E-Paper
Advertisement

Poonam Kaur: స్టార్ హీరోయిన్ పై పూనమ్ ఇన్ డైరెక్ట్ కామెంట్.. దొంగ తిరుగుడెందుకు?

Poonam Kaur: స్టార్ హీరోయిన్ పై పూనమ్ ఇన్ డైరెక్ట్ కామెంట్.. దొంగ తిరుగుడెందుకు?

Poonam Kaur:ప్రముఖ స్టార్ హీరోయిన్ పూనమ్ కౌర్ (Poonam Kaur).. ఒకప్పుడు సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది. పలు విషయాలపై స్పందించే ఈమె గత కొన్ని రోజులుగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు అన్యాయం చేశాడని, తన జీవితాన్ని నాశనం చేశాడు అంటూ పోస్ట్లు పెడుతోంది. ముఖ్యంగా ‘మా’లో కంప్లైంట్ చేసినా తనకు న్యాయం జరగలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక నిత్యం ఏదో ఒక విషయంపై స్పందించే ఈమె.. గతంలో ఒక స్టార్ హీరోయిన్ మళ్ళీ పెళ్లి చేసుకున్నప్పుడు సంచలన కామెంట్లు చేసి.. ఇప్పుడు మరోసారి అదే హీరోయిన్ పైనే కామెంట్లు చేసిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం

హీరోయిన్ మోజులో పడి.. భార్యను కోమాలోకి పంపించిన డైరెక్టర్..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. “ఒక డైరెక్టర్ పెళ్లయి, ఒక పాపకు జన్మనిచ్చిన తర్వాత ఆమెను వదిలేసి ఏకంగా స్టార్ హీరోయిన్ మోజులో పడి కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురి చేసాడు. ఇక ఆ డైరెక్టర్ దాడికి ఆమె వారం రోజులు కోమా లోకి కూడా వెళ్ళిపోయింది. ఆ హీరోయిన్ ఫంక్షన్లలో స్టేజ్ పై కనిపిస్తూ సందడి చేస్తుంటే.. ఆయన భార్య మాత్రం అనుభవించిన నరకాన్ని ఎవరికీ చెప్పకుండా దారుణమైన జీవితాన్ని గడుపుతోంది. ముఖ్యంగా ఈ పరిస్థితిని ఎవరికి చెప్పుకోలేకపోవడం అత్యంత దురదృష్టకరం” అంటూ పూనమ్ కామెంట్లు చేసింది.

మన ఇల్లు బాగుండాలని.. ఇతరుల కొంప కూలుస్తామా?

ఇక ప్రస్తుతం పూనమ్ కౌర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్లు చేసింది అంటూ ఆరా తీస్తున్నారు. అంతేకాదు గతంలో ఈమె చేసిన కామెంట్లను కూడా బయటకు తీస్తూ నెటిజన్స్.. ఈమె చేసిన కామెంట్స్ ఆమెను ఉద్దేశించినవేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో..” మరో ఆడదాని కోసం కట్టుకున్న భార్యను ఇలా హింసిస్తారా? మన ఇల్లు బాగుండాలని పక్క వాళ్ళ కొంప కూల్చడం సరైనదేనా? అంటూ పూనమ్ ప్రశ్నించింది. ముఖ్యంగా సమంత – రాజ్ వివాహం చేసుకున్నప్పుడే పూనమ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తో వీరిని ఉద్దేశించే ఈ కామెంట్ చేసిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

ALSO READ;Kishore Tirumala: కిషోర్ డ్రీం ప్రాజెక్టు కోసం రంగంలోకి స్టార్ హీరో.. త్రివిక్రమ్ కి పోటీ ఇస్తున్నారా?

పూనమ్ పై మండిపడుతున్న హీరోయిన్ అభిమానులు..

దీనికి తోడు ఇప్పుడు మళ్లీ ఇదే విషయాన్ని ఈమె హైలెట్ చేస్తూ కామెంట్లు చేయడంతో మళ్లీ సమంత, రాజ్ లను ఉద్దేశించి ఈ కామెంట్లు చేసిందని నెటిజన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన సమంత అభిమానులు ఈమెపై మండిపడుతూ దొంగ తిరుగుడు ఎందుకు? ఏదైనా ఉంటే ధైర్యంగా బయటకి చెప్పు ? అంటూ విరుచుకుపడుతున్నారు. మొత్తానికైతే పూనమ్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈమె పైనే విమర్శలు గుప్పిస్తూ ఉండడం గమనార్హం. మరి దీనిపై పూనమ్ మళ్ళీ ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×