E-Paper
Advertisement

గాయపడ్డ సింహం రివ్యూ…గాయపడ్డ సింహం గర్జించిందా లేదా?

గాయపడ్డ సింహం రివ్యూ…గాయపడ్డ సింహం గర్జించిందా లేదా?
Advertisement

Gaaya Padda Simham Review: తెలుగు సినిమాలో ఈ మధ్య కాలంలో ప్రయోగాలు ఎక్కువవుతున్నాయి. రొటీన్ కథలకు భిన్నంగా ఏదో ఒక క్రేజీ పాయింట్‌తో ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. అదే కోవలో తరుణ్ భాస్కర్ హీరోగా వచ్చిన సినిమా ‘గాయపడ్డ సింహం’. అమెరికా వెళ్లాలనుకునే ఒక కుర్రాడి ఆశలు అప్పటి ప్రెసిడెంట్ ట్రంప్ వల్ల అడియాసలైతే, అతను ఏకంగా ఆ ప్రెసిడెంట్ మీద ‘బ్లాక్ మ్యాజిక్’ ద్వారా పగ తీర్చుకోవాలనుకోవడం ఈ సినిమాలోని అసలు ట్విస్ట్.

కథ .
కథ విషయానికి వస్తే.. మన హీరో (తరుణ్ భాస్కర్) డల్లాస్ వెళ్లి సెటిల్ అవ్వాలని, డాలర్లు సంపాదించాలని కలలు కంటాడు. కానీ అప్పటి అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల డల్లాస్ ఎయిర్ పోర్ట్ నుండి డిపోర్ట్ అయి మళ్ళీ గల్లీలోకి వచ్చేస్తాడు. తన కల చెదిరినందుకు, తన కెరీర్ నాశనం చేసినందుకు ట్రంప్ మీద విపరీతమైన పగ పెంచుకుంటాడు. ఆ పగ తీర్చుకోవడానికి వైట్ హౌస్ వెళ్ళడమో, కోర్టులో పోరాడటమో చేయకుండా.. ఏకంగా ట్రంప్ మీద ‘బ్లాక్ మ్యాజిక్’ (చేతబడి) చేయాలని డిసైడ్ అవుతాడు. ఇందుకోసం జె.డి. చక్రవర్తి, శ్రీవిష్ణు లాంటి వాళ్ళను తోడు తీసుకుని ఆయన చేసిన వింత ప్రయాణం ఏ తీరానికి చేరింది? అసలు ట్రంప్ మీద ఆ మంత్రాలు పనిచేశాయా? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

విశ్లేషణ.. 
డైరెక్టర్ కాశ్యప్ శ్రీనివాస్ ఒక వైవిధ్యమైన కథను ఎంచుకున్నారు. తరుణ్ భాస్కర్ నటన సినిమాకు ప్రధాన బలం. అయితే, ఒక క్రేజీ ఐడియాని వెండితెరపైకి తెచ్చేటప్పుడు ఉండాల్సిన పకడ్బందీ స్క్రీన్ ప్లే లోపించింది. లవ్ ట్రాక్ మరియు కొన్ని కామెడీ బిట్లు బాగున్నా, మెయిన్ థీమ్ లోకి వెళ్ళాక లాజిక్ లేని సీన్లు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి.కాని హీరోయిన్లు ఫరియా అబ్దుల్లా, మానస చౌదరిలకు నటించడానికి అస్సలు స్కోప్ లేదు. గ్లామర్ కోసమే అన్నట్టుగా వారు బొమ్మల్లా మిగిలిపోయారు.అయినప్పటికీ, రొటీన్ సినిమాల మధ్య ఒక వెరైటీ సినిమా చూడాలనుకునే వారికి ఇది ఒక ఆప్షన్.కథలో మంచి పాయింట్ ఉన్నా, దాన్ని రెండు గంటల పాటు ఆసక్తికరంగా నడిపించడంలో స్క్రీన్ ప్లే తడబడింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని బ్లాక్ మ్యాజిక్ సీన్లు సాగదీసినట్లు అనిపిస్తాయి.ఫస్ట్ హాఫ్‌లో ఉన్న వేగం, క్లారిటీ సెకండ్ హాఫ్‌లో మిస్ అయింది. క్లైమాక్స్ ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేదనిపిస్తుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించినా.. ఎడిటింగ్ మీద ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. కొన్ని సీన్లు అసలు కథకు సంబంధం లేకుండా వచ్చి వెళ్తుంటాయి.

ప్లస్ పాయింట్స్:

  • క్రేజీ పాయింట్
  • నటీనటులు
  • కామెడీ
Advertisement

మైనస్ పాయింట్స్:

  • సాగదీత
  • ఎగ్జిక్యూషన్
  • టెక్నికల్ అంశాలు

చివరిగా 
‘గాయపడ్డ సింహం’ ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పాలి. లాజిక్కులు వెతకకుండా, కేవలం వినోదం కోసం చూస్తే ఈ వీకెండ్‌కు ఒకసారి టైమ్ పాస్ చేయొచ్చు. తరుణ్ భాస్కర్ తన మార్కు ఈజ్‌తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు.

Gayapadda simham Movie Review Rating : 2.75/5

also read: చూడటానికి సాఫ్ట్.. కానీ మాటల్లో ఫైర్! కరిష్మా కపూర్ నెగెటివ్ వీడియో వైరల్!

Related News

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

The Odyssey Review: ‘ది ఒడిస్సీ’ రివ్యూ. థియేటర్లు బద్దలు.. ప్రపంచాన్నే ఊపేస్తోన్న నోలన్ మూవీ!

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !

I-Nobody Review :’ఐ నోబడీ’ మూవీ రివ్యూ..

రావు బహదూర్ రివ్యూ.. గెటప్ మార్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా?

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?

Nagabandham Review: ‘నాగబంధం’ రివ్యూ.. గ్రాఫిక్స్ గిన్నెలో ఉడకని పప్పు !

Big Stories

Advertisement
×