E-Paper
Advertisement

Kishore Tirumala: కిషోర్ డ్రీం ప్రాజెక్టు కోసం రంగంలోకి స్టార్ హీరో.. త్రివిక్రమ్ కి పోటీ ఇస్తున్నారా?

Kishore Tirumala: కిషోర్ డ్రీం ప్రాజెక్టు కోసం రంగంలోకి స్టార్ హీరో.. త్రివిక్రమ్ కి పోటీ ఇస్తున్నారా?
Advertisement

Kishore Tirumala:ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఎప్పుడైతే మైథలాజికల్ కాన్సెప్ట్ లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆధారంగా చేసుకుని సినిమా చేయబోతున్నారు అని వార్తలు వినిపించాయో.. అప్పటినుంచి ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తొలిసారి మైథలాజికల్ కాన్సెప్ట్ తో స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిని ఆయన ఎలా చిత్రీకరించబోతున్నారు అని ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో ప్రముఖ డైరెక్టర్ కిషోర్ తిరుమల (Kishore Tirumala) తన డ్రీం ప్రాజెక్టు గురించి బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు.

డ్రీమ్ ప్రాజెక్టును బయటపెట్టిన కిషోర్ తిరుమల..

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రవితేజ (Raviteja) తో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమా తీశారు కిషోర్ తిరుమల. సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టిన ఈయన పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా విశేషాలతోపాటు తన కెరియర్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన డ్రీం ప్రాజెక్టు గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. కిషోర్ తిరుమల మాట్లాడుతూ..” మైథలాజికల్ కాన్సెప్ట్ లో ‘గౌరీ తనయ’ అనే టైటిల్ తో నాలుగు సంవత్సరాల క్రితమే సుబ్రహ్మణ్యస్వామిని బేస్ చేసుకుని నేను ఒక సినిమా కథను రాసుకున్నాను. అయితే ఇది భారీ బడ్జెట్ తో కూడుకున్న చిత్రం. అటు బడా నిర్మాతలతో పాటు స్టార్ కాస్ట్ కూడా ఉండాలి. స్టార్ టెక్నీషియన్లు కూడా ఈ సినిమా కోసం పనిచేయాలి. వారందరూ దొరికితే నేను అనుకున్న గౌరీ తనయ ప్రాజెక్టు తెరపైకి వస్తుంది” అని తన కోరికను బయటపెట్టిన విషయం తెలిసిందే.

గౌరీ తనయా కోసం స్టార్ హీరో..

Advertisement

అయితే ఇప్పుడు తాజాగా కిషోర్ తిరుమల డ్రీమ్ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి..అసలు విషయంలోకి వెళ్తే నాచురల్ స్టార్ నాని(Nani )తన తదుపరి చిత్రం కోసం కిషోర్ తిరుమల దర్శకత్వంలో పౌరాణిక ఫాంటసీ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గౌరీ తనయ అనే టైటిల్ తో ఈ చిత్రం గాడ్ ఆఫ్ వార్ కార్తికేయుడి కథను సమకాలిన అంశాలతో మేళవించి తెరకెక్కనుంది.

త్రివిక్రమ్ కి పోటీ ఇవ్వనున్నారా?

ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అటు త్రివిక్రమ్ కూడా ఇదే కాన్సెప్ట్ లో ఏకంగా అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నారు. కొంపతీసి కిషోర్ తిరుమల ఏకంగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కు పోటీగా వెళ్లనున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈ రెండు ప్రాజెక్టులు కూడా కార్తికేయుడు కథను బేస్ చేసుకుని తెరపైకి వస్తే ఏ చిత్రం ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

నాని తదుపరి చిత్రాలు..

Advertisement

నాని విషయానికి వస్తే ప్రస్తుతం ది ప్యారడైజ్, బ్లడీ రోమియో వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. అటు డైరెక్టర్ కే కాదు ఇటు హీరోకి కూడా ఇది వినూత్న ప్రయోగం అనే చెప్పాలి. మరి ఈ వినూత్న ప్రయోగం ఫలిస్తే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తారని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ:Jana Nayagan: జన నాయగన్ రీమేక్ కాదు.. ఇదెక్కడి లాజిక్?

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×