బ్లూ స్టార్ వంటి కంపెనీలు కూడా నాణ్యత విషయంలో రాజీ పడకుండా వినియోగదారులను ఆకట్టుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే విశ్లేషణలు, నివేదికల మాట ఎలా ఉన్నా.. నిపుణులు మాత్రం ఏసీ విషయంలో తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేస్తున్నారు.  ఏసీ పనితీరు, మన్నిక అనేది ప్రధానంగా దాన్ని వాడే విధానం, ఇన్‌స్టాలేషన్ నాణ్యత, ఆ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు. కాబట్టి ఏసీ కొనేముందు కేవలం బ్రాండ్‌నే కాకుండా.. మీ ప్రాంతంలోని సర్వీసింగ్ సౌకర్యాలను, నిపుణుల ద్వారా సరిగ్గా ఇన్‌స్టాల్ చేయించుకోవడంపై దృష్టి సారిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు.

Also Read: జియో vs ఎయిర్‌టెల్.. రూ.355 ప్లాన్ల మధ్య గట్టి పోటీ.. రెండింట్లో ఏది బెస్ట్ అంటే?

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×