E-Paper
Advertisement

Fact Check : ఐబొమ్మ రవికి పోలీస్ జాబ్ ఆఫర్… అసలు నిజం చెప్పిన సైబర్ క్రైం డీసీపీ…

Fact Check : ఐబొమ్మ రవికి పోలీస్ జాబ్ ఆఫర్… అసలు నిజం చెప్పిన సైబర్ క్రైం డీసీపీ…

Fact Check : స్టార్ హీరోల సినిమాలను ఫైరసీ చేసిన ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. గత రెండు వారాలుగా పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. అతన్ని సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో అతనికి పోలీస్ జాబ్ ఆఫర్ ఇచ్చినట్లు ఓ వార్త బయటకు వచ్చింది.. అంతేకాదు అతను దానికి నో చెప్పినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది. తాజాగా ఈ వార్తల పై తెలంగాణ సైబర్ క్రైం డీసీపీ అరవింద్ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ కేవలం పూకార్లే అని కొట్టిపడేసారు. అంతేకాదు ఐబొమ్మ రవి గురించి కొన్ని కీలక విషయాలను బయటపెట్టారు.. అసలు ఐబొమ్మ రవి విచారణలో ఏం చెప్పాడో తెలుసుకుందాం..

ఐబొమ్మ రవి ఎటువంటి ఆఫర్ ఇవ్వలేదు: డీసీపీ

సినిమాలను ఫైరసి చేస్తున్న కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవిని ఎనిమిది రోజులుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో అతని టెక్నాలజీ నైపుణ్యంను పోలీస్ శాఖ కోసం వినియోగించాలనే ఉద్దేశ్యంతో అతనికి పోలీస్ జాబ్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తల పై సైబర్ క్రైం డీసీపీ అరవింద్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. రవికి తాను చేసిన పనికి ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని తెలిపారు. అంతేకాదు ఐబొమ్మ రవికి ఉద్యోగం ఆఫర్ చేశామని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తలను పూర్తిగా అసత్యమని అన్నారు డీసీపీ.. పోలీసులు ఎలాంటి జాబ్ ఆఫర్ చేయలేదని, ఈ వార్తలు పుకార్లేనని స్పష్టం చేశారు.. ప్రస్తుతం రవి ఎన్నో కీలక ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదని, వాటిని అతని నోటి నుంచే చెప్పించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు.. త్వరలోనే నిజం బయటకు వస్తాయని ఆయన అంటున్నారు..

Also Read :Ram Charan : మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్… సీఎం రేవంత్ టీంలో గ్లోబల్ స్టార్..

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్.. 

అంతేకాదు విచారణలో అతను మూడు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్లు నిర్ధారించామని వెల్లడించారు. . ఈ యాప్స్ ప్రమోషన్ ద్వారా రవికి జరిగిన ఆర్థిక లావాదేవీల వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదని తెలిపారు.. అసలు రవికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు అతనికి డబ్బులు పంపించారు.?  అతను ఎలాంటి ఒప్పందాలతో ప్రోత్సహించబడాడు? డబ్బు చలామణీ ఎలా జరిగింది? అనే అంశాలను లోతుగా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ విచారణలో అతను కొన్ని విషయాలకు మాత్రమే స్పందించాడని, పలు కీలక ప్రశ్నలకు మాత్రం తప్పించుకున్నాడని పేర్కొన్నారు.. సినిమాల పైరసీ మాత్రమే కాదు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసినట్లు రుజువైంది. వీటితో పాటుగా ఇంకేమైన అతని చేశాడా? అని పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. రవిని అరెస్ట్ చెయ్యడంతో పాటుగా అతని బ్యాంక్ అకౌంట్ లను సీజ్ చేశారు.. ఈ కేసు విచారణ కొనసాగుతుంది. త్వరలోనే అతని పూర్తి జాతకాన్ని బయటపెడతామని పోలీసులు చెబుతున్నారు.. ఏది ఏమైన ఐబొమ్మ రవి అరెస్ట్ తో సినిమాల పైరసీ ఆగిపోయింది.

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×