E-Paper
Advertisement

Prabhas: స్పిరిట్ కోసం ప్రభాస్ కు కండిషన్లు.. పకడ్బందీగా ప్లాన్ చేస్తున్న సందీప్ రెడ్డి!

Prabhas: స్పిరిట్ కోసం ప్రభాస్ కు కండిషన్లు.. పకడ్బందీగా ప్లాన్ చేస్తున్న సందీప్ రెడ్డి!
Advertisement

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ త్వరలోనే ది రాజా సాబ్(The Raja saab) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇలా ఈ సినిమా ప్రమోషన్లతో పాటు మరోవైపు ఈయన కమిట్ అయిన సినిమాల షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ సందీప్ రెడ్డి (Sandeep Reddy)డైరెక్షన్లో రాబోతున్న స్పిరిట్ సినిమా(Spirit Movie) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు డిసెంబర్ ఆఖరి వరకు ఈ సినిమా షూటింగ్ పనులలో ప్రభాస్ పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుతున్న నేపథ్యంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి కండిషన్స్ తో కూడిన రిక్వెస్ట్ చేశారని తెలుస్తోంది.

ప్రభాస్ లుక్ లీక్ కాకుండా..

స్పిరిట్ సినిమాకి సంబంధించి ఏ విధమైనటువంటి లుక్స్ అలాగే షూటింగ్ లీక్స్ బయటకు రాకుండా సందీప్ రెడ్డి అలాగే స్పిరిట్ టీం కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారట. అందుకే ప్రభాస్ ఈ సినిమా పూజా కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నారో తెలుసుకోవాలనే ఆత్రుత అందరిలోనూ ఉంది . అయితే ప్రభాస్ లుక్ విడుదల చేసే వరకు బయటకు రాకుండా ఉండడం కోసం సందీప్ రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

బయట ఎక్కడ కనిపించకూడదు..

Advertisement

సాధారణంగా బయట ఎయిర్ పోర్ట్ వంటి తదితర ప్రాంతాలలో సెలబ్రిటీలు కనిపించినప్పుడు వారి లుక్స్ కి సంబంధించిన ఫోటోలు లీక్ అవుతూ ఉంటాయి. అందుకే స్పిరిట్ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ పెద్దగా బయట కనిపించకూడదనే కండిషన్ సందీప్ రెడ్డి పెట్టినట్టు తెలుస్తోంది. సినిమాకు సంబంధించి ఎలాంటి విషయాలు లీక్ కాకుండా ఉండాలి అంటే ఇదొక్కటే మార్గమని అందుకే ప్రభాస్ కు స్పిరిట్ టీం స్పెషల్ రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మామూలుగానే ప్రభాస్ పెద్దగా బయట ఎక్కడ కనిపించరు ఇక సందీప్ రెడ్డి ఇలాంటి కండిషన్స్ పెట్టిన తర్వాత ఇక ప్రభాస్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

రాజమౌళిని అనుసరిస్తున్నారా?

Advertisement

సందీప్ రెడ్డి తన సినిమా విషయంలో అచ్చం రాజమౌళిని అనుసరిస్తున్నారని రాజమౌళి కూడా సినిమాకు సంబంధించి ఎలాంటి లీక్స్ రాకుండా ఉండడం కోసం చిత్ర బృందానికి, హీరోకి ఎన్నో కండిషన్లు పెడుతూ ఉంటారు. అదే తరహాలో సందీప్ రెడ్డి కూడా స్పిరిట్ సినిమాకు చాలా కండిషన్లు పెట్టారని తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కు జోడిగా ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా నటించబోతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గాను అలాగే ఖైదీగా కూడా కనిపించబోతున్నారని ఇటీవల విడుదల చేసిన ఒక ఆడియో టీజర్ ద్వారా స్పష్టమైనది ఈ సినిమాల్లో వివేక్ ఒబెరాయ్ ,ప్రకాష్ రాజు అండ్ తదితరులు కూడా నటిస్తున్నారు.

Also Read: Singer Hema Chandra: శ్రావణ భార్గవితో విడాకుల రూమర్లు..ఫైనల్లీ ఓపెన్ అయిన హేమ చంద్ర!

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×