E-Paper
Advertisement

మైత్రీ వర్సెస్ దిల్ రాజు కోల్డ్ వార్.. బలైపోతున్నది ‘పెద్ది’ సినిమానేనా?

మైత్రీ వర్సెస్ దిల్ రాజు కోల్డ్ వార్.. బలైపోతున్నది ‘పెద్ది’ సినిమానేనా?
Advertisement

Peddi Controversy : సరిగ్గా చెప్పాలంటే సంక్రాంతి సీజన్ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీ మరో సాలిడ్ హిట్ ని చూడలేకపోయింది.దీంతో అందరి కళ్ళు పెద్ది సినిమాపైనే. చరణ్ హీరోగా వస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా జూన్ 4న రిలీజ్ కానున్న సంగతి తెల్సిందే. ఇక ఇప్పటికైనా పైసా వసూల్ సినిమా వస్తుందని సంతోషించే లోపే ‘పర్సంటేజీ’ పంచాయితీ పెద్ది మెడకి చుట్టుకునేలా కనిపిస్తుంది.అన్నిటి కన్నా ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య ఈ పంచాయితీ ఇప్పుడు మెగా వర్సెస్ దిల్ రాజు వార్‌ అన్నట్టుగా మారిపోయింది.ఒకరకంగా చెప్పాలంటే అందరి వేళ్లు ఇప్పుడు దిల్ రాజు వైపే చూపిస్తున్నాయి మరి.దీంతోమా హీరో వెనుక పెద్ద కుట్రే జరుగుతోందంటూ తెగ ఫైర్ అయిపోతున్నారు మెగా ఫ్యాన్స్..

దిల్ రాజు చేతిలో సినిమాలు లేవు కాబట్టి

Advertisement

ఇన్నాళ్లూ లేనిది, సరిగ్గా ‘పెద్ది’ రిలీజ్ టైమ్‌లోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లపై ఎగ్జిబిటర్లకు ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని  సూటిగా ప్రశ్నిస్తున్నారు నిర్మాతలు. గతంలో ‘గేమ్ ఛేంజర్’ సమయంలో దిల్ రాజుకు రామ్ చరణ్ కొండంత అండగా నిలిచారు. శంకర్ లాంటి దర్శకుడితో సినిమా అంటే ఆ రిస్క్ మామూలు విషయం కాదు. అయినా దిల్ రాజు కోసం చరణ్ తన డేట్లు ఇచ్చి, సినిమా ఫలితం అటు ఇటు అయినా తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ కూడా త్యాగం చేశారని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు దిల్ రాజు చేతిలో పెద్ద సినిమాలు లేవు కాబట్టి, ఎగ్జిబిటర్ల ముసుగులో ‘పెద్ది’ సినిమాని టార్గెట్ చేస్తున్నారనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.

మైత్రీ  వర్సెస్ దిల్ రాజు మధ్య  కోల్డ్ వార్

Advertisement

నిజానికి సమస్య అంత తీవ్రంగా ఉంటె గత కొంతకాలంగా దీన్ని సాల్వ్ చేసుకోకుండా ఉన్నారన్నది అసలు ప్రశ్న.ఆవిధంగా చూస్తె ఈ మధ్య గత సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ రిలీజ్ అయినప్పుడు ఈ థియేటర్ల గొడవలేమీ లేవు. పర్సంటేజీ పంచాయితీలు అసలే లేవు. ఎందుకంటే అప్పుడు ఆ సినిమాకు దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్. కానీ ఇప్పుడు ‘పెద్ది’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దిల్ రాజు చేతిలో ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం, ఆయనకు ఈ ప్రాజెక్టులో వాటా లేకపోవడంతోనే కావాలని ఎగ్జిబిటర్లను ఉసిగొల్పి ‘పెద్ది’ రిలీజ్‌ను అడ్డుకోవాలని చూస్తున్నారనేది మెగా అభిమానుల వాదన.

also read :చిరంజీవి హీరోయిన్ మిస్టరీ డెత్.. స్టార్ హీరోలతో సినిమాలు.. 26 ఏళ్ల పెద్దవాడితో ప్రేమ.. చివరకు ఇలా

సింగిల్ స్క్రీన్ థియేటర్లపై ఇన్నాళ్లూ లేని ప్రేమ ఇప్పుడే ఎందుకు పుట్టుకొచ్చిందని, సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు ఇలాంటి గందరగోళం సృష్టించడం వెనుక అర్థమేంటని ప్రశ్నిస్తున్నారు సదరు బడా నిర్మాతలు.ఇక నిర్మాత నట్టి కుమార్ ఒక అడుగు ముందుకేసి మైత్రీ మూవీ మేకర్స్ వర్సెస్ దిల్ రాజు మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ కారణంగానే మెగా హీరోల సినిమాలను టార్గెట్ చేస్తున్నారంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశారు.పైగా apలో గవర్నమెంట్ ఇచ్చిన జీవో ఆర్డర్స్ ని కూడా అమలు చేయనివ్వకుండా కొన్న బలమైన శక్తులు ఉన్నాయని ఆరోపించారు.

జూన్ 4న సినిమా రావడం పక్కా

గతంలో ఒక ఇంటర్వ్యూలో శిరీష్ మాట్లాడుతూ చరణ్ పై ఇన్ డైరెక్ట్ గా చేసిన నెగెటివ్ కామెంట్స్ ని ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ మర్చిపోలేదు. ఇప్పుడు ‘పెద్ది’ లాంటి భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ సమయంలో కావాలనే థియేటర్ల సమస్యను తెరపైకి తెచ్చి డ్రామా ఆడుతున్నారని భావిస్తున్నారు.ఏది ఏమైనా జూన్ 4న సినిమా రావడం పక్కా అని ఇలాంటి ఎన్ని అడ్డంకులు సృష్టించినా చరణ్ స్టామినా ముందు అవి నిలవవని ఫ్యాన్స్ నెట్టింట్లో వార్నింగ్స్ ఇస్తున్నారు మెగా ఫ్యాన్స్.అయితే ఇన్ని అలిగేషన్స్ వస్తున్న దిల్ రాజు మాత్రం రియాక్ట్ కాకపోవడం గమనార్హం. చూడాలి మరి అందరు అనుకుంటున్నట్టుగా మైత్రి vs దిల్ రాజు కోల్డ్ వార్ పెద్ది సినిమాపై ఏమాత్రం ఎఫెక్ట్ చూసిస్తుందో !

also read :ఒక్క డ్రెస్ ధర 1,491 కోట్లా?.. రేటుతోనే చెమటలు పట్టిస్తున్న బాలీవుడ్ బ్యూటీ..!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×