Aishwarya Cannes: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026’ వేడుకలకు బాలీవుడ్ స్టార్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ దూరం కానుందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. అయితే, ఆ రూమర్లన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ గురువారం రాత్రి ముంబై విమానాశ్రయంలో ఆమె సందడి చేశారు. తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి ఐశ్వర్య కాన్స్ వేడుకల కోసం ఫ్రాన్స్ బయలుదేరారు.
Read also-సీక్రెట్‌గా వివాహం చేసుకున్న కంగనా రనౌత్?.. ఆ మంగళసూత్రం వెనుక అసలు నిజం ఇదే..
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆల్-బ్లాక్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతూ ఐశ్వర్య క్లాసీ లుక్‌లో కనిపించారు. అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లకు నవ్వుతూ అభివాదం చేయడమే కాకుండా, లోపలికి వెళ్లే ముందు ఒక చిన్నారి అభిమానితో ఓపికగా ఫోటో దిగారు. కుమార్తె ఆరాధ్య కూడా తల్లితో పాటే ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది.
52 ఏళ్ల ఐశ్వర్యరాయ్ గత రెండు దశాబ్దాలుగా కాన్స్ వేడుకల్లో భారతదేశానికి ప్రధాన ముఖచిత్రంగా నిలిచారు. అయితే, ఇటీవల ప్రముఖ అంతర్జాతీయ బ్యూటీ బ్రాండ్ ‘లోరియల్’ తమ తాజా కాన్స్ క్యాంపెయిన్ వీడియోను విడుదల చేసింది. ఇందులో అలియా భట్, వియోలా డేవిస్, ఎవా లాంగోరియా వంటి గ్లోబల్ అంబాసిడర్లు కనిపించారు కానీ, ఐశ్వర్యరాయ్ ఎక్కడా కనిపించలేదు. దీంతో ఈ ఏడాది ఐశ్వర్య కాన్స్ ఫెస్టివల్‌ను స్కిప్ చేయబోతోందా? అంటూ అభిమానుల్లో పెద్ద ఎత్తున అనుమానాలు మొదలయ్యాయి. కానీ, ఇప్పుడు ఆమె నేరుగా కాన్స్ వేడుకలకే పయనం కావడంతో ఆ రూమర్లన్నీ పటాపంచలయ్యాయి.
Read also-రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్‌పై ప్రియాంకా చోప్రా క్రేజీ రియాక్షన్!.. ‘ఫైర్’ అంటూ.
ఐశ్వర్యరాయ్‌కు కాన్స్‌తో 24 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆమె మొదటిసారిగా 2002లో ‘దేవదాస్’ సినిమా ప్రీమియర్ కోసం షారుఖ్ ఖాన్, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీలతో కలిసి కాన్స్ రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టారు. ఆ తర్వాత 2003 నుంచి సదరు బ్రాండ్‌కు అంబాసిడర్‌గా మారి, ప్రతి ఏడాది క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ప్రతిసారి ఆమె ధరించే వినూత్నమైన గౌన్లు, సాంప్రదాయక శారీలు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. ఈ ఏడాది కూడా ఆమె రెడ్ కార్పెట్ లుక్ కోసం ఫ్యాషన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.