E-Paper
Advertisement

Dhamaka 2: ధమాకా సీక్వెల్ కు ఆల్ సెట్.. డబుల్ ధమాకా ఎంటర్టైన్మెంట్ పక్కా!

Dhamaka 2: ధమాకా సీక్వెల్ కు ఆల్ సెట్.. డబుల్ ధమాకా ఎంటర్టైన్మెంట్ పక్కా!
Advertisement

Dhamaka 2: మాస్ మహారాజా రవితేజ(Raviteja) ఇటీవల వరుస సినిమాల ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల మాస్ జాతర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఇక త్వరలోనే భర్త మహాశయులకు విజ్ఞప్తి(BMW Film) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తున్నారు. ఇదిలా ఉండగా రవితేజ ఈ సినిమాతో పాటు తదుపరి వరుస సినిమాలను కూడా లైన్లో పెట్టారు.

ధమాకా సీక్వెల్ గా డబుల్ ధమాకా..

ప్రస్తుతం ఈయన శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇలా సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలలోనూ షూటింగ్ పనులలోను ఎంతో బిజీగా గడుపుతున్న రవితేజ మరో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫిలిం ఛాంబర్ లో ” డబుల్ ధమాకా”(Double Dhamaka) టైటిల్ రిజిస్టర్ చేయించింది. ఇలా ఈ టైటిల్ రిజిస్టర్ కావడంతో మరోసారి త్రినాధ్ రావు నక్కిన(Trinadha Rao Nakkina) దర్శకత్వంలో రవితేజ శ్రీ లీల హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమాకు డబుల్ ధమాకా అనే టైటిల్ రిజిస్టర్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ధమాకా సినిమా సీక్వెల్ అయి ఉంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు.

మరోసారి జంటగా రవితేజ శ్రీ లీల…

Advertisement

ఇక త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలబడునుంది. ఇక శ్రీ లీల(Sreeleela) రవితేజ హీరో హీరోయిన్లుగా నటించిన ధమాకా సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత రవితేజ ఎన్నో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చినప్పటికీ ఏ సినిమా కూడా సరైన విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇటీవల వీరిద్దరి కాంబినేషన్లోనే మాస్ జాతర సినిమా విడుదలైనా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది.

భర్త మహాశయులకు విజ్ఞప్తి..

Advertisement

ఈ క్రమంలోనే మరోసారి ఈ జంట డబుల్ ధమాకా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే విషయం తెలియడంతో ఈసారి డబల్ ఎంటర్టైన్మెంట్ పక్కాగా ఉంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. రవితేజ విషయానికి వస్తే ఈయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ఈ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఇక డిసెంబర్ ఒకటవ తేదీ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతుందంటూ ఇటీవల మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజకి జోడిగా కేతిక శర్మ, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. మరి ఈ సినిమా ద్వారా రవితేజ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

Also Read: Prabhas: స్పిరిట్ కోసం ప్రభాస్ కు కండిషన్లు.. పకడ్బందీగా ప్లాన్ చేస్తున్న సందీప్ రెడ్డి!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×