AA23 Update : అల్లు అర్జున్.. ఈ పేరిపుడు బ్రాండ్. పుష్ప 2 తో రికార్డులు తిరగరాసిన బన్నీ ప్రస్తుతం రాకా సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ జోరుగా సాగుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు కూడా.అయితే AA23గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ ఇపుడు మీడియాలో తెగ హైలెట్ అవుతుంది.అదే …పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించనుందని.
ముచ్చటగా మూడోసారి
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటకు సిల్వర్ స్క్రీన్ పైన ఎలాంటి క్రేజ్ ఉందొ చెప్పక్కర్లేదు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ (2017) బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ చూస్తె, 2020 సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురంలో’ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఆ సినిమాలోని పాటలు, వీరిద్దరి కెమిస్ట్రీకి మూవీ లవర్స్ లో మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ హిట్ పెయిర్ AA23 కోసం మరోసారి జోడీ కట్టబోతుండటంతో మురిసిపోతున్నారు బన్నీ ఫ్యాన్స్. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’ (LCU) కి ఏమాత్రం సంబంధం లేకుండా, ఒక పవర్ ఫుల్ ఇండిపెండెంట్ కథతో లోకేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉందట.
also read :ఒక్క డ్రెస్ ధర 1,491 కోట్లా?.. రేటుతోనే చెమటలు పట్టిస్తున్న బాలీవుడ్ బ్యూటీ..!
2027 ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం
ఇక మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు మరో మెయిన్ ఎస్సెట్ గా నిలువబోతున్నాడు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్. ఒకవైపు అల్లు అర్జున్, లోకేశ్ కనగరాజ్, మరో వైపు పూజా హెగ్డే, అనిరుద్.. ఇలా అందరూ సక్సెస్ ఫుల్ కావడంతో ఈ మూవీపై హైప్ ఒక రేంజ్ లోపెట్టేసుకున్నాయ్ ట్రేడ్ సర్కిల్స్.ఇక . అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ షూటింగ్ కంప్లీట్ కాగానే ఈ ఏడాది చివరలో లేదా 2027 ప్రారంభంలో AA23 సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.
ఫుల్ స్వింగ్‌లో ఉన్న పూజా
మరోవైపు పూజా హెగ్డే కెరీర్ కూడా ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లోనే ఉందండోయ్ . గతేడాది రజినీకాంత్ ‘కూలీ’ సినిమాలో మోనికా సాంగ్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగానే కనిపిస్తుంది. దళపతి విజయ్‌తో ఆమె నటించిన ‘జయనాయగన్’ రిలీజ్ కి రెడీ అవుతుండగా , తెలుగులో దుల్కర్ సల్మాన్ సరసన DQ41లో హీరోయిన్ గా ఈ బుట్ట బుమ్మే కనిపించనుంది.
అటు తమిళంలో రాఘవ లారెన్స్‌తో ‘కాంచన 4’ షూటింగ్ లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది .ఇక ఇన్ని బిజీ షెడ్యూల్స్ మధ్యలో కూడా బన్నీ సినిమా పట్టేసిందంటే బుట్ట బొమ్మ లక్కు మాములుగా లేదని చెప్పాలి.చూడాలి మరి రాకా తర్వాత రానున్న ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ ని తిరగరాస్తుందో !
also read :స్కూల్ ఈవెంట్ వివాదంలో చిక్కుకున్న రాజీవ్ కనకాల.. అసలు ఏం జరిగిందంటే?