E-Paper
Advertisement

Prakash Raj: సినీ రంగంలో.. రాజకీయ జోక్యం మరీ ఎక్కువైంది.. మరోసారి ప్రకాష్ రాజ్ పంచ్..!

Prakash Raj: సినీ రంగంలో.. రాజకీయ జోక్యం మరీ ఎక్కువైంది.. మరోసారి ప్రకాష్ రాజ్ పంచ్..!
Advertisement

Prakash Raj: బెంగళూరులో జరుగుతున్న 17వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (బీఐఎఫ్‌ఎఫ్‌ఈఎస్‌) సందర్భంగా నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తెగ వైరల్ అవుతున్నది. ఈ చిత్రోత్సవానికి ఈ ఏడాది ప్రకాష్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ రంగంలో పెరుగుతున్న రాజకీయ జోక్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఇటీవలి కాలంలో సినిమా ఉత్సవాలు, సాహిత్య కార్యక్రమాల్లో రాజకీయ ప్రభావం ఎక్కువైందని ప్రకాష్ రాజ్ అన్నారు. అయితే కొంతమంది హీరోలు ఇప్పుడు రాజకీయ నాయకులు అయిన సంగతి తెలిసిందే. వాళ్ల కోసమే ఇలా ఇన్ డైరెక్ట్ గా ప్రకాష్ రాజ్ పంచ్ వేశారు అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

ఇక ఇదే వేదికపై ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..ఒకప్పుడు స్వేచ్ఛగా ఆలోచనలు పంచుకునే వేదికలుగా ఉన్న ఈ ఉత్సవాలు ఇప్పుడు రాజకీయ నిర్ణయాల వల్ల పరిమితమవుతున్నాయని చెప్పారు. ఇది కళలకు మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు.

అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పాలస్తీనా సినిమాలను ప్రదర్శించకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ప్రకాష్ రాజ్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న బాధలు..భావోద్వేగాలు కూడా సినిమాల ద్వారా మనకు తెలిసే అవకాశం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి సినిమాలను అడ్డుకోవడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.

Advertisement

ఈ సందర్భంగా ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేశారు. కేరళ ప్రభుత్వం కేంద్ర నిర్ణయాన్ని కాదని పాలస్తీనా సినిమాలను ప్రదర్శించిందని గుర్తు చేశారు. అదే విధంగా కర్ణాటక ప్రభుత్వం కూడా ధైర్యంగా ముందుకు వచ్చి ఆ సినిమాలను ప్రదర్శించాలని కోరారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నిలబడితే మార్పు సాధ్యమవుతుందని అన్నారు.

చిత్రోత్సవాల అసలైన ఉద్దేశం విభిన్న సంస్కృతులు, ఆలోచనలు, జీవిత అనుభవాలను పంచుకోవడమేనని ప్రకాష్ రాజ్ తెలిపారు. కానీ రాజకీయాల వల్ల ఆ ఉద్దేశం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. మన కథలు విదేశాల్లో గుర్తింపు పొందితే ఆనందపడతాం. అలాగే ఇతర దేశాల కథలను కూడా మనం గౌరవించాలన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ..సమాజ హితం కోరే సినిమాలకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.

ALSO READ: Bhagavanthudu Teaser: రా అండ్ రస్టిక్ గా తిరువీర్ సినిమా.. ఆకట్టుకుంటున్న భగవంతుడు టీజర్..

Related News

మారెమ్మపై రవితేజ ఫుల్ కాన్ఫిడెంట్.. సినిమా చూశాక ఏమన్నాడంటే!

విశ్వక్ సేన్ ‘లెగసీ’.. ఈసారి రాజకీయాలతో రచ్చ చేయబోతున్నాడా?

మీర్జాపూర్‌కు పిచ్చ క్రేజ్.. రెండో రోజు కలెక్షన్స్ చూస్తే షాక్

జగమే సంగీతం పై చిరు ప్రశంసలు… చాలా గర్వంగా ఉందంటూ పోస్ట్!

గన్స్.. గ్రేహౌండ్స్.. మధ్యలో శ్రీవిష్ణు.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ ఎలా ఉందంటే!

సుమలత క్షమాపణలు చెప్పాలి.. ఫెడరేషన్ కు శేఖర్ మాస్టర్ ఫిర్యాదు!

ఫ్యాన్స్ గెట్ రెడీ…బాలయ్య NBK 111 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఆదర్శ కుటుంబం విడుదలపై నాగ వంశీ క్లారిటీ.. ఒకేసారి ఇన్ని అప్డేట్స్ ఏంటీ చింటూ!

Big Stories

Advertisement
×