BigTV English

Pooja Hegde : పాన్ ఇండియా హీరోనే లైన్లో పెట్టేసింది.. అస్సలు ఊహించి ఉండరు సుమీ..!

Pooja Hegde : పాన్ ఇండియా హీరోనే లైన్లో పెట్టేసింది.. అస్సలు ఊహించి ఉండరు సుమీ..!

Pooja Hegde : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలు అందరు సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.. ఈమధ్య గత రెండేళ్లుగా ఈమె చేస్తున్న సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగులుతున్నాయి. దాంతో ఐరన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.. రీసెంట్ గా ఈ ఏడాది రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా పర్వాలేదనిపించింది . ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న పూజ హెగ్డే గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పాన్ ఇండియా హీరోపై మోజు పడిందని తెలుస్తుంది.. ఆ హీరో ఎవరో ఒకసారి చూసేద్దాం..


ఐరన్ లెగ్ హీరోయిన్.. 

టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి స్టార్ డమ్ తెచ్చుకుంది. తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా ఈమె వరుసగా సినిమాలు చేసింది.. అయితే ఈమధ్య ఈ అమ్మడు చేస్తున్నారు సినిమాలు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. స్టార్ హీరోలతో సినిమాలు చేసిన సరే అవి వర్కౌట్ కాలేదని చెప్పాలి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దళపతి వంటి స్టార్ హీరోలతో నటించింది.. తెలుగులో ఇటీవల సినిమాలు రాలేదు. కానీ హిందీలో అలాగే తమిళంలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తుంది.


పాన్ ఇండియా హీరో పై మోజు.. 

పూజా హెగ్డే ఈ మధ్య ప్రేమలో ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలు పై పూజ హెగ్డే ఎక్కడా స్పందించి క్లారిటీ ఇచ్చిన దాఖలాలు లేవు.. తాజాగా ఓ ఈ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ హీరో పై తనకున్న ప్రేమను బయట పెట్టింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. రాజమౌళి బాహుబలి 3 తీస్తే మాత్రం అందులో తనను హీరోయిన్‌గా తీసుకోమని అడుగుతానని పూజా హెగ్డే చెప్పింది. తనకు రాజమౌళి అంటే ఎంతో ఇష్టమని అంది. ప్రభాస్ తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశగా ఉన్నట్లు తన కోరికను బయటపెట్టింది. మరి ఈ అమ్మడు కోరిక నెరవేరుతుందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

Also Read: ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 31 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

తెలుగులో పూజా చిత్రాలు.. 

ముకుంద మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. డీజే మూవీతో హాట్ హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, సూపర్‌స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాల నుంచి ఆమె అనూహ్యంగా తప్పుకోవడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.. ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతి పోగొడుతూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది..

Related News

Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్.. అమ్మాయి ఎవరంటే..?

Mokshagna: నందమూరి మోక్షజ్ఞ కొత్త లుక్.. ఇలా మారిపోయాడేంటి ?

Rao Bahadur Teaser: ఆకట్టుకుంటున్నరావు బహదూర్ టీజర్.. సత్యదేవ్ గెటప్ చూశారా?

Peddi Movie : ‘పెద్ది ‘ సాలిడ్ అప్డేట్.. గ్లోబల్ స్టార్ క్రేజీ లుక్..ఫ్యాన్స్ కు పండగే..

War 2 Collections: దారుణంగా పడిపోయిన వార్ 2 కలెక్షన్లు… భారీ నష్టాలు తప్పేలా లేదు

Big Stories

×