E-Paper
Advertisement

హైడ్రా ఉత్సాహనికి హైకోర్టు బ్రేక్.. బతుకమ్మ కుంటలో కుప్పకూలిన కలకలు

హైడ్రా ఉత్సాహనికి హైకోర్టు బ్రేక్.. బతుకమ్మ కుంటలో కుప్పకూలిన కలకలు
Advertisement

Bathukamma Kunta: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ మహానగరంలోని చారిత్రక కుంట బతుకమ్మ కుంట కథ మళ్లీ మొదటికొచ్చింది. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో సర్కారు ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా కాపాడి, పునరుద్దరించిన బతుకమ్మ కుంటలో హై కోర్టు ఆదేశాల మేరకు హైడ్రా ఏర్పాటు చేసిన సౌకర్యాలను మొత్తం తొలగిస్తున్నారు. హైడ్రా చొరవ తో బతుకమ్మ కుంటను గుర్తించటంతో పాటు కోట్లాది రూపాయలను వెచ్చించి, సుందర వనంగా తీర్చిదిద్దిన సంగతి తెల్సిందే. చిన్నారులు మొదలుకుని, వయోవృద్ధులకు కూడా సౌకర్యవంతంగా హైడ్రా అనేక రకాల అభివృద్ది పనులను చేపట్టడంతో పాటు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ కుంటను పునరుద్దరించిన సంగతి తెల్సిందే.

చిన్నారుల కోసం..

కోర్టు ఆదేశాల మేరకు తొలుత బోర్డులు వంటివి తొలగించిన హైడ్రా ఇపుడు చిన్నారులు ఆడుకునే పరికరాలను కూడా తొలగించటాన్ని స్థానికులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. బతుకమ్మ కుంట పునరుద్దరణతో కుంట పరిసర ప్రాంతాల ప్రజలు ఎంతో మురిసిపోయారు. కానీ కుంటలో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఆట పరికరాలను తొలగించేందుకు వచ్చిన సిబ్బందిని అడ్డుకున్నారు. డైలీ కుంట పరిసర ప్రాంతాల్లో ఆడుకునే చిన్నారులు రోధిస్తూ, ఆట పరికరాలను తొలగించొద్దంటూ వేడుకునే దృశ్యాలు కూడా కన్పించాయి.

Advertisement

Also read: మేడ్చల్ సర్కార్ దవాఖానలో దారుణం.. సమయానికి రాని డాక్టర్లు.. రోడ్డుపైనే రోగులు!

ప్రత్యేక లైటింగ్..  

కొందరు చిన్నారులు, స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేయటంతో పోలీసులు రంగ ప్రవేశం చేయటంతో అక్కడ స్వల్పంగా ఉద్రిక్తత నెలకొంది. వాకర్లు, వయోవృద్ధులను ఆకట్టుకునేందుకు చక్కటి పచ్చదనాన్ని ఏర్పాటు చేయటంతో పాటు వాకింగ్ ట్రాక్ లు రాత్రి పూట బతుకమ్మ కుంట మరింత అందంగా ఆకర్షనీయంగా కన్పించేలా ప్రత్యేక లైటింగ్ ను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. కానీ వీటన్నింటిని ఏర్పాటు చేసిన హైడ్రాయే స్వయంగా వాటిని తొలగించటం పట్ల మళ్లీ బతుకమ్మ కుంట కళావిహీనంగా మారటంతో కుంట కథ మొదటికొచ్చినట్టయింది.

Advertisement

Also Read: భీంనగర్‌లో సినిమా చూపిస్తున్న అధికారులు.. ఆదర్శమా లేక రాజకీయమా?

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×