E-Paper
Advertisement

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !
Advertisement

SOUTHTECH Thunder Bluetooth Party Tower Speaker: ఇంట్లో చిన్న వేడుక జరిగినా, లేదా ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా చిల్ అవ్వాలన్నా అచ్చం థియేటర్ లాంటి పవర్‌ ఫుల్ సౌండ్ ఇచ్చే స్పీకర్ కచ్చితంగా ఉండాలి! మార్కెట్లో రకరకాల స్పీకర్లు ఉన్నప్పటికీ.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందించే గాడ్జెట్‌లకు ఎప్పుడూ క్రేజ్ ఎక్కువే. అలాంటి మ్యూజిక్ లవర్స్ కోసం.. మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న బ్రాండ్ ‘సౌత్‌టెక్’. కేవలం రూ.998 ధరకే లభిస్తూ.. ఆర్జీబీ లైటింగ్స్‌తో ట్రెండ్ సృష్టిస్తున్న ‘SOUTHTECH Thunder’ పార్టీ టవర్ స్పీకర్ ప్రత్యేకతలు ఇప్పుడు వివరంగా చూద్దాం!

పూర్తి వివరాలు:

1. డిజైన్, ఆర్జీబీ లైటింగ్ మోడ్స్:

ఈ స్పీకర్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, మోడర్న్ టవర్ డిజైన్‌తో వస్తుంది. దీని స్పెషల్ అట్రాక్షపన్ ఇందులో ఉండే ఆర్జీబీ ఎల్‌ఈడీ లైటింగ్ మోడ్స్. మనం వినే పాటల బీట్‌కు తగినట్లుగా లైట్లు మారుతూ ఇంటర్‌లో అచ్చం మినీ పార్టీ హాల్ లేదా క్లబ్ లాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయి. అవుట్‌డోర్, ఇండోర్ పార్టీలకు ఇది పర్ఫెక్ట్‌గా ఉంటుంది.

2. 40W సౌండ్ & డ్యూయల్ డ్రైవర్స్:

Advertisement

ఈ ప్రైస్ రేంజ్‌లో ఇది నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఇందులో .. పవర్ ఫుల్ డ్యూయల్ డ్రైవర్లతో కూడిన 40-వాట్ల అవుట్‌ పుట్ లభిస్తుంది. బాస్ చాలా స్పష్టంగా.. దద్దరిల్లిపోయేలా వినిపిస్తుంది. 2.0 ఛానల్ కాన్ఫిగరేషన్ ద్వారా 360-డిగ్రీల సరౌండ్ సౌండ్ ఫీల్ పొందవచ్చు. సినిమా పాటలు వినేటప్పుడు లేదా హ్యాంగ్‌ అవుట్స్‌లో మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు అద్భుతమైన ఆడియో ఫీల్ కలుగుతుంది.

3. మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్స్:

ఈ స్పీకర్‌లో లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీ ఉండటం వల్ల ఫోన్, టాబ్లెట్ లేదా ల్యాప్ టాప్‌కు క్షణాల్లో కనెక్ట్ అవుతుంది. కేవలం బ్లూటూత్ మాత్రమే కాకుండా ట్రూ వైర్‌లెస్ స్టీరియో సపోర్ట్, USB పోర్ట్, మైక్రో SD కార్డ్, AUX కేబుల్ ద్వారా కూడా మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. అంతేకాకుండా.. దీన్ని ఛార్జ్ చేయడానికి మోడర్న్ టైప్-సి పోర్ట్‌ను అందించారు.

Advertisement

Also Read: అమెజాన్‌లో హాట్ కేకులా.. అమ్ముడవుతున్న ఫ్రెంచ్ డోర్ ఫ్రిడ్జ్‌లు!

4. బ్యాటరీ, లాంగ్ ప్లేటైమ్:

ఎలాంటి పవర్ కనెక్షన్ లేకుండా బయట ప్రదేశాల్లో కూడా పార్టీని ఎక్కువ సమయం ఎంజాయ్ చేయడానికి ఇందులో.. పెద్ద 4800 mAh రీఛార్జబుల్ బ్యాటరీని ఇచ్చారు. ఒక సారి పూర్తి ఛార్జ్ చేస్తే కొన్ని గంటల పాటు నాన్‌స్టాప్ మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. తక్కువ సమయంలోనే బ్యాటరీ ఫుల్ అయ్యే ఫాస్ట్ ఛార్జింగ్ అవకాశం కూడా ఇందులో ఉంది.

5. ధర:

అన్ని ప్రీమియం ఫీచర్లు కలిగిన ఈ సౌత్‌టెక్ థండర్ 40W బ్లూటూత్ పార్టీ టవర్ స్పీకర్ మార్కెట్లో వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ ఫారమ్‌లలో కేవలం రూ. 998 ధరకే అందుబాటులో ఉంది. అతి తక్కువ బడ్జెట్‌లో బిగ్ స్పీకర్ పవర్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

తక్కువ ధరలో భారీ సౌండ్, డ్యూయల్ డ్రైవర్లు, ఆర్జీబీ లైట్లు ,మంచి బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి సౌత్‌టెక్ థండర్ పార్టీ స్పీకర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కొనే ముందు ఆన్‌లైన్ స్టోర్స్‌లో దొరికే ప్రత్యేక ఆఫర్లు లేదా డిస్కౌంట్లను చెక్ చేయడం మంచిది. ఆఫర్లను బట్టి ధరలలో.. మార్పులు ఉండొచ్చు.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×