Poonam Kaur: అందాల భామ పూనమ్ కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాయాజాలం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన పూనమ్ మొదటి సినిమాతోనే తన అందంతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది .ప్రతి ఒక్కరూ ఈమె టాలీవుడ్ ను ఏలుతుంది అని అనుకున్నారు. ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించిన పూనమ్.. స్టార్ హీరోయిన్ కాదు కదా కనీసం ఇండస్ట్రీలో నటిగా కూడా కొనసాగలేకపోయింది. దానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్, డైరెక్టర్ త్రివిక్రమ్ అని అందరికీ తెలిసిన విషయమే.
త్రివిక్రమ్ వల్లే తన జీవితం నాశనం అయిందని పూనమ్ ఎన్నోసార్లు బయటపెట్టింది. తనకు అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని ఎప్పటికప్పుడు సినీ పెద్దలను కలుస్తూనే ఉంది. పవన్ హీరోగా నటించిన జల్సా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మొదట పూనమ్ ను అనుకున్నారట. కానీ, త్రివిక్రమ్ పూనమ్ ను పక్కకి తొలగించి ఆ ప్లేస్ ని పార్వతి మెల్టన్ తో రీప్లేస్ చేయించాడు. అంతేకాకుండా పవన్ తో పూనమ్ రిలేషన్ లో ఉందని, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుందని, దానిని గురూజీ అడ్డుకున్నాడని, పవన్ దగ్గరకు ఆమెను వెళ్ళనీయకుండా త్రివిక్రమ్ అడ్డుగోడగా నిలబడ్డాడని, దానివల్లనే ఆమె జీవితం నాశనమైందని ఎన్నోసార్లు చెప్పకు వచ్చింది.
ఇప్పటికీ కూడాపూనమ్.. త్రివిక్రమ్ పై చర్యలు తీసుకోవాలని పోరాడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె కుదిరినప్పుడల్లా పవన్ ను, త్రివిక్రమ్ ను సోషల్ మీడియా ద్వారా ఏకీపారేస్తూ ఉంటుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూనమ్ తాజాగా యోగాడే శుభాకాంక్షలు తెలిపింది .ఇందులో అంతా వివాదం అయ్యే విషయం ఏముంది అని అనుకోవచ్చు. అయితే ఆమె జమ్మూ కాశ్మీర్లో ఒక కుక్క యోగాసనాలు వేస్తున్న వీడియోను షేర్ చేసి లవ్ సింబల్ జోడించింది. ఇది కేవలం యాదృచ్ఛికమే అయినా కూడా పవన్ ను తిట్టిందని వార్తలు వస్తున్నాయి.
ఇక యోగా డే రోజున ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అందరూ కలిసి యోగ యోగా దినోత్సవంలో పాల్గొన్న విషయం తెలిసిందే. మొదటిసారి పవన్ యోగా దినోత్సవం లో పాల్గొనడం పెద్ద సంచలనంగా మారింది. ఇక సోషల్ మీడియా మొత్తం పవన్ యోగా చేస్తున్న ఫోటోలే ట్రెండ్ అయ్యాయి. అదే రోజు పూనమ్.. కుక్క యోగా చేస్తున్న ఫోటోను షేర్ చేయడంతో .. పవన్ ను ఆమె కుక్కతో పోల్చిందని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ అయితే ఆమెను తిట్టిపోస్తున్నారు.
ఒకప్పుడు పవన్ ను నువ్వు ప్రేమించినదానివే కదా. ప్రేమించినవాడిని ఇప్పుడు కుక్కతో పోలుస్తున్నావు.. నువ్వు అసలు ఆడదానివేనా..? అని అంటుండగా.. ఇంకో పక్క మరికొందరు పూనమ్ కు మద్దతు తెలుపుతున్నారు. అంత మోసం చేసిన వాడిని కుక్కతో కాదు ఇంకా దారుణంగా తిట్టినా తప్పు లేదని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పూనమ్ ఎన్ని చేసినా కూడా త్రివిక్రమ్ గాని పవన్ కళ్యాణ్ గాని ఏ రోజు స్పందించింది లేదు. మరి పూనమ్ ఈ పనులన్నీ కేవలం ఫేమస్ అవ్వడానికే చేస్తుందా.. ? అనేది తెలియాల్సి ఉంది.
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 21, 2025