E-Paper
Advertisement

జైలు జీవితం గురించి పోసాని చెప్పింది వింటే షాక్ అవుతారు.. అవన్నీ నిజాలు కావా!

జైలు జీవితం గురించి పోసాని చెప్పింది వింటే షాక్ అవుతారు.. అవన్నీ నిజాలు కావా!
Advertisement

Posani Jail: ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తన అరెస్ట్, జైలు జీవితంపై వస్తున్న పలు రూమర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. జైల్లో తన ఆరోగ్యం క్షీణించిందని, ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారంటూ అప్పట్లో మీడియాలో వచ్చిన కథనాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన జైల్లో తన దినచర్య మరియు ఆరోగ్య పరిస్థితి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Read also-మెగాస్టార్ ‘MEGA158’ షూటింగ్ షురూ.. సిటీ కాలేజీలో చిరంజీవి, అనస్వరా రాజన్!

జైల్లోనూ బ్రహ్మాండమైన నిద్ర

Advertisement

సాధారణంగా జైలుకు వెళ్లిన వారు అక్కడి వాతావరణానికి అలవాటు పడలేక, ఆందోళనతో నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు. కానీ పోసాని మాత్రం జైల్లో తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పారు. “నేనేమీ తప్పు చేసి జైలుకు వెళ్లలేదు.. కాబట్టి నా మనస్సాక్షి చాలా ప్రశాంతంగా ఉంది. అందుకే జైల్లో కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా, ప్రతిరోజూ బ్రహ్మాండంగా గురకపెట్టి మరీ నిద్రపోయేవాడిని” అని ఆయన నవ్వుతూ పేర్కొన్నారు. మంచం మీద పడుకున్న ఐదు నిమిషాల్లోనే తనకు గాఢ నిద్ర పట్టేసేదని తెలిపారు.

రోజుకు ఐదు సార్లు

తనకు మొదటి నుండి చన్నీళ్లతో స్నానం చేయడం చాలా ఇష్టమని, ఆ అలవాటును జైల్లో కూడా కొనసాగించానని పోసాని వెల్లడించారు. జైలు గదిలో ఉన్నప్పుడు రోజుకు కనీసం నాలుగు నుండి ఐదు సార్లు చన్నీళ్లతో స్నానం చేసేవాడినని చెప్పారు. ఉదయం, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 4 గంటలకు, రాత్రి 9 గంటలకు పడుకునే ముందు రాత్రి 10:30 గంటల ప్రాంతంలో.. ఇలా ఐదుసార్లు స్నానం చేసి ఎంతో హుషారుగా ఉండేవాడినని తన జైలు దినచర్యను వివరించారు.

Advertisement

Read also-విజయ్ కొత్త కేబినెట్‌.. ఆపై విజయసాయిరెడ్డి విసుర్లు, మహా తమిళనాడు ద్రోహం

బీపీ, షుగర్ గురించి..

ఆయన అరెస్ట్ అయిన సమయంలో ‘పోసాని ఆరోగ్యం సహకరించట్లేదు’, ‘హెల్త్ చెకప్స్ చేయిస్తున్నారు’ అంటూ వచ్చిన హెడ్‌లైన్స్‌ను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. తనకు బీపీ, షుగర్ లాంటి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు. “నాకు ఎలాంటి రోగాలు లేవు.. ఉంటే దాచడానికి అవేమైనా డబ్బులా? ఇప్పుడు కూడా నేను మీకంటే వేగంగా పరిగెత్తగలను” అంటూ ఇంటర్వ్యూయర్‌తో సరదాగా వ్యాఖ్యానించారు. తన ఆరోగ్యంపై అప్పట్లో వచ్చినవన్నీ తప్పుడు ప్రచారాలేనని, తాను జైల్లో శారీరకంగా, మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని పోసాని ఈ సందర్భంగా తేల్చిచెప్పారు.

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×