E-Paper
Advertisement

విజయ్ కొత్త కేబినెట్‌.. ఆపై విజయసాయిరెడ్డి విసుర్లు, మహా తమిళనాడు ద్రోహం

విజయ్ కొత్త కేబినెట్‌.. ఆపై విజయసాయిరెడ్డి విసుర్లు, మహా తమిళనాడు ద్రోహం
Advertisement

Amaravati: వైసీపీ ఎగ్జిట్ నేత విజయసాయిరెడ్డి మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చేశారా? ఏదో విధంగా నిత్యం వార్తల్లో ఉండేందుకు ఆయన ఇష్టపడుతున్నారా? ఆయన చెబుతున్న డెడ్ లైన్ వచ్చేస్తోంది? పార్టీ-ఛానెళ్ల వ్యవహారం ఎంతవరకు వచ్చింది? ఆయన బీజేపీ స్టాండ్ తీసుకున్నట్లు కనిపిస్తోందా? తాజాగా విజయ్ కేబినెట్‌లోని కాంగ్రెస్ చేరడంపై హాట్ కామెంట్స్ చేశారాయన.

విజయ్ కొత్త కేబినెట్‌.. ఆపై విజయసాయిరెడ్డి విసుర్లు

Advertisement

వైసీపీ ఎగ్జిట్ నేత విజయ సాయిరెడ్డి గురించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆయన వ్యవసాయం చేసుకుంటూ భూమిలో కలుపు మొక్కలను తొలగిస్తున్నారు. రాజకీయాలు ఆయనకు కొట్టిన పిండి. సమయం, సందర్భాన్ని తనకు అనుకూలంగా మలచుకునే నేతల్లో ఒకరు. నిత్యం ఏదో విధంగా వార్తల్లోకి ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

మీడియా ముందుకు రాకపోయినా ఎక్స్ ద్వారా ఆయన ఆలోచనను బయటపెడుతుంటారు. తమిళనాడులోని విజయ్ కేబినెట్ విస్తరణ గురువారం జరిగింది. మరో 23 మందికి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి విజయ్ కేబినెట్‌లో మిత్రపక్షాలకు చోటు దక్కింది. కాకపోతే కమ్యూనిస్టులు పదవులు తీసుకోవడానికి దూరంగా ఉన్నారు.

Advertisement

 మహా తమిళనాడు ద్రోహం అంటూ కాంగ్రెస్‌ని టార్గెట్ చేశారు

తమిళనాడులో విజయ్ ప్రభుత్వంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం చూసిన తర్వాత తనకు కాంగ్రెస్‌ పార్టీ తీరు ఎలా ఉందో అర్ధమవుతుందని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. పాత మిత్రుడితో కాంగ్రెస్ పార్టీ బంధాన్ని తెంచుకోవడాన్ని ప్రధానంగా ఆయన గుర్తు చేశారు. పార్లమెంటులో కాంగ్రెస్‌కు అండగా నిలుస్తోంది డీఎంకే పార్టీ.

కేవలం రెండు మంత్రి పదవుల కోసం చిరకాల మిత్రుడు డీఎంకేతో సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించిందని ప్రస్తావించారు. రాజకీయాలు అధికారం గురించే కావచ్చు కానీ, పొత్తులపై నమ్మకం, విధేయత అవసరమని తేల్చేశారు. ఇది మహా తమిళనాడు ద్రోహం అంటూ పేర్కొన్నారు. మరి ఇంతకీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ, ఛానెల్ ఎప్పుడు వస్తున్నాయంటూ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు ఆయన హార్డ్ కోర్ అభిమానులు.

ALSO READ: ఎబోలా వైరస్ ఎఫెక్ట్.. భారత్ – ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సు వాయిదా.. కేంద్రం కీలక ప్రకటన

Related News

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు

Big Stories

Advertisement
×