E-Paper
Advertisement

విజయ్ దళపతిపై పోసాని సంచలన వ్యాఖ్యలు!

విజయ్ దళపతిపై పోసాని సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Posani on Vijay: కోలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విజయ్ దళపతి మరికొన్ని రోజుల్లో తమిళనాడుకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎక్కడ చూసిన ఆయన పేరే ప్రథమంగా వినిపిస్తోంది. పైగా ఆయనను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. మరి కొంతమంది సోషల్ మీడియా ద్వారా ఆయనపై కామెంట్లు చేస్తున్నారు.. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి కూడా విజయ్ దళపతి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

విజయ్ పై పోసాని సంచలన కామెంట్స్..

తాజాగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ..” 1996 నుంచి నాకు విజయ్ బాగా తెలుసు. వాళ్ళ నాన్న కోలీవుడ్ డైరెక్టర్ ఎస్. ఏ.చంద్రశేఖర్ కూడా నాకు బాగా పరిచయస్తులు. విజయ్ ది పాకులాడే మనస్తత్వం కాదు. ఆయన చుట్టూ ఎన్ని గొడవలు ఉన్నా కూడా ఎంతో సంయమనంతో ఉంటాడు . దళపతి విజయ్ ను అభిమన్యుడిని చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కుట్ర పన్నుతున్నారు. గవర్నర్ కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. గవర్నర్ ని కూడా ఆయన విమర్శించలేదు. కురుక్షేత్ర యుద్ధంలో పద్మ వ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా విజయ్ దళపతి పరిస్థితి అయిపోయింది.. మరి ఈ వ్యూహాన్ని ఛేదించి ఆయన త్వరగా ప్రమాణ స్వీకారం చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ పోసాని కామెంట్లు చేశారు. ప్రస్తుతం పోసాని చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

ALSO READ:విజయ్ చిన్ననాటి క్లాస్ రూమ్ ఫోటో వైరల్.. ఆయనను మీరు గుర్తుపట్టారా?

సింహం సింగిల్ అయినా.. పొత్తు తప్ప లేదా?

ఇకపోతే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ టీవీకే పార్టీ ద్వారా పోటీ చేసి ఏకంగా 108 సీట్లు కైవసం చేసుకున్నారు. కానీ మెజారిటీకి కొంత దూరంలో నిలిచిపోయారు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే పార్టీకి 118 సీట్లు రావాల్సి ఉంటుంది. కేవలం 10 సీట్ల కారణంగా విజయ్ ఇప్పుడు అయోమయంలో పడిపోయారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ తో పాటు ఇతర చిన్న పార్టీల మద్దతు కోసం టీవీకే పార్టీ ప్రయత్నిస్తోంది. మరొకవైపు ఏఐఏడీఎంకే లోని ఒక వర్గం కూడా విజయ్ కి మద్దతు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు.. ఆ పార్టీ నాయకత్వంతో విభేదాలున్న ఎమ్మెల్యేలు టీవీకే వైపు చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే టీవీకే పార్టీ ముందు నుంచి ఒంటరిగానే పోటీ చేస్తోంది.అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మరో 10 సీట్ల కోసం పొత్తు అనివార్యమైంది. మరి దీనిపైన విజయ్ ప్రయత్నాలు చేస్తుంటే గవర్నర్ పక్షపాతం చూపిస్తున్నాడు అన్నట్టుగా పోసాని కామెంట్ చేస్తున్నారు. ఇక అన్నీ సర్దుమణిగి పొత్తు కుదుర్చుకొని త్వరలోనే ప్రమాణస్వీకారం చేయాలని కూడా ఆయన కోరినట్లు సమాచారం.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×