E-Paper
Advertisement

కేంద్రం తీరుపై రాఘవులు నిప్పులు.. శ్రీలంక గతే భారత్‌కు పడుతుందా?

కేంద్రం తీరుపై రాఘవులు నిప్పులు.. శ్రీలంక గతే భారత్‌కు పడుతుందా?
Advertisement

BV Raghavulu: విశాఖపట్నం వేదికగా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ ఇటీవల ప్రజలకు ఇస్తున్న ‘పొదుపు’ సూచనలు వినడానికి బాగానే ఉన్నా, క్షేత్రస్థాయిలో అవి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బంగారం కొనవద్దు, విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవద్దు, సేంద్రియ వ్యవసాయం చేయాలంటూ మోదీ చెబుతున్న మాటలు ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం వల్ల శ్రీలంక ఎలాంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందో చూశామని, ఇప్పుడు భారత్‌లో కూడా అదే ప్రయోగాలు చేయడం రైతులను మోసం చేయడమేనని మండిపడ్డారు.

దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలను పక్కదారి పట్టించడానికే మోదీ ఇలాంటి వింత సూచనలు చేస్తున్నారని రాఘవులు ఆరోపించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్‌ను ప్రోత్సహించడం వెనుక రాబోయే రోజుల్లో పెట్రోల్ ధరలను భారీగా పెంచే కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలకు నీతులు చెప్పడం మానేసి, ప్రపంచ శాంతి కోసం అమెరికా యుద్ధం ఆపాలని మోదీ డిమాండ్ చేయాలని సూచించారు.

Advertisement

మరోవైపు నీట్ (NEET) పరీక్షలో జరుగుతున్న అవకతవకల వల్ల సుమారు 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నీట్ పరీక్షను రద్దు చేసి, నష్టపోయిన విద్యార్థులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుని, దాని ఆధునీకరణకు కొత్త చైర్మన్ చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే తెలంగాణలో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణను అడ్డుకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాఘవులు డిమాండ్ చేశారు.

Also Read: ఖాకీ చొక్కా వేసిన ఏజెంట్లకు బుద్ధి చెప్తాం.. పోలీసులకు జక్కంపూడి మాస్ వార్నింగ్

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×