E-Paper
Advertisement

ఒక్క డ్రెస్ ధర 1,491 కోట్లా?.. రేటుతోనే చెమటలు పట్టిస్తున్న బాలీవుడ్ బ్యూటీ..!

ఒక్క డ్రెస్ ధర 1,491 కోట్లా?.. రేటుతోనే చెమటలు పట్టిస్తున్న బాలీవుడ్ బ్యూటీ..!
Advertisement

Urvashi Cannes : మే 12న గ్రాండ్ గా మొదలైన ప్రారంభమైన కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు (Cannes 2026) వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్‌గా మారాయి. గ్లోబల్ స్టార్ అలియా భట్ తన సింప్లిసిటీతో రెడ్ కార్పెట్‌పై మ్యాజిక్ చేయగా, తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా వేసుకున్న డ్రెస్ తోనే నెట్టింట మంటలు పుట్టిస్తుంది. కారణం డిజైన్ తో కాదండోయ్ ..దానికున్న రేటుతో.అవును … ఆ కాస్ట్ కాని మీరు విన్నారంటే నోళ్ళు వెళ్ళబెట్టాల్సిందే.

అక్షరాలా ఎనిమిది నెలలు

Advertisement

యస్ .విషయంలోకి వెళ్తే ..వియత్నాంకు చెందిన వరల్డ్ ఫేమస్ ఫ్యాషన్ బ్రాండ్ ‘జోలిపొలి కోచర్’ఊర్వశి కోసం ఒక స్పెషల్ గౌన్ ని డిజైన్ చేసింది. బ్లూ కలర్ లో దగ దగ మెరిసిపోతున్న ఈ డ్రెస్సులో ఊర్వశి నిజంగానే అప్సరస లాగే ఉంది. అయితే ముఖ్యంగా ఆమె తలపై ధరించిన డేగ ఆకృతిలో ఉన్న హెడ్‌పీస్, చేతిలోని బుల్లి బ్యాగ్ అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాయ్.ఇక ఈ మొత్తం లుక్‌ను డిజైన్ చేసి డ్రెస్ గా మార్చడానికి పట్టిన టైమ్ ఎంతో తెలుసా.. అక్షరాలా ఎనిమిది నెలలు. సో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.

also read :వైరల్ వీడియో: వధువుకు షాకిచ్చిన వరుడు.. పెళ్లి వేదికపై అసలు ఊహించని ట్విస్ట్!

Advertisement

 అటు ఇటుగా 1,491 కోట్ల రూపాయలకు పైమాటే

ఇక అసలు విషయానికొస్తే.. ఈ లుక్ కాస్ట్ ఇపుడు ఫ్యాషన్ ఇండస్ట్రీలో డిబేట్ కి దారి తీస్తుంది. ఎందుకంటారా..ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఊర్వశి ధరించిన ఈ అవుట్‌ఫిట్ కాస్ట్ దాదాపుగా 155.87 మిలియన్ డాలర్లని టాక్ అంటే మన భారతీయ కరెన్సీలో కాస్త అటు ఇటుగా 1,491 కోట్ల రూపాయలకు పైమాటే అన్న మాట.దీంతో కేన్స్ చరిత్రలోనే ఇంతటి భారీ విలువైన దుస్తులు ధరించిన నటిగా ఊర్వశి రికార్డు సృష్టించిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ గా ఎవరూ రెస్పాండ్ కాకపోయినా , ఆమె లుక్ మాత్రం మిలియన్ డాలర్ల రేంజ్‌లో ఉంటుందని ఇన్ సైడ్ టాక్.

సినిమా సంగతులకొస్తే

ఇక అమ్మడి సినిమా సంగతులకొస్తే ..’సింగ్ సాబ్ ది గ్రేట్’ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఊర్వశి, ఆ తర్వాత ‘సనమ్ రే’, ‘హేట్ స్టోరీ 4’ వంటి చిత్రాలతో మంచి పేరే తెచ్చుకుంది.ఇక ఆమధ్య తెలుగులో ‘వాల్తేరు వీరయ్య’, ‘బ్రో’ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో అదరగొట్టిన ఈ బీ టౌన్ బ్యూటీ డాకు మహారాజ్ లో బాలయ్య పక్కన డబిది దిబిడి అంటూ ఎలా దంచికొట్టిందో తెల్సిందే.
మొత్తానికి ఈ అందాల భామ అటు సినీఇండస్ట్రీని.ఇటు ప్యాషన్ ఇండస్ట్రీని తనదైన స్టైల్ లో షేక్ చేస్తుందన్న మాట.

also read :అండర్ వాటర్ యాక్షన్ కోసం ఏకంగా వారణాసికే.. మహేశ్‌ – రాజమౌళి రిస్క్ మామూలుగా లేదుగా!

Related News

శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ఆకట్టుకుంటున్న ‘దేవరాయ’ టైటిల్ గ్లింప్స్ అండ్ ఫస్ట్ లుక్!

78వ ఎమ్మీ అవార్డ్స్ తుది జాబితా.. అత్యధిక నామినేషన్స్ అందుకున్న షోలు!

హాస్పిటల్ పాలైన మమితా బైజు.. వీడియో వైరల్!

హరికృష్ణ 70వ జయంతి..ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్!

ఐదుసార్లు చావును దగ్గరగా చూశాను.. అదే నాకు ఇంపార్టెంట్.. హీరో కామెంట్స్..

“ప్రజలు మెచ్చిన నాయకుడు”.. పవన్ కళ్యాణ్ కు చిరంజీవి స్పెషల్ బర్త్‌డే విషెస్!

Poojitha Ponnada : గార్జీయస్ లుక్ లో మెరిసిపోతున్న పూజిత.. కుర్రాళ్ళు ఏమైపోతారమ్మా..!

HBD Pawan Kalyan : బర్త్ డే స్పెషల్.. ఆ ఒక్కటే పవర్ స్టార్ ను చేసిందా..?

Big Stories

Advertisement
×