E-Paper
Advertisement

అందుకే జైల్లో కన్నీళ్లు పెట్టుకున్నా.. పోసాని కృష్ణమురళి ఎమోషనల్..

అందుకే జైల్లో కన్నీళ్లు పెట్టుకున్నా.. పోసాని కృష్ణమురళి ఎమోషనల్..
Advertisement

Posani Emotional: ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తన జైలు జీవితానికి సంబంధించిన ఒక ఎమోషనల్ సంఘటనను ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సాధారణంగా ఎంతో ధైర్యంగా, గంభీరంగా మాట్లాడే పోసాని.. జైల్లో ఉన్న సమయంలో ఒకే ఒక్క సందర్భంలో కన్నీళ్లు పెట్టుకున్నట్లు స్వయంగా వెల్లడించారు. అది కూడా ఏదో భయంతోనో, బాధతోనో కాదు.. కేవలం తన వాళ్ల ఫోన్ నంబర్లు గుర్తుకు రాకపోవడం వల్లేనని ఆయన చెప్పుకొచ్చారు.

Read also-ఆ రూమర్లకు చెక్ పెడుతూ కుమార్తె ఆరాధ్యతో కలిసి కాన్స్ ఫెస్టివల్‌కు ఐశ్వర్యరాయ్!

ఫోన్ మాట్లాడే అవకాశం ఇచ్చినా..

Advertisement

జైల్లో ఉన్న సమయంలో అక్కడి ఉన్నతాధికారులు పోసానికి ఒక మంచి అవకాశం ఇచ్చారు. రోజుకు ఒకసారైనా ఇంట్లో వాళ్లతో లేదా భార్యతో ఫోన్ మాట్లాడవచ్చునని అధికారులు ఆయనకు తెలిపారు. దీంతో తన భార్యకు ఫోన్ చేద్దామని అనుకున్న పోసానికి ఊహించని సమస్య ఎదురైంది. ఆయనకు తన భార్య ఫోన్ నంబర్ గానీ, కనీసం పిల్లల ఫోన్ నంబర్లు గానీ అస్సలు గుర్తుకు రాలేదు. ఎంత ప్రయత్నించినా పది అంకెల నంబర్లు మైండ్‌లోకి రాకపోవడంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఇప్పటికీ అవేంటో తెలీదు..

ఈ కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌లు, వాట్సాప్‌లు వాడుతుంటే, పోసాని మాత్రం ఇప్పటికీ పాతకాలపు నోకియా కీప్యాడ్ ఫోన్‌నే వాడుతుంటానని తెలిపారు. తనకు వాట్సాప్ గానీ, ఇతర ఆధునిక టెక్నాలజీలు గానీ ఏమాత్రం తెలియవని స్పష్టం చేశారు. నంబర్లను ఫోన్‌లో చూసి డైరెక్ట్ చేయడం తప్ప, వాటిని గుర్తుపెట్టుకునే అలవాటు లేకపోవడంతో జైల్లో ఫోన్ లేని సమయంలో తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది.

అరగంట పాటు ఏడ్చేసిన పోసాని

Advertisement

తన సొంత నంబర్ కూడా తనకు తెలియకపోవడంతో అక్కడి ఎస్పీ సైతం మొదట నమ్మలేదని పోసాని చెప్పారు. “నిజంగానే నాకు నంబర్లు తెలియవు సార్” అని అధికారులకు వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. భార్య నంబర్ కూడా గుర్తుకు తెచ్చుకోలేకపోతున్నాననే బాధతో దాదాపు అరగంట పాటు అక్కడే కన్నీళ్లు పెట్టుకున్నానని ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో అధికారులు ఆయనను ఓదారుస్తూ ప్రశాంతంగా ఆలోచించమని కూర్చోబెట్టారు.

Read also-Podarillu Today Episode : నారాయణను మార్చిన మహా.. టెన్షన్ పడుతున్న చక్రీ.. మహాను తీసుకొచ్చేందుకు ప్రతాప్ ప్లాన్..

చివరకు గుర్తొచ్చిన క్లాస్‌మేట్ నంబర్

ఎంత ఆలోచించినా కుటుంబ సభ్యుల నంబర్లు గుర్తుకు రాకపోగా.. చివరకు ఆయనకు తన చిన్ననాటి క్లాస్‌మేట్, ప్రస్తుతం సిఐగా పనిచేస్తున్న పూర్ణచంద్రరావు నంబర్ మాత్రం లక్కీగా గుర్తొచ్చింది. ఆ తర్వాత జైలుకు వచ్చిన ఆయన భార్య.. పోసాని వాడుతున్న ఫోన్ వెనుక భాగంలో ఒక పేపర్ ముక్కపై నంబర్లన్నీ రాసి ఇచ్చిందని, ఆ తర్వాతే నంబర్ల సమస్య తీరిందని పోసాని నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. తానేమీ తప్పు చేసి జైలుకు వెళ్లలేదు కాబట్టి జైలు జీవితంపై తనకు ఎలాంటి భయం గానీ, బాధ గానీ కలగలేదని, కేవలం ఈ నంబర్ల విషయంలోనే ఒక్కసారి కళ్లల్లో నీళ్లు తిరిగాయని పోసాని ఈ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×